Upasana: ఉపాసన కొణిదెల తాజాగా సోషల్ మీడియాలో పెట్టిన ఓ పోస్ట్ సంచలనం సృష్టించింది. ఆమె తన జీవితంలో సాధించిన విజయాల గురించి, ఎదుర్కొన్న సవాళ్ల గురించి ఓ హృదయస్పర్శి సందేశాన్ని పంచుకుంది. ఆమె ఏమని రాసిందంటే.. “జీవితంలో ఎదగాలంటే, ఏదోక లక్ష్యాన్ని సాధించాలి. ఆ లక్ష్యం చేరే వరకూ నిరంతరం కష్టపడుతూనే ఉండాలి అని చెప్పుకొచ్చింది. నేను నా జీవితంలో అనుకున్న లక్ష్యాలను సాధించడానికి ఎంతో కష్ట పడ్డాను.
Also Read: Swathi Murder Case: ఇంకా దొరకని స్వాతి శరీర భాగాలు.. మొండాన్ని తీసుకెళ్లబోమన్న కుటుంబీకులు
కొందరు నా విజయానికి కారణం వారసత్వమో లేక రామ్ చరణ్‌ని పెళ్లి చేసుకోవడమో అనుకుంటారు. కానీ, నా విజయం వెనుక నా స్వంత కష్టం, నేను ఎదుర్కొన్న సవాళ్లు, బాధలే ఉన్నాయి. రామ్ చరణ్‌ని పెళ్లి చేసుకోవడం లేదా వారసత్వం నాకు ఈ ప్రత్యేకతను తెచ్చిపెట్టలేదు.నేను ఎన్నోసార్లు కిందపడ్డాను, మళ్లీ లేచాను. ఒత్తిడి, ఇబ్బందులు, బాధలను ఎదుర్కొన్నాను. అయినా, నా లక్ష్యాన్ని చేరుకోవడానికి ఆగలేదు. ఈ ప్రయాణంలో నేను ‘ఖాస్’గా మారాను. నా కష్టం, నా పట్టుదలే నన్ను ఈ స్థాయికి చేర్చాయి. అందుకే ఈ విషయాన్ని మీతో పంచుకుంటున్నాను. మీరు కూడా ఎన్ని సార్లు కిందపడినా, మీ లక్ష్యాల కోసం పట్టుదలతో ఎదగండి. మీరూ ‘ఖాస్’గా మారండి!”
Also Read: Jr NTR Movies: అక్కడ హ్యాట్రిక్ సాధించిన మొదటి టాలీవుడ్ హీరో ఎన్టీఆర్.. పండగ చేసుకుంటున్న ఫాన్స్
ఈ పోస్ట్‌తో ఉపాసన స్పష్టంగా చెప్పదల్చుకున్నది ఏమిటంటే, తన విజయం వెనుక మెగా ఫ్యామిలీ కోడలు కావడం లేదా రామ్ చరణ్ భార్యగా ఉండడం కాదు, తన స్వంత కష్టం, పట్టుదల, సవాళ్లను అధిగమించిన తీరే కారణం. తన గుర్తింపు తానే సొంతంగా సంపాదించుకుందని గర్వంగా చెప్పుకొచ్చింది.