Sparsh Srivastava
ఎంటర్‌టైన్మెంట్

Naga Chaitanya: నాగ చైతన్య 24వ చిత్రంలో ‘లాపతా లేడీస్’ నటుడు.. ఎవరో తెలుసా?

Naga Chaitanya: ‘బాహుబలి’, ‘ఆర్ఆర్ఆర్’, ‘పుష్ప’ చిత్రాల సక్సెస్ తర్వాత టాలీవుడ్ రేంజ్ అమాంతం పెరిగింది. ఇప్పుడన్నీ ఇండస్ట్రీల చూపు టాలీవుడ్ పైనే ఉన్నాయంటే ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు. ఒకప్పుడు టాలీవుడ్ అంటే చిన్న చూపు చూసిన వారు కూడా.. ఇప్పుడు టాలీవుడ్‌లో అవకాశాల కోసం ఎగబడుతున్నారు. బాలీవుడ్ స్టార్ హీరోయిన్లు కూడా ఇప్పుడు టాలీవుడ్ స్టార్స్‌తో జతకడుతున్నారు. దీపికా పదుకొనే, కియారా అద్వానీ, ప్రియాంకా చోప్రా వంటి వారంతా టాలీవుడ్‌లో సినిమాలు చేస్తున్నారు. అలాగే సంజయ్ దత్, ఇమ్రాన్ హష్మీ, బాబీ డియోల్ వంటి వారు కూడా తెలుగులో బిజీ నటులుగా కొనసాగుతున్నారు. రామ్ చరణ్, బుచ్చిబాబు సానా కాంబోలో రాబోతున్న ‘పెద్ది’ (Peddi) సినిమాతో మీర్జాపూర్‌’ సిరీస్‌ ఫేమ్‌, బాలీవుడ్‌ స్టార్ యాక్టర్ దివ్యేందు శర్మ టాలీవుడ్‌కు పరిచయం అవుతున్నారు. ఇప్పుడు కొత్తగా మరో బాలీవుడ్ నటుడు టాలీవుడ్ ఎంట్రీ ఇస్తున్నారు. ఆ వివరాల్లోకి వెళితే..

Also Read- Chiranjeevi vs Prabhas: చిరంజీవికి పోటీగా ప్రభాస్ సినిమా.. సంక్రాంతికి ఆసక్తికర పోరు!

చైతూ సినిమాతో ఎంట్రీ
‘తండేల్’ వంటి బ్లాక్ బస్టర్ సక్సెస్ తర్వాత యువ సామ్రాట్ నాగ చైతన్య (Naga Chaitanya) చేస్తున్న చిత్రం ‘NC24’. ‘విరూపాక్ష’ దర్శకుడు కార్తీక్ దండు (Karthik Dandu) ఈ సినిమాను నెవర్ బిఫోర్ మిథికల్ థ్రిల్లర్‌గా రూపొందిస్తున్నారు. శ్రీ వెంకటేశ్వర సినీ చిత్ర LLP (SVCC), సుకుమార్ రైటింగ్స్ బ్యానర్లపై బివిఎస్ఎన్ ప్రసాద్, సుకుమార్ బి ఈ చిత్రాన్ని భారీ బడ్జెట్‌తో, అత్యాధునిక సాంకేతిక విలువలతో నిర్మిస్తున్నారు. బాపినీడు సమర్పకుడు. ఈ సినిమాతో బాలీవుడ్‌కు చెందిన మరో నటుడు టాలీవుడ్ ఎంట్రీ ఇవ్వబోతున్నారు. ఆయన ఎవరో కాదు.. ‘లాపతా లేడీస్’ పేమ్ స్పార్ష్ శ్రీవాస్తవ. ఈ విషయాన్ని స్వయంగా మేకర్స్ అధికారికంగా ప్రకటిస్తూ.. స్పార్ష్ శ్రీవాస్తవ‌కు స్వాగతం పలికారు.

‘లాపతా లేడీస్’ (Lapatha Ladies)తో స్టార్ ఇమేజ్
స్పార్ష్ శ్రీవాస్తవ (Sparsh Srivastava) టెలివిజన్ నటుడిగా అందరిచే గుర్తింపును పొందారు. సినిమాల్లో కూడా ఆయన నటిస్తూ వస్తున్నారు కానీ, కిరణ్ రావు దర్శకత్వంలో వచ్చిన ‘లాపతా లేడీస్’ సినిమా స్పార్ష్ శ్రీవాస్తవకు మంచి గుర్తింపును, ఇమేజ్‌ను క్రియేట్ చేసింది. ఆ సినిమా తర్వాత ఆయనకు వరుస అవకాశాలు పలకరిస్తున్నాయి. ఇప్పుడు తొలిసారి తెలుగులోనూ ఎంట్రీ ఇచ్చేందుకు సిద్ధమయ్యారు. తాజాగా ఆయన సెట్స్‌లోకి ఎంటరైనట్లుగా మేకర్స్ తెలిపారు. ఈ పాత్ర ఆయన కెరీర్‌లో పాత్-బ్రేకింగ్ అవుతుందని ‘NC24’ టీమ్ తెలుపుతోంది.

Also Read- Akhanda 2 Postponed: పవన్ కళ్యాణ్ కోసం బాలయ్య త్యాగం.. అందుకే రావడానికి లేట్!

త్వరలోనే మరిన్ని డిటైల్స్
‘NC24 – The Excavation Begins’ పేరుతో వచ్చిన ఫస్ట్ గ్లింప్స్ ఎలాంటి బజ్‌ని క్రియేట్ చేసింది తెలియంది కాదు. సినిమా స్కేలు, ఇంటెన్స్ మూడ్‌ని ప్రజెంట్ ఫ్యాన్స్, సినిమా లవర్స్ అందరినీ ఆకట్టుకోవడమే కాకుండా, చైతూకి మరో హిట్ పడబోతుందనే హింట్ ఇచ్చేసింది. మైథ్-బేస్డ్ థ్రిల్లర్స్‌కి కొత్త బౌండరీలు చూపించేలా ఒక వరల్డ్-క్లాస్ సినిమాగా ఈ సినిమాను రూపొందిస్తున్నారు. ప్రస్తుతం హైదరాబాద్‌లో ప్రత్యేకంగా వేసిన భారీ సెట్‌లో నెక్స్ట్ షెడ్యూల్ వచ్చే నెల నుంచి మొదలుకానుందని, సినిమాకు సంబంధించి త్వరలోనే మరిన్ని వివరాలను తెలియజేస్తామని ఈ సందర్భంగా టీమ్ తెలిపింది.

స్వేచ్ఛ ఈ – పేపర్ కోసం https://epaper.swetchadaily.com/ ఈ లింక్ క్లిక్ చేయగలరు

Just In

01

CM Revanth Reddy: నిమజ్జనానికి సింపుల్ గా సీఎం.. ఏమైనా ఇబ్బందులున్నాయా?

Leaves denied: బ్రదర్ పెళ్లికి లీవ్స్ ఇవ్వలేదని ఓ మహిళా ఉద్యోగి తీసుకున్న నిర్ణయం ఇదీ

Students Protest: మా సార్ మాకు కావాలి.. నిరసనకు దిగిన విద్యార్థులు

Dhanush: మరో తెలుగు డైరెక్టర్‌కి ధనుష్ గ్రీన్ సిగ్నల్.. ఆ దర్శకుడెవరో తెలుసా?

Gaddam Prasad Kumar: మహిళల ఆర్థిక అభివృద్ధే ప్రభుత్వ లక్ష్యం.. గడ్డం ప్రసాద్ కీలక వ్యాఖ్యలు