BRS Party
తెలంగాణ

BRS Party: నేతల కోసం గులాబీ వేట?.. పార్టీలో చేరినవారికి పదవుల ఆఫర్!

నియోజకవర్గాల్లో పట్టున్న నేతలపై ఫోకస్
ఆరా తీస్తున్న గులాబీ అధిష్టానం
పార్టీలో చేరినవారికి పదవుల ఆఫర్
రాబోయే అసెంబ్లీ ఎన్నికలకు ఇప్పటి నుంచే కసరత్తు
ఒక వైపు చేరికలు, మరోవైపు ప్రభుత్వ వైఫల్యాలపై ప్రజల్లోకి..
నియోజకవర్గంలో ఇద్దరు లీడర్ల తయారీ
భవిష్యత్ లో పార్టీకి నష్టం జరుగకుండా దిద్దుబాటు చర్యలు

BRS Party: పార్టీ బలోపేతంపై బీఆర్ఎస్ దృష్టిసారించింది. నియోజకవర్గాల్లో బలమైన నేతలపై ఫోకస్ పెట్టింది. ఇతర పార్టీల్లో ఎవరున్నారు.. వారు పార్టీలో చేర్చుకుంటే పార్టీ మరింత బలోపేతం అవుతుందా? అనేదానిపై ఆరా తీస్తుంది. అలాంటి నేతలను చేర్చుకునేందుకు ఇప్పటి నుంచే ప్రయత్నాలు ముమ్మరం చేస్తుంది. వారికి పార్టీ పదవులతో పాటు అవసరం అయితే టికెట్ కూడా ఇస్తామనే ఆఫర్ ఇస్తున్నట్లు సమాచారం. మరోవైపు ప్రభుత్వ వైఫల్యాలను సైతం ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లేందుకు ప్రణాళికలు రూపొందిస్తున్నట్లు పార్టీ వర్గాలు తెలిపాయి. భవిష్యత్‌లో ఎవరు పార్టీ మారినా నియోజకవర్గాల్లో బలమైన నాయకత్వం ఉండేలా కార్యచరణ సిద్ధం చేస్తున్నట్లు విశ్వసనీయ సమాచారం.

రాష్ట్రంలోని ప్రతి అసెంబ్లీ నియోజకవర్గంలో పటిష్టమైన నాయకత్వాన్ని తయారు చేసే పనిలో గులాబీ అధిష్టానం నిమగ్నమైంది. అందుకు పక్కా ప్లాన్ ప్రకారం ముందుకు సాగుతుంది. అందులో భాగంగానే నియోజకవర్గాల వారీగా నేతల వివరాలు సేకరిస్తుంది. పార్టీ నేతలతో పాటు ఇతర పార్టీ నేతల్లో బలమైన నేతలు ఎవరు? వారు సామాజిక సేవా కార్యక్రమాలతో వెళ్తున్నారా? లేకుంటే పార్టీ బలం వారికి ఉందా? వారి రాజకీయ భవిష్యత్ ఏంటీ? వారిని బీఆర్ఎస్ లో చేర్చుకుంటే కలిసి వస్తుందా? అనే దానిపై ఆరా తీస్తుంది. బలమైన నేతలు ఉంటే వారిని ఆపరేషన్ ఆకర్ష్ లో భాగంగా చేర్చుకోవాలని భావిస్తున్నట్లు సమాచారం. ఇప్పటి నుంచే నియోజకవర్గాల్లో పటిష్టమైన నాయకత్వం తయారు చేసేందుకు సిద్ధమవుతుంది. రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో ఏపార్టీకి అవకాశం ఇవ్వకుండా ప్రణాళిక బద్దంగా ముందుకు సాగాలని పార్టీ అధినాయకత్వం భావిస్తుంది.

Also Read- Swetcha Special story: వినూత్నం ఉపాధ్యాయుని బోధన పద్ధతి.. విద్యార్థుల్లో ఆసక్తి పెంచేలా పాఠాల వివరణ

