Nelakondapally (imagecredit:swetcha)
నార్త్ తెలంగాణ

Nelakondapally: ఆయన కన్ను పడితే మట్టి మాయం.. ప్రశ్నిస్తే బెదిరింపులు!

Nelakondapally: జాతీయ రహదారులు, రైల్వే ప్రాజెక్టులు, భారీ రియల్ వెంచర్లతో మట్టి, గ్రావెల్ కు విపరీతమైన డిమాండ్ ఏర్పడింది. దీంతో అక్రమార్కులు అడ్డు అదుపు లేకుండా ఎక్కడ మట్టి కనిపిస్తే అక్కడ ప్రభుత్వం నుంచి ఎలాంటి అనుమతులు లేకుండా అడ్డగోలుగా తవ్వి మట్టిని వెంచర్లకు తరలిస్తున్నారు. ఐతే ట్విస్ట్ ఏంటంటే ప్రభుత్వ భూముల నుండే కాకుండా ప్రైవేట్ వ్యక్షుల భూముల నుండి మట్టి తరలించడం కొంత ఆందోళన, ఆవేదనకు గురి చేసే అంశం. వివరాల్లోకి వెళితే… రిటైర్డ్ ఉపాధ్యాయుడు గోగినేని ఉపేందర్ రావుకు నేలకొండపల్లి(Nelakonda Pally) మండలం గువ్వలగూడెంలో, ముదిగొండ(Mudigonda) మండలం చిరుమర్రి రెవెన్యూ సరిహద్దుల్లో వారసత్వంగా వచ్చిన వ్యవసాయ భూమి ఉన్నది. ఈ భూమిని గ్రామంలోని ఓ వ్యక్తికి కౌలుకి ఇచ్చాడు. గత యాసంగిలో సాగు పూర్తయిన తర్వాత పొలం వద్దకు వెళ్లలేదు. వీరి భూమికి ఆనుకొని ఉన్న చిరుమర్రి(Chirumarri) రెవెన్యూ(Revenue) పరిధిలోని వారి భూమిలో మట్టిని తవ్వి తరలించటం మొదలుపెట్టారు. జిల్లాలోనే ఓ బడా కాంట్రాక్టర్ కాంట్రాక్టు తీసుకొని మండలంలోని తన మనుషులకు మట్టిని తరలించే పని అప్ప చెప్పాడు. ఇంకేముంది రాత్రి, పగలు అనే తేడా లేకుండా వేల కొద్ది ట్రిప్పులు మట్టిని తరలిస్తూ వ్యవసాయ భూములను తవ్వేస్తున్నారు.

పెద్ద పెద్ద గోతులు తవ్వి ఉండటం

ఇలా తవ్వుతూ పక్కనే ఉన్న ఉపేందర్ రావు పొలంలోనూ మట్టిని తవ్వి తరలించే పనిలో ఉన్నారు. యాసంగి సాగు పూర్తయ్యాక కౌలు రైతు పొలం వైపు రాకపోవటంతో అదే అదునుగా భావించి మట్టిని దర్జాగా తవ్వి తరలించారు. వర్షాలు పడి సాగు పనులను చేసేందుకు కౌలు రైతు పొలానికి వెళ్ళినప్పుడు పొలంలో పెద్ద పెద్ద గోతులు తవ్వి ఉండటం గమనించాడు. ఉపేందర్ రావు పొలం లోపలికి వచ్చి సుమారు 10 నుంచి 15 అడుగుల లోతులో మట్టిని తవ్విన విషయం తెలుసుకున్న కౌలు రైతు ఉపేందర్ రావుకు తెలిపాడు. మట్టి తవ్విన సదరు వ్యక్తులను అడగ్గా పొరపాటున తవ్వాము మరలా పొలం బాగు చేస్తామని హామీ ఇచ్చారు. ఎన్ని రోజులైనా పొలం బాగు చేయకపోగా మరో 10 అడుగులు ముందుకు వచ్చి మట్టిని తవ్వారు. ఈ విషయం గురించి నిలదీయగా అది మీ పొలం కాదు మీ పొలం అని గ్యారెంటీ ఏంటి మా పొలంలోనే తవ్వుతున్నాము మాకు అన్ని అనుమతులు ఉన్నాయని బుకాయించారు. దీంతో ఉపేందర్ రావ్ నేలకొండపల్లి పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశాడు. సదరు వ్యక్తుల్ని పిలిపించగా అదే సమాధానం చెప్పడంతో మీకు ఏ అనుమతులు ఉన్నాయి.

Also Read: No Shortage of Urea: ఆ జిల్లాలో ఎక్కడా కూడా యూరియా కొరత లేదు?

పట్టాదారు పొలంలోకి వెళ్లడానికి నువ్వు ఎవరు..?

వాళ్ళ పొలంలో పోవడానికి నువ్వు ఎవరు అని గట్టిగా మందలించడంతో మరలా పొలం బాగు చేస్తానని హామీ ఇవ్వడంతో పాటు, కాగితం కూడా రాసిస్తానని చెప్పాడు. ఆ తర్వాత వారం రోజులు అయినా ఆ ఊసే ఎత్తలేదు. మరలా ఉపేందర్ రావ్(Upender Rao) పోలీస్ స్టేషన్ కు వెళ్ళగా పోలీసులు ఇది సివిల్ మ్యాటర్ దీంట్లో మేము ఏమి చేయలేమని వారు చేతులెత్తేశారు. పట్టాదారు ఉపేందర్ రావు ముదిగొండ తహసిల్దారు(MRO) కూడా ఫిర్యాదు చేశాడు. వర్షాలు పడటంతో ప్రస్తుతం మట్టి తవ్వట్లేదని మరల కొద్ది రోజుల్లోనే మట్టి తరలించవచ్చని ఉపేందర్ రావు ఆవేదన వ్యక్తం చేస్తున్నాడు. సంబంధిత అధికారులు ఇప్పటికైనా స్పందించి తనకు న్యాయం చేయాలని ఉపేంద్రరావు కోరుతున్నాడు. అక్రమంగా మట్టి తవ్వకాలు జరిపే వ్యక్తులపై చట్టరీత్యా చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేస్తున్నారు. మరి అక్రమార్కులకు అధికారులు అండగా నిలుస్తారా…? లేదంటే తన పొలంలో అక్రమ తవ్వకాలు చేపట్టిన అక్రమార్కులపై చర్యలు తీసుకుంటారా..? వేచి చూడాలి.

Also Read: Hydraa: అప్పుడు విమర్శలు.. ఇప్పుడు ప్రశంసలు?

Just In

01

Donald Trump: భారత్‌పై ట్రంప్ యూటర్న్.. మోదీ ఎప్పటికీ ఫ్రెండే అంటూ.. దగ్గరయ్యేందుకు తాపత్రయం!

SIIMA Awards 2025: సైమా 2025 విజేతలు ఎవరంటే?.. ఖుషీ అవుతున్న ఆ హీరోల ఫ్యాన్స్

Telangana Jagruthi: తెలంగాణ జాగృతి సంస్థ నాయకులు ఫైర్.. కారణం అదేనా..?

Crime News: తీరుమారని గంజాయి పెడ్లర్ పై పీడీ యాక్ట్.. ఉత్తర్వులు జారీ!

Crime News: హైదరాబాద్‌లో దారుణం.. మార్ఫింగ్ ఫోటోలతో యవతికి బెదిరింపులు