TEJA-SAJJA(IMAGE :X)
ఎంటర్‌టైన్మెంట్

Teja Sajja: హీరోయిన్ శ్రేయను ర్యాగింగ్ చేసిన తేజ సజ్జా!.. ఎందుకో తెలుసా?

Teja Sajja: తేజ సజ్జ హీరోగా నటిస్తున్న “మిరాయ్” సినిమా యాక్షన్ డ్రామాగా రూపొందుతున్న విషయం తెలిసిందే. తాజాగా ఈ సినిమా నుంచి ట్రైలర్ ను విడుదల చేశారు నిర్మాతలు. ఈ సినిమాను కార్తిక్ ఘట్టమనేని దర్శకత్వం వహిస్తుండగా, పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్‌పై టీజీ విశ్వప్రసాద్ నిర్మిస్తున్నారు. ఇందులో తేజ సజ్జ “సూపర్ యోధుడు”గా ఒక పవర్‌ఫుల్ పాత్రలో కనిపించనున్నాడు. మంచు మనోజ్ విలన్‌గా, రితికా నాయక్ హీరోయిన్‌గా నటిస్తున్నారు. టీజర్‌లో హాలీవుడ్ రేంజ్ విజువల్స్, తేజ సజ్జ స్టైల్, మాస్ ఎంట్రీ కలిసి ప్రేక్షకుల్లో భారీ హైప్ సృష్టించాయి. ఈ చిత్రంలోని తొలి పాట “వైబ్ ఉంది బేబీ” ఇప్పటికే సోషల్ మీడియాలో ట్రెండింగ్ అవుతోంది. భారీ బడ్జెట్‌తో తెరకెక్కుతున్న ఈ సినిమా కోసం బాలీవుడ్ ప్రముఖ నిర్మాత కరణ్ జోహార్ హిందీ హక్కులు తీసుకోవడం విశేషం. ఈ సినిమాను సెప్టెంబర్ 12, 2025న ప్రపంచ వ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు రానుంది. యాక్షన్, విజువల్స్, సూపర్ హీరో థీమ్ కలిసి ఈ సినిమాపై అంచనాలు ఆకాశాన్ని అంటుతున్నాయి.

Read also-Pushpa 2 Ganesh Mandapam: విచిత్ర మండపం.. పుష్ప 2 స్టైల్లో, బన్నీ విగ్రహంతో.. ఇలా ఉన్నారేంట్రా!

మిరాయ్ ట్రైలర్ రిలీజ్ ఈవెంట్ లో తేజ సజ్జా(Teja Sajja) మాట్లాడుతూ హీరోయిన్ శ్రేయ గురించి కొన్ని ఆసక్తి కర విషయాలు పంచుకున్నారు. తనతో కలిసి నటించిన సినిమాల గురించి గుర్తు చేసుకున్నారు. ‘ఇప్పుడు శ్రేయ బాలీవుడ్ హీరోయిన్. చాలా బిజీగా ఉన్నారు. కథ నచ్చడం వల్ల ఈ సినిమాలో చేయడానికి ఒప్పుకున్నారు. ఆమెతో ‘బాలు’, ‘ఠాగూర్’ ‘ఛత్రపతి’ సినిమాల్లో నటించాను.’ అన్నారు. ఎప్పుడో 2003 లో వచ్చిన ఠాగూర్ సినిమా సినిమాలో హీరోయిన్ ఇప్పటికీ అలాగే ఇప్పడు తన గురించి చెబుతుంటే ఆమెకు ఏం చేయాలో అర్థం కాలేదు. ఆ సమయంలో మాట్లాడటానికి చాలా ఇబ్బంది పడ్డారు. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. అంతే కాకుండా అనేక విషయాలు ప్రేక్షకులతో పంచుకున్నారు.

Read also-SV Krishna Reddy: ఎస్వీ కృష్ణారెడ్డి 43వ సినిమా ‘వేదవ్యాస్’.. ఈ సినిమా స్పెషల్ ఏంటంటే?

ట్రైలర్ రిలీజ్ ఈవెంట్ లో కటౌట్ చూసి చాలా సర్పైజ్ అయ్యానన్నారు. అనంతరం కొంత మంది అడిగిన ప్రశ్నలకు సమాధానాలు ఇచ్చారు. ఈ సారి పాన్ ఇండియా స్టార్ అయిపోతావా ఇప్పుడు అలా పిలవచ్చా అని అని అడిగిన ప్రశ్నకు తేజ స్పందిస్తూ.. ‘నేనే ఇక్కడే పుట్టా, ఇక్కడే పెరిగాను మీతోనే ఉంటాను. మీ మెప్పుకోసమే పనిచేస్తాను అని అన్నారు. నేనే ఏం చేసినా అది ఇక్కడి నుంచే మొదలవుతుందని, దానిని కొన్ని సార్లు వేరే భాషల్లో ఆదరిస్తే అంతకన్నా మంచి ఏం ఉంటుందని.’ చెప్పుకొచ్చారు.

Just In

01

Telangana politics: బీజేపీలో బిగ్ డిస్కషన్.. ఆపరేషన్ ఆకర్ష్ కవిత వర్తిస్తుందా..?

Minister Sridhar Babu: పరిశ్రమల ఏర్పాటుకు ఇక్కడ అన్నీ అనుకూలమే!

CBI Director Praveen Sood: హైదరాబాద్ వచ్చిన సీబీఐ డైరెక్టర్ ప్రవీణ్​ సూద్.. అందుకోసమేనా..?

Jajula Surender: సమీక్షలు కాదు సత్వర చర్యలు చేయండి: జాజుల సురేందర్

KTR: రాబోయే ఆరు నెలల్లో ఉప ఎన్నికలు ఖాయం.. కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు