Chiranjeevi vs Prabhas: మెగాస్టార్ చిరంజీవి (Megastar Chiranjeevi), రెబల్ స్టార్ ప్రభాస్ (Rebel Star Prabhas) మధ్య బాండింగ్ ఎలా ఉంటుందో తెలియంది కాదు. చిరంజీవి అంటే ప్రభాస్‌కు అమితమైన ఇష్టం. ఇండస్ట్రీలో ప్రభాస్ ఫ్రెండ్స్‌లో ప్రథమ స్థానంలో ఉండే వ్యక్తి ఎవరయ్యా? అంటే అందరూ రామ్ చరణ్ పేరే చెబుతారు. ఈ విషయం స్వయంగా ప్రభాస్ కూడా ‘అన్‌స్టాపబుల్ విత్ ఎన్‌బికె’ షో లో తెలిపారు. అలాంటి బాండింగ్ ఉన్న చిరు, ప్రభాస్‌ల మధ్య పోటీ ఏర్పడితే.. అవును అదే జరగబోతుంది. రాబోయే సంక్రాంతికి చిరంజీవి, ప్రభాస్‌ల మధ్య ఆసక్తికర పోరు జరగబోతుంది. అనుకున్నట్లుగా ప్రభాస్ ‘ది రాజా సాబ్’ సినిమా సంక్రాంతికి వాయిదా పడింది. ఈ విషయాన్ని స్వయంగా నిర్మాత అధికారికంగా ప్రకటించారు.
‘మిరాయ్’ (Mirai) ట్రైలర్ వేడుకలో ‘ది రాజా సాబ్’ రిలీజ్ డేట్
గురువారం హైదరాబాద్‌లో జరిగిన తేజ సజ్జా ‘మిరాయ్’ ట్రైలర్ లాంచ్ వేడుకలో.. ‘ది రాజా సాబ్’ (The Raja Saab) మూవీ రిలీజ్ డేట్‌ని నిర్మాత అధికారికంగా ప్రకటించారు. ఈ రెండు సినిమాలను పీపుల్ మీడియా ఫ్యాక్టరీ పతాకంపై టీజీ విశ్వప్రసాద్ నిర్మిస్తున్న విషయం తెలిసిందే. ప్రభాస్ ‘ది రాజా సాబ్’ చిత్రాన్ని జనవరి 9వ తేదీన ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్‌గా విడుదల చేయబోతున్నాం. ఇందులో ఇక ఎలాంటి మార్పు ఉండదని ఆయన క్లారిటీ ఇచ్చేశారు. పండక్కి వస్తున్న ‘మన శంకర వర ప్రసాద్ గారు’కి ఫస్ట్ ప్రయారిటీ ఉన్నా.. ‘ది రాజా సాబ్’ని సంక్రాంతికి విడుదల చేయకతప్పడం లేదని ఆయన తెలిపారు.
Also Read- SV Krishna Reddy: ఎస్వీ కృష్ణారెడ్డి 43వ సినిమా ‘వేదవ్యాస్’.. ఈ సినిమా స్పెషల్ ఏంటంటే?
ముందే ఫిక్సైన ‘మన శంకర వర ప్రసాద్ గారు’
చిరంజీవి, అనిల్ రావిపూడి కాంబోలో రూపుదిద్దుకుంటున్న ‘మన శంకర వర ప్రసాద్ గారు’ (Mana Shankara Vara Prasad Garu) సినిమాను ఓపెనింగ్ రోజే.. రాబోయే సంక్రాంతికి అని మేకర్స్ అధికారికంగా ప్రకటించారు. ఆ డేట్‌కి వచ్చేందుకు సినిమా షూటింగ్‌ని కూడా శరవేగంగా పూర్తి చేస్తున్నారు. ఇప్పటికే చాలా వరకు షూటింగ్ పూర్తయినట్లుగా కూడా మేకర్స్ అధికారికంగా ప్రకటించారు. అసలీ సినిమాకు ట్యాగ్‌లైనే ‘పండగకు వస్తున్నారు’ అని పెట్టారు. అందులోనూ అనిల్ రావిపూడి సంక్రాంతి సెంటిమెంట్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం కూడా లేదు. లాస్ట్ సంక్రాంతికి వచ్చిన ‘సంక్రాంతికి వస్తున్నాం’ సినిమా కలెక్షన్ల సునామీనే సృష్టిచింది. అందుకే మళ్లీ సంక్రాంతికి అనిల్ రావిపూడి సినిమా ఉండటంతో, అందులోనూ చిరంజీవి సినిమా కావడంతో.. చాలా వరకు సినిమాలు సంక్రాంతి రేసు నుంచి తప్పుకుంటున్నాయి.
Also Read- Teja Sajja: హీరోయిన శ్రేయను ర్యాగింగ్ చేసిన తేజ సజ్జా!.. ఎందుకో తెలుసా?
సంక్రాంతి బరిలో ఉన్న సినిమాలివే..
చిరంజీవి ‘మన శంకర వర ప్రసాద్ గారు’ కంటే ముందే సంక్రాంతి బరిలో చోటు రిజర్వ్ చేసుకున్న చిత్రం నవీన్ పోలిశెట్టి ‘అనగనగా ఒక రాజు’. ఈ సినిమా ఎప్పటి నుంచో చిత్రీకరణ జరుపుకుంటోంది. మధ్యలో నవీన్ పోలిశెట్టికి యాక్సిడెంట్ కావడంతో చిత్రీకరణ ఆగిపోయింది. ప్రస్తుతం ఈ సినిమా శరవేగంగా చిత్రీకరణ జరుపుకుంటోంది. ఇందులో మీనాక్షి చౌదరి హీరోయిన్‌గా నటిస్తోంది. అలాగే రవితేజ76 సినిమా కూడా సంక్రాంతి బరిలో అని ప్రకటించారు. కానీ, పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. ఇప్పుడు ‘ది రాజా సాబ్’ కొత్తగా సంక్రాంతి లిస్ట్‌లోకి చేరింది. ఇవి కాకుండా.. కోలీవుడ్ స్టార్ హీరో విజయ్ నటిస్తున్న ‘జన నాయగన్’ కూడా సంక్రాంతికి డబ్బింగ్ సినిమాగా విడుదలయ్యే అవకాశాలు ఉన్నాయి. మరి ఫైనల్‌గా సంక్రాంతి బరిలో ఏమేం సినిమాలు దిగుతాయో వేచి చూడాల్సి ఉంది.
స్వేచ్ఛ ఈ – పేపర్ కోసం https://epaper.swetchadaily.com/ ఈ లింక్ క్లిక్ చేయగలరు