Telangana Assembly: ఈ నెల 30 నుంచి అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమవుతున్నాయి. అందుకు సంబంధించి గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ(Governor Jishnu Dev Verma) మంగళవారం గెజిట్ నోటిఫికేషన్ జారీ చేశారు. శనివారం ఉదయం 10.30 గంటలకు 3వ తెలంగాణ లెజిస్లేటివ్ అసెంబ్లీ 6వ సెషన్ ప్రారంభమవుతుంది. సమావేశం ప్రారంభం కాగానే జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్(MLA Maganti Gopinath) మృతికి సంతాపం ప్రకటించనున్నారు. ఆ తర్వాత సభలోని ఎమ్మెల్యేలందరికీ కాళేశ్వరం కమిషన్(Kaleshwaram Report) నివేదిక కాపీలను ఇవ్వబోతున్నట్లు సమాచారం. ఆ తర్వాత బీఏసీ సమావేశం నిర్వహించి అందులో అసెంబ్లీని ఎన్ని రోజులపాటు నిర్వహించాలనేది స్పష్టత ఇవ్వనున్నట్లు సమాచారం. శాసనమండలి సైతం ఉదయం 10.30 గంటలకు ప్రారంభం అవుతుంది. ఎమ్మెల్సీలకు సైతం కాళేశ్వరం కమిషన్ ప్రతులు ఇవ్వనున్నట్లు సమాచారం.
నివేదికలో 660 పేజీలు
ఈ అసెంబ్లీ సమావేశాల్లో ప్రధానంగా కాళేశ్వరం కమిషన్ ఇచ్చిన నివేదికపైనే సుదీర్ఘంగా చర్చించబోతున్నారు. అందుకోసమే ప్రత్యేకంగా అసెంబ్లీ నిర్వహిస్తున్నట్లు ఇప్పటికే సీఎం రేవంత్ రెడ్డి(CM Revanth Reddy) ప్రకటించారు. కాళేశ్వరం కమిషన్ మొత్తం 115 మందిని విచారించింది. అందులో మాజీ సీఎం కేసీఆర్(KCR), నాటి ఇరిగేషన్ శాఖ మంత్రి హరీష్ రావు(Harish Rao), నాటి ఆర్థికశాఖ మంత్రి ఈటల రాజేందర్(Etala Rajender) ను సైతం విచారణ చేసింది. వారి నుంచి వివరణ తీసుకుంది. పూర్తి వివరాలను కమిషన్ నివేదికలో పొందుపర్చి 660 పేజీల నివేదికను ప్రభుత్వానికి అందజేసింది. అయితే ఆ నివేదికలో ఏముంది.. కాళేశ్వరం ప్రాజెక్టులో భాగమైన మేడిగడ్డ బ్యారేజీ పియర్స్ కుంగడం, అన్నారం, సుంధిళ్ల లీకేజీలకు సంబంధించిన అన్ని అంశాలను నివేదికలో పొందుపర్చడంతో ఎమ్మెల్యేలకు అందుకు సంబంధించిన ప్రతులను అందజేస్తున్నారు. ప్రాజెక్టు ప్రారంభం నుంచి కుంగిన వరకు జరిగిన అన్ని వివరాలను, ప్రాజెక్టుకు సంబంధించిన ప్రతి అంశాన్ని తెలియజేసేందుకు అసెంబ్లీని నిర్వహిస్తున్నట్లు సీఎం తెలిపారు.
Also Read: KTR Meets KCR: కేసీఆర్‌తో గులాబీ నేతల భేటీ. సుదీర్ఘంగా చర్చించిన కేటీఆర్ హరీష్ రావు
ఎలా ఎదుర్కొందాం..
గజ్వేల్ లోని ఎర్రవెల్లిలో బీఆర్ఎస్(BRS) అధినేత కేసీఆర్(KVR) తో మాజీ మంత్రులు కేటీఆర్(KTR), హరీష్ రావు(Harish Rao) భేటీ అయ్యారు. అసెంబ్లీలో అనుసరించాల్సిన వ్యూహాలపై సుదీర్ఘంగా చర్చించారు. కాళేశ్వరం నివేదికపై చర్చించేందుకే ప్రభుత్వం సమావేశాలు నిర్వహిస్తుండటంతో ఎలా ఎదుర్కొందాం.. ఎలా ముందుకుపోదాం.. ప్రభుత్వ తప్పిదాలను ఎలా ఎండగడుదాం..అనే దానిపై చర్చించినట్లు సమాచారం. కాళేశ్వరంతో సాధించిన ఫలాలు, భూగర్భజలాల పెంపు, పెరిగిన సాగు విస్తీర్ణం.. ఎన్ని చెరువులు నింపింది తదితర అంశాలను సైతం అసెంబ్లీ వేదికగా వివరించాలని హరీష్ రావుకు కేసీఆర్ దిశానిర్దేశం చేసినట్లు సమాచారం. ఇప్పటికే పలు సందర్భాల్లో కాళేశ్వరంపై పవర్ పాయింట్ ప్రజంటేషన్ ఇచ్చారు. పార్టీ నేతలకు సైతం పీపీ తో వివరించారు. అయితే అసెంబ్లీ సమావేశాలను అనువుగా మల్చుకునేందుకు బీఆర్ఎస్((BRS)) సిద్ధమవుతుంది. మరోవైపు కేసీఆర్(KCR), బీఆర్ఎస్ పై ప్రభుత్వం కక్షసాధింపులకు పాల్పడుతుందనే అంశాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు సిద్ధమవుతుంది. అసెంబ్లీలో కాళేశ్వరంపై చర్చ మాత్రం వాడివేడిగా జరిగే అవకాశాలు ఉన్నాయి.
కేసీఆర్ హాజరుపై చర్చ
అసెంబ్లీ సమావేశాలను కాళేశ్వరంపై చర్చకోసమే ప్రభుత్వం నిర్వహిస్తుంది. అయితే ఈ సమావేశాలకు బీఆర్ఎస్ అధినేత కేసీఆర్(KCR) హాజరు అవుతారా? లేదా? అనేది ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. ఇప్పటికే కేసీఆర్ హాజరు అయింది మాత్రం రెండుసార్లు మాత్రమే వచ్చారు. అయితే ప్రధానంగా కాళేశ్వరం ప్రాజెక్టు గొప్పదని చెబుతున్న నేపథ్యంలో కేసీఆర్ వచ్చి ప్రాజెక్టుపై వివరిస్తారా? లేదా అనేది ఇప్పుడు రాజకీయ వర్గాల్లో చర్చజరుగుతుంది. లేకుంటే అసెంబ్లీలో హరీష్ రావు(Harish Rao), కేటీఆర్(KTR) ఇద్దరు నేతలు మాట్లాడాలని కేసీఆర్(KCR) ఆదేశాలిస్తారా? అనేది కూడా చర్చకు దారితీసింది.
Also Read: BC Commission: డిపార్ట్‌మెంట్లపై బీసీ కమిషన్ అసంతృప్తి?