బీఆర్ఎస్ అధికారంలో ఉన్న సమయంలో ఎమ్మెల్యేలనే నియోజకవర్గానికి సుప్రీంను చేసింది. నియోజకవర్గానికి పార్టీ ఇన్ చార్జీ బాధ్యతలు సైతం అప్పగించింది. దీంతో ఆ నియోజకవర్గాల్లో మరో నేత రాజకీయంగా ఎదగనివ్వలేదనే ఆరోపణలు వచ్చాయి. అంతేకాదు ఎవరైనా ఎదిగే ప్రయత్నం చేసినా వారిని అణిచివేశారని పలువురు నేతలు బహిరంగంగానే ఆరోపణలు చేశారు. ఈ పరిస్థితులతో సిట్టింగ్ ఎమ్మెల్యేలపై వ్యతిరేకత రావడం, వారిని 2023 అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేయించడంతో ఓటమి చవిచూడాల్సి వచ్చింది. అంతేకాదు పార్టీ టికెట్ పై గెలిచిన 10 మంది ఎమ్మెల్యేలతో పాటు మాజీ ఎమ్మెల్యేలు సైతం పార్టీ మారారు. అయితే ఆయా నియోజకవర్గాల్లో సెకండ్ నాయకత్వం లేదు. దీంతో ఉప ఎన్నికలు వస్తే అక్కడ పోటీచేసేందుకు బలమైన నేతలు కరువయ్యారు. అంతేకాదు పార్టీ కేడర్ ను గైడ్ చేసే నాయకత్వం లేకుండా పోయింది. ఈ అన్ని పరిస్థితులను పరిగణలోకి తీసుకున్న బీఆర్ఎస్ అధిష్టానం ప్రతీ నియోజకవర్గంలో ఇద్దరు లీడర్లు ఉండేలా కసరత్తు ప్రారంభించింది. ఎవరు పార్టీ మారినా నేతలకు కొదవలేదు.. తాము బలంగా ఉన్నామని కేడర్‌కు భరోసా ఇచ్చేందుకు పక్కా ప్రణాళికలతో ముందుకు సాగుతుంది.

Also Read- Baahubali The Epic: బాహుబలి ది ఎపిక్ టీజర్ విడుదల.. ప్రింట్ క్వాలిటీ అదిరింది.. థియేటర్లలోకి వచ్చేది ఎప్పుడంటే?

పార్టీలో చేరే నేతలకు ఆఫర్లు కూడా ఇస్తున్నట్లు విశ్వసనీయ సమాచారం. పార్టీ నియోజకవర్గ ఇన్ చార్జీ లేదా? రాబోయే ఎన్నికల్లో పార్టీ టికెట్ ఇస్తామని భరోసా ఇస్తున్నట్లు సమాచారం. రెండ్రోజుల క్రితం ఆర్మూర్‌కు చెందిన బీజేపీ నేత ఆలూరు విజయభారతి పెద్దసంఖ్యలో తన అనుచరులతో కలిసి బీఆర్‌ఎస్‌లో చేరారు. ఆమెకు పార్టీ ఆఫర్ ఇచ్చినట్లు సమాచారం. డైరెక్టుగా పార్టీ అధిష్టానంతో ఒప్పందం కుదుర్చుకొని పార్టీలో చేరినట్లు సమాచారం. ఆ సమయంలోనే పార్టీ టికెట్ ఇస్తామని హామీ ఇచ్చినట్లు ప్రచారం జరుగుతుంది. ఇలా మరికొన్ని నియోజకవర్గాల్లో ఇతర పార్టీల నేతలకు ఆఫర్ ఇచ్చినట్లు ప్రచారం ఊపందుకుంది. ఎమ్మెల్యేగా పనిచేసిన నేతల పనితీరు ఆశించిన మేర లేకపోవడంతోనే పార్టీ ఈ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. పనితీరు మార్చుకోవాలని నేతలకు సూచించినా మార్పు రాకపోవడం, ప్రజల్లో ఉండకుండా రాజధానిలో మకాం వేయడం, కొంతమంది నేతలు అసలు పార్టీ కార్యక్రమాల్లో పాల్గొనకపోవడంతో పార్టీ కేడర్‌లో అసంతృప్తి ఉన్నట్లు పార్టీ చేసిన సర్వేల్లో వెల్లడైనట్లు సమాచారం. దీంతో ఆ నేతలకు చెక్ పెడితేనే రాబోయే ఎన్నికల్లో మెజార్టీ సీట్లు కైవసం చేసుకోవచ్చని భావించిన పార్టీ పక్కా ప్రణాళికలతో ముందుకు సాగుతున్నట్లు పార్టీ నేతలు తెలిపారు. ఏది ఏమైనా పార్టీ అధిష్టానం పార్టీని గాడిలో పెట్టే పనిలో నిమగ్నం కావడంతో నేతలు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

స్వేచ్ఛ ఈ – పేపర్ కోసం https://epaper.swetchadaily.com/ ఈ లింక్ క్లిక్ చేయగలరు

Just In

01

Crime News: తీరుమారని గంజాయి పెడ్లర్ పై పీడీ యాక్ట్.. ఉత్తర్వులు జారీ!

Crime News: హైదరాబాద్‌లో దారుణం.. మార్ఫింగ్ ఫోటోలతో యవతికి బెదిరింపులు

Teja Sajja: టాలీవుడ్ హీరోల గురించి ఎవరికీ తెలియని విషయం చెప్పిన తేజ సజ్జా.. ఇలా కూడా ఉంటుందా?

Balapur Laddu Auction 2025: బాలాపూర్ లడ్డు సరికొత్త రికార్డ్.. ఈసారి ఎన్ని రూ.లక్షలు పలికిందంటే?

Pending Bills: పెండింగ్‌లో అద్దెవాహన బిల్లులు.. ఖజానా కోసం ఎంపీడీవోల చూపులు