MP DK Aruna: పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ కు బీజేపీ ఎంపీ డీకే అరుణ సవాల్ చేశారు. మీకు దమ్ముంటే తెలంగాణలో దొంగ ఓట్ల లెక్కలు తేల్చండి అని డిమాండ్ చేశారు. మహేష్ కుమార్(PCC Mahesh Kumar Goud) కు మతి భ్రమించి, అధికారహంకారంతో మాట్లాడుతున్నారని ధ్వజం ఎత్తారు.ఓ మీడియా ప్రకటన విడుదల చేశారు. దమ్ముంటే తెలంగాణాలో దొంగ ఓట్లను ఏరండి.. అప్పుడు దొంగలేవరో.. దోషులవరో తేలిపోతుంది కదా అన్నారు. ప్రజల్లో విశ్వాసాన్ని కోల్పోయిన కాంగ్రెస్డ్ పార్టీ మనుగడ కోసం దొంగ ఓట్ల రాగం అందుకుందరని ఎద్దేవా చేశారు. దొంగ ఓట్లు ఉంటే.. మీరు కూడా దొంగ ఓట్లతో గెలిచినట్లే..దొంగే.. దొంగ దొంగ అని అరిచినట్లున్నది కాంగ్రెస్(Congress) వాలకం ఉందని చురకలు అంటించారు. కాంగ్రెస్ కు సాధ్యమైతే తెలంగాణాలో దొంగ ఓట్ల లెక్కలు తేల్చాలని డిమాండ్ చేశారు.
దేవుడి పేరు చెప్తే తప్పా?
స్థానిక సంస్థల ఎన్నికల(Local Body Elections)స్తున్నాయని, ఆలోగా భోగస్ ఓట్ల గుట్టు విప్పాలని డిమాండ్ చేశారు. తెలంగాణాలో దొంగ ఓట్లు ఉన్నాయని బీజేపీ(BJP) ముందే చెప్పిందన్నారు. ఎన్నికలకు ముందే ఓట్ల.. నోట్ల లెక్కలు తేలాలి అన్నారు. ఇచ్చిన హామీలు అమలు చేయలేక ప్రజలలో విశ్వాసాన్ని కోల్పోయి మతి భ్రమించి ఇష్టమొచ్చినట్లు మాట్లాడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. అటు రేవంత్ రెడ్డీ(Rebamth Reddy).. ఇటు ఇంచార్జ్ మీనాక్షి(Meenakshi Natarajan) మధ్య నలిగిపోతునాట్లున్నాడు అందుకే ఏం మాట్లాడుతున్నాడో మహేష్ కు తెలియడం లేదన్నారు. దేవుడి పేరు చెప్తే తప్పా? దేవుడు, ధర్మం గురించి మాట్లాడితే తప్ప? బిచ్చం అడుక్కున్నట్లా..? మీరు దేవుళ్ళ గురించి మాట్లాడకండి, ధర్మం గురించి మాట్లాడకండి మీరు ఇంకేదైనా మాట్లాడండి అని హితవు పలికారు.
Also Read: GHMC: హైదరాబాద్‌లో ప్యాండమిక్ కంట్రోల్ ల్యాబ్.. ఏర్పాటు దిశగా అడుగులు
మనోభావాలు దెబ్బ తీయడం కాదా?
దేవుళ్ళ గురించి మాట్లాడితే బిచ్చగాళ్లు అనడం అంతే ప్రజల మనోభావాలు దెబ్బ తీయడం కాదా? అని ప్రశ్నించారు. పిచ్చి మాటలు మానుకోకపోతే మీకు బుద్ది చెప్పేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారు ఖబర్ధార్ అని హెచ్చరించారు. కాంగ్రెస్ అంటేనే కుల రాజకీయం.. మీకు కులం పేరు చెప్పకుండా ఓట్లడిగే దమ్ముందా? అని సవాల్ చేశారు. మాట్లాడితే బీసీ(BC)లకు 42% రిజర్వేషన్ లు అంటున్నారు కదా.. మహేష్ కుమార్ ముందు ని పార్టీ లో నువ్ సీఎం పదవి తెచ్చుకో.. అని సూచించారు. చిత్తశుద్ధి ఉంటే కామారెడ్డి బీసీ డిక్లరేషన్(Kamareddy BC Declaration) అమలు చేయాలన్నారు. ఒక జాతీయ పార్టీ గా కాంగ్రెస్ పూర్తిగా ప్రజల విశ్వాసాన్ని కోల్పోయిందన్నారు. మనుగడ కోసమే కాంగ్రెస్(Congress) బీజేపీ(BJP) పై దుష్ప్రాచారం కోల్పోయిందన్నారు.
Also Read: Min Seethakka: ఉపాధ్యాయుల సమస్యలను సీఎం దృష్టికి తీసుకెళ్తా: మంత్రి సీతక్క