Mirai Trailer Launch
ఎంటర్‌టైన్మెంట్

Manchu Manoj: ‘మిరాయ్’ మూవీతో వెయ్యి కోట్లు కొడుతున్నాం

Manchu Manoj: సూపర్ హీరో తేజ సజ్జా (Teja Sajja) హీరోగా నటించిన మోస్ట్ ఎవైటెడ్ పాన్-ఇండియా విజువల్ వండర్ ‘మిరాయ్‌’ (Mirai). ఇందులో తేజ సజ్జా సూపర్ యోధ పాత్రలో అలరించబోతున్నారు. ఈ చిత్రానికి కార్తీక్ ఘట్టమనేని దర్శకత్వం వహిస్తుండగా.. రాకింగ్ స్టార్ మనోజ్ మంచు పవర్ ఫుల్ పాత్రను పోషించారు. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్‌పై టిజి విశ్వ ప్రసాద్, కృతి ప్రసాద్ భారీ స్థాయిలో నిర్మిస్తున్నారు. ఇప్పటికే విడుదలైన గ్లింప్స్, టీజర్, బిటిఎస్ వీడియో, వైబ్ ఉంది సాంగ్ మ్యాసీవ్ బజ్‌ను క్రియేట్ చేయగా.. తాజాగా చిత్ర థియేట్రికల్ ట్రైలర్‌ని మేకర్స్ విడుదల చేశారు. సెప్టెంబర్ 12న ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా ఎనిమిది భాషల్లో 2డి, 3డి ఫార్మాట్లలో విడుదల కానుంది. ఇక ఈ ట్రైలర్ లాంచ్ కార్యక్రమంలో మంచు మనోజ్ (Manchu Manoj) మాట్లాడుతూ.. సినిమా గురించి ఆసక్తికర విషయాలు చెప్పుకొచ్చారు.

Also Read- Shilpa Shirodkar: సుధీర్ బాబు ‘జటాధర’లో నమ్రత శిరోద్కర్ సోదరి.. ఫస్ట్ లుక్‌‌తోనే వణికిస్తుందిగా!

అశోకుడు రాసిన 9 గ్రంథాల గురించి
‘‘మిరాయ్ సినిమాపై చాలా కలలు ఆశలు ఉన్నాయి. దాదాపు మూడేళ్ల క్రితం ఈ ప్రయాణం ప్రారంభమైంది. నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు టీమ్‌కు థాంక్స్‌. చాలా పవర్ ఫుల్ రోల్. నిజంగా నా జీవితంలో ఇలాంటి పాత్ర ఇప్పటివరకూ చేయలేదు. ‘హను-మాన్‌’ వంటి హిట్ అందుకున్న తర్వాత వరుసగా సినిమాలు చేసి డబ్బులు సంపాదించాలని అంతా అనుకుంటారు. అలా అనుకోవడంలో తప్పు లేదు. కానీ, తేజ ‘మిరాయ్’ కోసం మూడేళ్లు వేచి చూశాడు. మధ్యలో ఎలాంటి అవకాశం వచ్చినా చేయలేదు. నిజంగా ఇది మామూలు విషయం కాదు. తన జీవితంలో ఇంకెంతో గొప్ప స్థాయికి వెళ్లాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. నాకు సినిమా నాలెడ్జ్ బాగా ఉందని అనుకున్నాను. కానీ, ఈ సినిమా దర్శకుడు కార్తిక్‌‌ని కలిసిన తర్వాత అసలు నాకు ఏమీ తెలియదని అర్థమైంది. ఆయన ఆరేళ్ల క్రితం రెడీ చేసుకున్న కథ ఇది. అశోకుడు రాసిన 9 గ్రంథాల గురించి ప్రపంచానికి చెప్పాలనే సంకల్పంతో ఈ సినిమా నేపథ్యం ఉంటుంది.

Also Read- Artificial Beach: హైదరాబాద్‌కు కృత్రిమ సముద్రం.. బీచ్ ఏర్పాటుకు ప్లాన్స్ రెడీ.. ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్

ఇలాంటి నిర్మాత ఇండస్ట్రీకి అవసరం
ఈ సినిమాను ఇంటర్నేషనల్ స్థాయిలో, హాలీవుడ్‌ను బీట్ చేసేలా నిర్మించారు. నిర్మాత విశ్వప్రసాద్‌ నాకు ఎప్పటి నుంచో తెలుసు. వాళ్ళ పాప కృతి ప్రసాద్ నాకు చెల్లెలు లాంటిది. నా చెల్లెలు ఈరోజు ఇంత పెద్ద ప్రొడక్షన్‌కి ప్రొడ్యూసర్ అయిందంటే చాలా హ్యాపీగా ఉంది. విశ్వప్రసాద్‌ గొప్ప వ్యక్తి. తెలుగు సినిమాపై ఉన్న ప్యాషన్‌తో ఈ రంగంలోకి వచ్చారు. ప్రభాస్ అన్న చేస్తున్న ‘ది రాజాసాబ్‌’ కోసం ఎంత చేస్తున్నారో.. మా ‘మిరాయ్‌’కు కూడా అంతే చేస్తున్నారు. ఆయనకు సినిమా చిన్నదా? పెద్దదా? అనే తేడాలు ఉండవు. ఇలాంటి నిర్మాతను నేను ఇప్పటివరకూ చూడలేదు. విశ్వ ప్రసాద్ వంటి నిర్మాతలు ఇండస్ట్రీకి కావాలి. శ్రియాతో కలిసి నటించాలని ఎప్పటినుంచో కోరిక ఉంది. ఈ చిత్రంతో అది తీరింది. ఇందులో పవర్ ఫుల్ క్యారెక్టర్ చేశాను. ఇంత పవర్ఫుల్ పాత్ర ఇచ్చిన డైరెక్టర్‌కి ధన్యవాదాలు. ‘మిరాయ్’ సినిమా సూపర్ డూపర్ హిట్ అవ్వాలని కోరుకుంటున్నాను. అలాగే ఈ సినిమా వెయ్యి కోట్లు కలెక్ట్ చేయాలని, చేస్తుందని ఆ భగవంతుని కోరుకుంటున్నాను’’ అని మంచు మనోజ్ తన ప్రసంగంలో పేర్కొన్నారు.

స్వేచ్ఛ ఈ – పేపర్ కోసం https://epaper.swetchadaily.com/ ఈ లింక్ క్లిక్ చేయగలరు

Just In

01

Telangana politics: బీజేపీలో బిగ్ డిస్కషన్.. ఆపరేషన్ ఆకర్ష్ కవిత వర్తిస్తుందా..?

Minister Sridhar Babu: పరిశ్రమల ఏర్పాటుకు ఇక్కడ అన్నీ అనుకూలమే!

CBI Director Praveen Sood: హైదరాబాద్ వచ్చిన సీబీఐ డైరెక్టర్ ప్రవీణ్​ సూద్.. అందుకోసమేనా..?

Jajula Surender: సమీక్షలు కాదు సత్వర చర్యలు చేయండి: జాజుల సురేందర్

KTR: రాబోయే ఆరు నెలల్లో ఉప ఎన్నికలు ఖాయం.. కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు