Bcci Gautam Gambhir Discuss India Coach Role
స్పోర్ట్స్

New Coach: నయా కోచ్‌గా అతడేనా..? 

Bcci Gautam Gambhir Discuss India Coach Role:భారత క్రికెట్ ప్రధాన ట్రైనింగ్ పదవి రేస్‌లో చాలామంది రేస్‌లో ఉన్నారు. తాజాగా గౌతం గంభీర్ పేరు తెరమీదకు వచ్చి గట్టిగా వినిపిస్తోంది. బీసీసీఐతో గంభీర్ చర్చలు దాదాపు ముగింపు దశకు చేరినట్లు క్రికెట్ వర్గాలు అంటున్నాయి. ఈ నేపథ్యంలో భారత క్రికెట్ బోర్డు సరికొత్త ప్రధాన శిక్షకుడి కోసం వేటని స్టార్ట్‌ చేసింది. ప్రస్తుత చీఫ్ కోచ్ రాహుల్ ద్రావిడ్ పదవీ కాలం జూన్ నెలతో ముగియనుండడంతో జూలై 1న సరికొత్త కోచ్ తన బాధ్యతలు చేపట్టాల్సి ఉంది.

భారత క్రికెట్ ప్రస్తుత చీఫ్ కోచ్ రాహుల్ ద్రావిడ్ వారసుడిగా స్వదేశీ కోచ్‌ను మాత్రమే నియమిస్తామని, విదేశీ కోచ్‌లకు ఛాన్స్ లేదని బీసీసీఐ కార్యదర్శి జేషా కొద్దిరోజుల క్రితమే అనౌన్స్‌ చేయడంతో వీవీఎస్ లక్ష్మణ్‌తో సహా పలువురు ప్రముఖ స్వదేశీ శిక్షకుల పేర్లు ఇందులో వినిపించాయి. కోల్‌కతా మెంటార్‌గా సూపర్ హిట్ భారత క్రికెట్ ఓపెనర్‌గా టెస్టు, వన్డే ఫార్మాట్లలో తనజట్టుకు ఎన్నో విజయాలు అందించిన గంభీర్ 2011 వన్డే ప్రపంచకప్ విజయంలోనూ మెయిన్ రోల్‌ పోషించాడు. విపరీతమైన క్రికెట్ పరిజ్ఞానం, వ్యూహాత్మకంగా ఆలోచించడంలో దిట్టగా పేరుపొందిన గంభీర్‌ను ప్రత్యర్థులుగా కొరకరాని కొయ్యగా, గట్టి క్రికెట్ పిండంగానూ పరిగణిస్తారు. అంతేకాదు కోల్ కతా ఫ్రాంచైజీని రెండుమార్లు విజేతగా నిలిపిన ఘనత కెప్టెన్‌గా గౌతం గంభీర్‌కు మాత్రమే దక్కుతుంది.

Also Read: ఆ టైమ్‌లో నిజంగా..! ఎమోషనల్‌ అయిన క్రికెటర్‌ 

రెండు నెలలపాటు జరిగిన ఐపీఎల్‌లో గౌతంగంభీర్ కోల్‌కతా మెంటార్‌గా ఐదుసార్లు బ్రేక్ తీసుకోడం కూడా చర్చనీయాంశంగా మారింది. భారత చీఫ్ కోచ్ సవాలును గంభీర్ స్వీకరించగలడా? అన్నదానికి జవాబు రానున్న రోజుల్లో దొరకనుంది. నెలకు కోటి రూపాయల వేతనం, భారత క్రికెట్ ప్రధాన శిక్షకుడికి బీసీసీఐ ప్రస్తుతం నెలకు కోటి రూపాయలు వేతనంగా చెల్లిస్తోంది. ఏడాదికి 12 కోట్ల రూపాయల కాంట్రాక్టుపై రెండేళ్లుగా పదవీకాలాన్ని నిర్ణయించింది. గతంలో భారతజట్టుకు జాన్‌రైట్, డంకన్ ఫ్లెచర్, గ్యారీ కిర్‌స్టెన్, గ్రెగ్ చాపెల్ లాంటి విదేశీ కోచ్‌లు సేవలు అందించినా గ్యారీ కిర్ స్టెన్ మినహా మిగిలినవారు ఆశించిన రిజల్ట్స్ అందించలేకపోయారు. ఆ తరువాత అనీల్ కుంబ్లే, రవిశాస్త్రి చీఫ్ కోచ్‌లుగా భారత జట్టుకు పలు చిరస్మరణీయమైన విజయాలను అందించారు. గత మూడేళ్లుగా భారతజట్టు ప్రధాన శిక్షకుడిగా ఉన్న రాహుల్ ద్రావిడ్ నేతృత్వంలో వన్డే ప్రపంచకప్, టెస్టు లీగ్ ఫైనల్స్‌లో భారత్ రన్నరప్ స్థానాలతో సరిపెట్టుకుంది.

Just In

01

Srinivas Goud: వైన్స్ షాపుల్లో గౌడ్లకు 25శాతం ఇవ్వాల్సిందే… మాజీ మంత్రి సంచలన వ్యాఖ్యలు

CM Revanth Reddy: నిమజ్జనానికి సింపుల్ గా సీఎం.. ఏమైనా ఇబ్బందులున్నాయా?

Leaves denied: బ్రదర్ పెళ్లికి లీవ్స్ ఇవ్వలేదని ఓ మహిళా ఉద్యోగి తీసుకున్న నిర్ణయం ఇదీ

Students Protest: మా సార్ మాకు కావాలి.. నిరసనకు దిగిన విద్యార్థులు

Dhanush: మరో తెలుగు డైరెక్టర్‌కి ధనుష్ గ్రీన్ సిగ్నల్.. ఆ దర్శకుడెవరో తెలుసా?