monsoon rains
జాతీయం

Monsoon: కమాన్.. మాన్‌సూన్

– కేరళ తీరాన్ని తాకిన రుతుపవనాలు
– నాలుగు రోజుల్లో తెలంగాణలోకి ప్రవేశం
– ఈసారి సాధారణం కంటే అధిక వర్షపాతమే
– చల్లని కబురు చెప్పిన వాతావరణ శాఖ

Rainfall: ఉక్కపోత, అధిక ఉష్ణోగ్రతలతో ఉక్కిరి బిక్కిరి అవుతున్న తెలంగాణ వాసులకు శుభవార్త. ఈ ఏడాది అనుకున్న సమయం కంటే కాస్త ముందుగానే నైరుతి రుతుపవనాలు వస్తున్నాయి. గురువారం కేరళను తాకిన రుతుపవనాలు మరో వారం రోజుల్లో తెలంగాణను పలకరించేందుకు వడివడిగా దూసుకొస్తున్నాయి. కేరళతో పాటు ఈశాన్య రాష్ట్రాలను నైరుతి రుతుపవనాలు తాకినట్లుగా వాతావరణ శాఖ వెల్లడించింది.

వారం ముందే తెలంగాణకు రాక

ఇప్పుడున్న వాతావరణ పరిస్థితులు ఇలాగే కొనసాగితే, జూన్ 5 నాటికి తెలంగాణలోనూ ఉష్ణోగ్రతలు తగ్గుతాయని, రుతుపవనాలు ఆవరించే కొద్దీ మంచి వానలు కురుస్తాయని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. వాస్తవానికి జూన్ 10 నాటికి తెలంగాణలోకి రుతుపవనాలు ప్రవేశిస్తాయని తొలుత అధికారులు ప్రకటించినప్పటికీ, సానుకూల వాతావరణం కారణంగా వారం ముందుగానే తెలంగాణను పలకరించనున్నాయి.

ఈసారి కుంభవ‌ృష్టి

ఈసారి రాష్ట్రంలో సాధారణం కంటే అధిక వర్షపాతం నమోదు కానుందని ‌‌‌‌వాతావరణ శాఖ చెబుతోంది. ఈ ఏడాది సాధారణ వర్షపాతమే నమోదవుతుందని ఏప్రిల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో అంచనా వేసిన వాతావరణ శాఖ సెకండ్ ఫోర్ కాస్ట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో మాత్రం సాధారణం కంటే ఎక్కువే వర్షాలు పడతాయని వెల్లడించింది. మొత్తంగా, తెలంగాణలో ఈసారి గతంలో కంటే 106 శాతం కంటే ఎక్కువ వర్షపాతం నమోదవుతుందని వాతావరణ శాఖ అంచనా వేస్తోంది. మరో వారం రోజుల్లో ఎల్‌నినో ప్రభావం తగ్గి, తటస్థ వాతావరణ పరిస్థితులు ఏర్పడతాయని, నైరుతి రుతుపవనాలు ముందుకు సాగే కొద్దీ లానినా పరిస్థితులు వస్తాయని, దీంతో జూన్ 5 నాటికి తెలుగు రాష్ట్రాల్లో వర్షాలు కురిసే అవకాశం ఉందని అధికారులు చెబుతున్నారు.

తమిళనాడుకు రుతుపవనాలు

వేగంగా మారుతున్న వాతావరణ పరిస్థితుల నేపథ్యంలో ఇతర రాష్ట్రాల వాతావరణ శాఖ అధికారులతో ఢిల్లీలోని ఉన్నత అధికారులు వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. నైరుతి రుతుపవనాలు, వర్షాకాలం సీజన్‌పై చర్చించారు. అంచనాలను మరోసారి పరీక్షించుకున్నారు. ఇదిలా ఉండగా కేరళ తీరాన్ని తాకిన నైరుతి రుతుపవనాలు తమిళనాడును కూడా పలకరించాయి.

1 నుంచి తెలంగాణలో వానలు షురూ

రుతుపవనాలు రోజుల వ్యవధిలోనే తెలంగాణకు రానున్నాయి. ఈ నేపథ్యంలో రాష్ట్రానికి సంబంధించి ఐదు రోజుల వాతావరణ అంచనాలను అధికారులు విడుదల చేశారు. ఈ అంచనాల ప్రకారం 31వ తేదీ నుంచి వానలు మొదలవుతాయి. ఆరోజు రాష్ట్రంలో అక్కడక్కడ తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉన్నది. జూన్ 1, 2, 3 తేదీల్లో ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో కూడిన వర్షాలు రాష్ట్రంలోని పలుచోట్ల కురుస్తాయని వాతావరణ శాఖ పేర్కొంది.

ఢిల్లీలో నీటి ఎద్దడి

దేశ రాజధాని ఢిల్లీలో నీటి ఎద్దడి నెలకొంది. హర్యానా నుంచి యమునా నీరు విడుదల కాకపోవడంతో ప్రజలు నీటి ఎద్దడి ఎదుర్కొంటున్నారు. ముఖ్యంగా దక్షిణ ఢిల్లీ, ఉత్తర ఢిల్లీ, నైరుతి ఢిల్లీలోని పలు ప్రాంతాల్లో ఈ సమస్య తీవ్రంగా కనిపిస్తున్నది. ప్రతి రోజు రెండుసార్లు కాకుండా కాలనీకు ఒకసారి మాత్రమే నీటిని విడుదల చేస్తున్నారు. గ్రేటర్ కైలాశ్, లజ్‌పత్ నగర్, పంచశీల్ పార్క్, హౌజ్ ఖాస్, చిత్తరంజన్ పార్క్ ప్రాంతాల్లో నీటి ఎద్దడి ఉన్నది. ఢిల్లీ జల్ బోర్డు అధికారులు వాటర్ ట్యాంకర్ల ద్వారా నీటిని సరఫరా చేస్తున్నారు. అంతేకాదు, నీరు వృధా చేస్తే రూ.2 వేల జరిమానా వేస్తామని ఇది వరకే ఇప్పటికే ప్రభుత్వం ప్రకటించింది.

Just In

01

Gold Kalash robbery: మారువేషంలో వచ్చి జైనమత ‘బంగారు కలశాలు’ కొట్టేశాడు

Director Krish: ‘హరి హర వీరమల్లు’ విషయంలో చాలా బాధగా ఉంది

Kalvakuntla Kavitha: దూకుడు పెంచిన కవిత.. జాగృతిలో భారీగా చేరికలు.. నెక్ట్స్ టార్గెట్ బీసీ రిజర్వేషన్లు!

CV Anand: ప్రతీ పెద్ద పండుగ పోలీసులకు సవాలే .. హైదరాబాద్ సీపీ ఆనంద్ కీలక వ్యాఖ్యలు

Viral Video: యూనివర్శిటీలో దారుణం.. విద్యార్థి చెంపపై 50-60 సార్లు దాడి.. వీడియో వైరల్