Akhanda 2 Postponed: మాస్ యాక్షన్ ఎంటర్‌టైనర్ గా ‘అఖండ 2’ రూపొందుతున్న విషయం తెలిసిందే.’గాడ్ ఆఫ్ మాసెస్’ నందమూరి బాలకృష్ణ, దర్శకుడు బోయపాటి శ్రీను కాంబినేషన్లో వస్తున్న ‘అఖండ 2’ (Akhanda 2 Postponed) ఇప్పటికే ప్రేక్షకుల్లో భారీ అంచనాలు ఉన్నాయి. తాజాగా ఈ సినిమా విడుదల గురించి అప్డేట్ ఇచ్చారు నిర్మాతలు. ముందుగా సెప్టెంబర్ 25 విడుదల చేస్తామని ప్రచారం చేశారు. అయితే కొన్ని కారణాల వల్ల ఈ సినిమా వాయిదా పడిందని తెలిపారు. దీనికి సంబంధించిన అధికారిక నోట్ ను సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. అయితే ఎప్పుడు ఈ సినిమా విడుదల చేస్తారు అన్న విషయం తెలపలేదు.
Read also-Chiranjeevi vs Prabhas: చిరంజీవికి పోటీగా ప్రభాస్ సినిమా.. సంక్రాంతికి ఆసక్తికర పోరు!
‘అఖండ 2’ చిత్రం భారతీయ సినిమాలో అత్యంత ఆసక్తిగా ఎదురుచూస్తున్న ప్రాజెక్టులలో ఒకటి. ఇప్పటికే విడుదలైన టీజర్ అన్ని భాషల్లో సంచలనం సృష్టించి, అంచనాలను మరో స్థాయికి చేర్చింది. ఈ స్థాయి చిత్రం కోసం రీ-రికార్డింగ్, వీఎఫ్ఎక్స్, మొత్తం పోస్ట్-ప్రొడక్షన్ పనులకు అత్యంత శ్రద్ధ అవసరం. ‘అఖండ’ బ్లాక్‌బస్టర్ విజయం తర్వాత వచ్చిన అంచనాలను దృష్టిలో ఉంచుకుని, చిత్రాన్ని అత్యుత్తమంగా అందించడానికి అదనపు సమయం పెడుతున్నాము. ఈ ప్రాజెక్ట్ పట్ల బృందం చాలా ఉత్సాహంగా ఉంది. ‘అఖండ 2’ని ఒక అపూర్వమైన స్థాయిలో, రాజీలేని నాణ్యతతో, అద్భుతమైన విజువల్స్‌తో, అత్యుత్తమ థియేట్రికల్ ఎక్స్‌పీరియన్స్‌తో అందించడానికి రాత్రింబవళ్లు కృషి చేస్తున్నాం. ఈ నేపథ్యంలో, గతంలో ప్రకటించిన సెప్టెంబర్ 25 తేదీకి బదులుగా, విడుదల తేదీని త్వరలో ప్రకటించే విధంగా మార్చాలని నిర్ణయించాము. మేము అన్ని అంచనాలను మించి, ప్రేక్షకులకు వేచి ఉండే విలువైన థియేట్రికల్ అనుభవాన్ని అందించడానికి పూర్తిగా కట్టుబడి ఉన్నాము.’ అంటూ రాసుకొచ్చారు నిర్మాతలు.
Read also-Viral Video: రూ.200 కోట్ల బంగ్లాలో.. వీధి కుక్కకు చోటిచ్చిన షారుక్.. మనసు గెలిచేశాడు భయ్యా!
#Akhanda2 – AN IMPORTANT ANNOUNCEMENT.#Akhanda2Thaandavam
'GOD OF MASSES' #NandamuriBalakrishna #BoyapatiSreenu @AadhiOfficial @MusicThaman @14ReelsPlus @iamsamyuktha_ @RaamAchanta #GopiAchanta #MTejeswiniNandamuri @kotiparuchuri @ivyofficial2023 pic.twitter.com/3cKUSuehyS— 14 Reels Plus (@14ReelsPlus) August 28, 2025
ఇంతకు ముందు బాలయ్య బాబు ‘అఖండ 2: తాండవం’, పవన్ కళ్యాణ్ ‘ఓజీ’ సినిమాలు ఒకే రోజులు విడుదల కానున్నాయి. ఇప్పుడ అనేక కారణాల వల్ల ‘అఖండ 2’ సినిమా వాయిదా పడింది. బాలయ్య ఫ్యాన్స్ దీనిని పవన్ కళ్యాణ్ గురించే బాలయ్య మూవీ వాయిదా వేశారని చెప్పుకుంటున్నారు. ఏది ఏమైనా ఏం చూడాలో తెలియని ఫ్యాన్స్ కు ఇప్పుడు క్లారిటీ వచ్చింది. అఖండ 2 సినిమా విడుదల కొసం అభిమానులు వేచి చూస్తున్నారు. అయితే ఈ సినిమా దసరా కానుకగా రాబోతుందని కొందరు అంచనా వేస్తున్నారు.