Khammam News (imagecredit:swetcha)
నార్త్ తెలంగాణ

Khammam News: నిర్మాణం పూర్తయ్యేనా.. మా కష్టాలు తీరేనా..?

Khammam News: అభివృద్ధి అంటే గిట్టని గత పాలకుల నిర్లక్ష్యానికి నిదర్శనంగా ఈ వంతెన నిలుస్తుంది. గత ప్రభుత్వం తొమ్మిది నెలల్లో పూర్తి చేస్తానని మాటలు చెప్పి ఆ మాటలు నీటి మూటలుగానే మిగిలిపోయిన వైనం ఇక్కడ కనిపిస్తోంది. 8 సంవత్సరాలు కావస్తున్న కలగానే మిగిలిపోతున్న బ్రిడ్జి నిర్మాణం.

వంతెన పూర్తయ్యేది ఎప్పుడు

ఖమ్మం(Khammama) జిల్లా మధిర మండలం ఇల్లూరు గ్రామం నుండి ఖమ్మంపాడు వెళ్లే మార్గంలో ఏటిపై 2017 సంవత్సరంలో ఇప్పుడున్న ముగ్గురు మంత్రుల చేతుల మీదుగా అప్పటి బీఆర్ఎస్(BRS) హయాంలో 17 కోట్ల 40 లక్షల అంచనా వ్యయంతో వంతెన నిర్మాణ పనులకు శంకుస్థాపన చేశారు. అయితే ఇన్నేళ్లు వేచి చూసిన ప్రజలు ఈ వంతెన నిర్మాణం పూర్తయ్యేది ఎప్పుడు అంటూ ప్రశ్నిస్తున్నారు. గత ప్రభుత్వం ఇచ్చిన హామీ గ్రామ ప్రజలు రైతులకు శాపంగా మారిందా అంటే వివరాల్లోకి వెళ్లాల్సిందే.

టిఆర్ఎస్ ప్రభుత్వంలో

టిఆర్ఎస్(BRS) ప్రభుత్వ హయాంలో అప్పటి రోడ్డు భవనాల శాఖ మంత్రి గా తుమ్మల నాగేశ్వరరావు(Tummala Nageswara Rao), ఎంపీగా పొంగిలేటి శ్రీనివాస్ రెడ్డి(Srinivass Reddy), మధిర ఎమ్మెల్యేగా మల్లు భట్టి విక్రమార్క(Bhatti Vikramaraka) ఉన్నారు. నాటి ప్రభుత్వంలో శంకుస్థాపనకు బీజం వేసుకున్న బ్రిడ్జి నిర్మాణం నేటికీ పూర్తి కాకపోవడంతో ప్రజలు అసలు నిర్మాణం పూర్తి అవుతుందా..? కాదా..? అనే డైలమాలో పడ్డారు. సుమారు 8 సంవత్సరాలు పూర్తి కావస్తున్న ఇంకా బ్రిడ్జి నిర్మాణ పనులు పూర్తిస్థాయిలో కాకపోవడంతో ప్రజలు అసహనానికి గురవుతున్నారు. బ్రిడ్జికి ఇరువైపులా 300 మీటర్లు అటు ఇటు రోడ్డు వేయకపోవడంతో బ్రిడ్జి మాత్రం అలంకారప్రాయంగానే మారిపోయింది.

పొలాలు పోయిన నష్టపరిహారం అందలేదు

ఇల్లూరు గ్రామం నుండి ఖమ్మంపాడు వెళ్లే మార్గంలో ఏటిపై నిర్మాణం చేపట్టదలచిన బ్రిడ్జికి ఇరువైపులా అటు 300 మీటర్లు ఇటు 300 మీటర్లు రోడ్డు వేయకపోవడంతో బ్రిడ్జి మాత్రం అలంకారప్రాయంగానే మారిపోయింది. మరోపక్క పొలాలు పోయిన రైతులకు నష్టపరిహారం ఇవ్వకపోవడంతో రోడ్డును అడ్డుకుంటున్నామని చెబుతున్నారు. చెక్ డ్యామ్ పనులు, రోడ్ల పనులు సైతం పెండింగ్లో ఉండడంతో రహదారిపై రాకపోకలు సాగించే ప్రయాణికులు నానా తంటాలు పడుతున్నారు. అదేవిధంగా రహదారికి ఇరువైపులా ఉన్న రైతులు సైతం నిరుత్సాహానికి గురై ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కాంట్రాక్టర్ మాత్రం నాకు నష్టం వచ్చిందంటూ చేతులు దులిపేయడంతో బ్రిడ్జి పనులు అసంపూర్తిగా నిలిచిపోయాయి. బ్రిడ్జి నిర్మాణం పూర్తయిన ఇరువైపులా రోడ్లు వేయకపోవడంతో అన్ని ఉన్న అంగట్లో శని అన్న విధంగా ఇక్కడ గ్రామ ప్రజల పరిస్థితి తయారయింది.

