BC Reservations (imagecredit:swetcha)
Politics

BC Reservations: స్థానిక ఎన్నికల్లో బీసీలకు రిజర్వేషన్లపై.. విస్తృత సమావేశం

BC Reservations: స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీ(BC)లకు 42 శాతం రిజర్వేషన్ కల్పించడంపై మంత్రుల కమిటీ సాయంత్రం ప్ర‌జాభ‌వ‌న్ లో ప్ర‌త్యేకంగా స‌మావేశ‌మై కసరత్తు చేసింది . ఈ సందర్భంగా డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క(Bhatti Vikramarka) మాట్లాడుతూ.. రాష్ట్రంలో ప్రణాళిక శాఖ ఆధ్వర్యంలో సామాజిక, ఆర్థిక, విద్య, ఉపాధి, రాజకీయ,కుల గ‌ణ‌న‌ సర్వేపై చర్చించామన్నారు. ఈ విష‌యంపై ఎన్నికల ముందు కాంగ్రెస్(Congress) పార్టీ అగ్ర‌నేత రాహుల్ గాంధీ(Rahul Gandhi) రాష్ట్ర ప్రజలకు వాగ్దానం కూడా చేశారన్నారు. ఎన్నికల ముందు ఇచ్చిన వాగ్దానం మేరకు ఓబీసీ(OBC) కులగణ‌న‌ను రాష్ట్ర ప్ర‌భుత్వం అధికారికంగా చేపట్టిన‌ట్లు మంత్రుల క‌మిటీ తెలిపింది.

స్థానిక సంస్థల ఎన్నికలు

సోషియో(Socio), ఎకనామిక్(Economic), ఎడ్యుకేషన్(Education), ఎంప్లాయిమెంట్(Employment), పొలిటికల్(Political) అండ్ కాస్ట్ సర్వేలో వచ్చిన ఎంపీరికల్ డాటాను శాసనసభలో ప్రవేశపెట్టి, స్థానిక సంస్థల్లో ఓబీసీలకు 42 శాతం రిజర్వేషన్ బిల్లును శాసనసభలో పెట్టి ఏకగ్రీవంగా ఆమోదింపజేసి గవర్నర్ కు పంపామన్నారు. ఆ బిల్లు గవర్నర్ నుంచి రాష్ట్రపతి వద్దకు వెళ్ళిందని, ప్రస్తుతం రాష్ట్ర‌ప‌తి వ‌ద్ద 5 నెల‌లుగా పెండింగ్ లో ఉన్నదని వివరించారు. మరోవైపు సెప్టెంబర్ 30లోగా స్థానిక సంస్థల ఎన్నికలు(Local body elections) నిర్వహించాలని హైకోర్టు ఆదేశించింనట్లు గుర్తు చేశారు.

Also Read: Padma Devender Reddy: అన్నదాన కేంద్రం వద్ద మాజీ ఎమ్మెల్యే ధర్నా.. రైతులను ఆదుకోవాలని డిమాండ్

వివాదాలు ఏర్పడకుండా

ఈ నేపథ్యంలో స్థానిక సంస్థల ఎన్నిక‌ల్లో బీసీల‌కు 42 శాతం రిజర్వేషన్ కల్పించేందుకు ఎలాంటి న్యాయపరమైన వివాదాలు ఏర్పడకుండా సలహా ఇవ్వాల్సిందిగా అడ్వకేట్ జనరల్ సుదర్శన్ రెడ్డి(Sudharshan Reddy) అభిప్రాయం కోరామన్నారు. ఇదే అంశంపై సోమవారం జస్టిస్ సుదర్శన్ రెడ్డి , ఢిల్లీ(Delhi)లో ప్రముఖ న్యాయ కోవిదుల అభిప్రాయం సైతం తీసుకోవాలని మంత్రుల కమిటీ నిర్ణయించినట్లు తెలిపారు. ఈ సమావేశంలోమంత్రులు ఉత్తమ్‌ కుమార్ రెడ్డి(Uttam Kumara Redy), దుద్దిళ్ల శ్రీధ‌ర్ బాబు(Sridhar Babu) పాల్గొన్నారు. కమిటీ సభ్యుడైన మంత్రి పొన్నం ప్రభాకర్(Min Ponnam Prabhakar) ఫోన్ లో అడ్వొకేట్ జనరల్ సుదర్శన్ రెడ్డికి తన అభిప్రాయాన్ని తెలియజేశారు.

Also Read: Medchal District: బాచుపల్లిలో నయా దందా రికార్డుల తారుమారు.. అసలైన పట్టాదారుల భూములు క‌బ్జా?

Just In

01

Donald Trump: భారత్‌పై ట్రంప్ యూటర్న్.. మోదీ ఎప్పటికీ ఫ్రెండే అంటూ.. దగ్గరయ్యేందుకు తాపత్రయం!

SIIMA Awards 2025: సైమా 2025 విజేతలు ఎవరంటే?.. ఖుషీ అవుతున్న ఆ హీరోల ఫ్యాన్స్

Telangana Jagruthi: తెలంగాణ జాగృతి సంస్థ నాయకులు ఫైర్.. కారణం అదేనా..?

Crime News: తీరుమారని గంజాయి పెడ్లర్ పై పీడీ యాక్ట్.. ఉత్తర్వులు జారీ!

Crime News: హైదరాబాద్‌లో దారుణం.. మార్ఫింగ్ ఫోటోలతో యవతికి బెదిరింపులు