BC Reservations: రాష్ట్రంలో బీసీలకు 42 శాతం రిజర్వేషన్లపై ఎట్టకేలకు క్లారిటీ వచ్చింది. పార్టీ పరంగా 42 శాతం రిజర్వేషన్ అమలు చేసి ముందుకు వెళ్లాలని నిర్ణయించినట్లు సమాచారం. అయితే ప్రభుత్వ పరంగా మాత్రం స్థానిక సంస్థల ఎన్నిక(Local Body Elections)ల్లో పాత రిజర్వేషన్లే కొనసాగనున్నాయి. అంటే 23 శాతం రిజర్వేషన్ తోనే ముందుకు వెళ్లనున్నారు. ఇదే అంశంపై కేబినెట్ సమావేశంలో డిస్కషన్ చేయనున్నారు. ఆ తర్వాత తదుపరి స్టెప్ తీసుకోనున్నారు. సెప్టెంబరు 2 వ వారంలో స్థానిక సంస్థల ఎన్నికలకు వెళ్లాలని ప్రభుత్వం సీరియస్ గా ఉన్నది. దీంతోనే ఆ ప్రాసెస్ స్పీడప్ అయింది. బీసీ రిజర్వేషన్ల(BC Reservations) అమలు విషయంలో రాష్ట్ర ప్రభుత్వం తను చేయాల్సిన ప్రాసెస్ అంతా పూర్తి చేసింది.
Also Read: Protest In Tirumala: తిరుపతిలో శ్రీవారి మెట్టు చిరువ్యాపారుల వినూత్న కార్యక్రమం!
రాష్ట్రపతికి కమ్యూనికేషన్
బిల్లు, ఆర్డినెన్స్ లను తయారు చేసి రాష్ట్రపతి, గవర్నకు పంపింది. అక్కడ్నుంచి ఆమోదం లభించకపోవడంతో ఏకంగా ఢిల్లీ(Delhi)లోనే ధర్నాకు దిగింది. అయినప్పటికీ, బిల్లు(Bill), ఆర్డినెన్స్ లకు క్లియరెన్స్ రాలేదు. దీంతో కేంద్రం పరోక్షంగా ఈ విషయంలో ఇన్వాల్వ్స్ అయిందనే విషయాన్ని కాంగ్రెస్(Congress) బలంగా భావిస్తున్నది. కనీసం రాష్ట్రపతి అపాయింట్ మెంట్ కూడా ఇవ్వలేదంటే కేంద్రం నుంచి రాష్ట్రపతికి కమ్యూనికేషన్ జరిగి ఉంటుందని కాంగ్రెస్ అనుమానిస్తున్నది. దీంతోనే ప్రత్యమ్నాయ మార్గంలో పార్టీ పరంగా రిజర్వేషన్లకు కాంగ్రెస్ ముందుకు సాగుతున్నది. ఇక ఎంపీటీసీ(MPTC), జడ్పీటీసీ(ZPTC) ఎన్నికలు ముందు నిర్వహించి తర్వాత సర్పంచ్ ఎన్నికలకు వెళ్లాలని పార్టీ భావిస్తున్నట్లు తెలిసింది. ఇదే విషయాన్ని ప్రభుత్వానికి వివరించింది. కేబినెట్ లో తుది నిర్ణయం జరగనున్నది.
Also Read: Telangana Jobs: అదిరిపోయే గుడ్ న్యూస్.. ఆరోగ్య శాఖలో 1,623 పోస్టులకు నోటిఫికేషన్