Also Read: KTR: సిరిసిల్ల నేతన్నలు ఆందోళన.. ఆత్మహత్యలే శరణ్యం అంటూ లేఖ?

కాంట్రాక్టర్ పాలిట వరం

గత ప్రభుత్వంలో బ్రిడ్జి నిర్మాణం కాంట్రాక్టర్ పాలిట వరంగా మారిందని అక్కడి ప్రజలు, రైతులు వెల్లడిస్తున్నారు. అయితే కాంట్రాక్టర్కు వరంగా మారినప్పటికీ ప్రజల పాలిట శాపంగా మారింది. కోట్ల రూపాయలు కాంట్రాక్టర్లు ఒప్పుకొని పనుల్ని మధ్యలోనే అర్ధాంతరంగా వదిలి వెళ్లిపోవడం వల్ల ప్రజలకు ఇబ్బందులు ఎదురవుతున్నాయి.

వాహన రాకపోకలకు ఇబ్బందులు

అయితే ఈ బ్రిడ్జి నిర్మాణ పనుల ఆలస్యంతో రహదారిపై వాహన దారుల రాకపోకలకు తీవ్ర ఇబ్బందులు ఏర్పడుతున్నాయి. వాహనాల రాకపోకలు లేవడంతో ఖాళీ నడకబాట మీదుగా ప్రజలు నడవాల్సిన దుస్థితి నెలకొంది. గత కొన్ని సంవత్సరాలుగా అధిక వర్షాలు కురుస్తుండడంతో గ్రామ ప్రజలు ప్రతి వర్షాకాలం రాకపోకల విషయంలో తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. దీంతో ఇతర మార్గాల ద్వారా గమ్యాన్ని చేరుకోవలసిన ఆవశ్యకత ఏర్పడుతుంది. ఈ బ్రిడ్జి పనులు, రహదారి పనులు పూర్తి అయిపోతే ఈ రహదారి గుండా ఖమ్మంపాడు, చిలుకూరు, నందిగానికి దగ్గరగా ఉంటుందని వాహనదారులు వెల్లడిస్తున్నారు. రైతులకు కూడా మందు కట్టలు తీసుకెళ్లేందుకు పండిన పంటను తెచ్చుకోవడానికి రవాణా ఖర్చులు ఎక్కువగా చెల్లించుకోవాల్సిన పరిస్థితులు ఏర్పడ్డాయని రైతులు వాపోతున్నారు.

గత ప్రభుత్వంలో వంతెన నిర్మాణం అసంపూర్తిగా, నిరుపయోగంగా ఉంది. దీనికి ఇరువైపులా రోడ్డు లేకపోవడంతో వంతెన నిర్మాణం అడవిలో కాచిన వెన్నెలలా మారిపోయింది. అసలే మా గ్రామం తెలంగాణ(Telangana) రాష్ట్రంలో ఒక దరికి మారుమూలన ఉందని అభివృద్ధికి సైతం నోచుకోవడం లేదని మా యందు దయవుంచి ఇప్పుడున్న అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం లోని ఉమ్మడి ఖమ్మం జిల్లా ముగ్గురు మంత్రులు ఇప్పటికైనా చెక్ డ్యాం పనులు పూర్తి చేసి ఇరువైపులా రోడ్డు నిర్మాణం చేపట్టి వాహనదారులకు, రైతులకు ఇల్లూరు గ్రామం నుండి ఖమ్మంపాడు వరకు నిర్మించ తలపెట్టిన వంతెన పనులు పూర్తిచేసి త్వరగా అందుబాటులోకి తేవాలని విజ్ఞప్తి చేస్తున్నారు.

Also Read: Viral Video: హైదరాబాద్‌ కంటే.. న్యూయార్క్‌లో బతకడం చాలా ఈజీ.. నిరూపించిన ఇండియన్!

Just In

01

Crime News: తీరుమారని గంజాయి పెడ్లర్ పై పీడీ యాక్ట్.. ఉత్తర్వులు జారీ!

Crime News: హైదరాబాద్‌లో దారుణం.. మార్ఫింగ్ ఫోటోలతో యవతికి బెదిరింపులు

Teja Sajja: టాలీవుడ్ హీరోల గురించి ఎవరికీ తెలియని విషయం చెప్పిన తేజ సజ్జా.. ఇలా కూడా ఉంటుందా?

Balapur Laddu Auction 2025: బాలాపూర్ లడ్డు సరికొత్త రికార్డ్.. ఈసారి ఎన్ని రూ.లక్షలు పలికిందంటే?

Pending Bills: పెండింగ్‌లో అద్దెవాహన బిల్లులు.. ఖజానా కోసం ఎంపీడీవోల చూపులు