pawan-kalyan-og-update(image :X)
ఎంటర్‌టైన్మెంట్

OG Movie Update: ‘ఓజీ’ నుంచి అదిరిపోయే అప్డేట్.. ఈ రోజు ఫ్యాన్స్‌కు పూనకాలే

OG Movie Update: పవన్ కళ్యాణ్ ‘ఓజీ’ సినిమా నుంచి మరో అప్‌డేట్ వచ్చేసింది. ఇప్పటికే విడుదలైన మొదటి సింగిల్ ఏ స్థాయిలో దూసుకుపోతుందో తెలిసిందే. తాజాగా ఈ రోజు సాయంత్రం 4:05 గంటలకు మరో సాంగ్ (OG Movie Update)విడుదల చేయనున్నారు నిర్మాతలు. దీనికి సంబంధించిన ఓ పోస్టును నిర్మాతలు సోషల్ మీడియాలో విడుదల చేశారు. అయితే సాంగ్ సరదాగా సాగే మెలొడీగా ఉంటుందని సమాచారం. ఏది ఏమైనా ఓజీ మొదటి సాంగ్ ఏ స్థాయిలో హిట్ అయిందో తెలిసిందే. అయితే ఈ మెలొడీ కూడా అదే స్థాయిలో ఉండబోతుందని అభిమానులు ఆశిస్తున్నారు. ఈ సినిమాతో 12 సంవత్సరాల తర్వాత పవన్ కళ్యాణ్ బాక్సాఫీస్ వద్ద బ్లాక్ బస్టర్ రీ-ఎంట్రీ ఇస్తాడని అభిమానులు ఆశిస్తున్నారు. స్టైలిష్ యాక్షన్ సీక్వెన్స్‌లు, బ్లాక్‌బస్టర్ పాటలు, గ్రిప్పింగ్ స్క్రీన్‌ప్లేతో మొదటి సగం గూస్‌బంప్స్ తెప్పించే సన్నివేశాలు ఉన్నాయని సమాచారం.

Read also- GHMC: హైదరాబాద్‌లో ప్యాండమిక్ కంట్రోల్ ల్యాబ్.. ఏర్పాటు దిశగా అడుగులు

ఈ సినిమా నుంచి ఆగస్ట్ 24న మరో పాట విడుదల కానుంది. దీంతో పవన్ అభిమానులు సంబరాలు చేసుకుంటున్నారు. విడుదలయ్యేది ఖచ్చితంగా ‘ఓజీ’ మెలొడీ సాంగ్ అయి ఉంటుందని అభిమానులు ఆశిస్తున్నారు. థమన్ ఈ సినిమాకు సంగీతం అందిస్తున్నారు. మామోలుగానే ధమన్ సంగీతానికి థియేటర్లలో బాక్సులు బద్దలవుతాయి. అయితే ఈ సినిమాను మరింత ప్రతిష్టాత్మకంగా తీసుకుని సంగీతం అందించానని థమన్ చాలా సందర్భాల్లో చెప్పారు. సుజిత్ దర్శకత్వంలో డీవీవీ ఎంటర్‌టైన్‌మెంట్ నిర్మించిన ఈ చిత్రం ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్‌ పనిలో ఉంది. సెప్టెంబర్ 25, 2025న ప్రపంచ వ్యాప్తంగా తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం, హిందీ భాషల్లో గ్రాండ్ రిలీజ్‌కు సిద్ధమవుతోంది. ఇమ్రాన్ హష్మీ విలన్‌గా, ప్రియాంక మోహన్ హీరోయిన్‌గా నటిస్తున్నారు.

Read also- Kishan Reddy: రాజకీయాల్లో మేం శత్రువులం కాదు.. ప్రత్యర్థులమే: కిషన్ రెడ్డి

సోషల్ మీడియాలో అభిమానులు ట్రైలర్ కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. అది సినిమా కథ, పాత్రలు, యాక్షన్ సీక్వెన్స్‌ల గురించి మరిన్ని వివరాలు వెల్లడిస్తుందని భావిస్తున్నారు. అయితే మరిన్ని వివరాల కోసం వేచిఉండాల్సిందే. అప్పటి వరకు, ఓజీ ట్రైలర్ గురించి అధికారిక సమాచారం లేదు. పవన్ కళ్యాణ్ ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం బాధ్యతల కారణంగా చిత్రీకరణలో జాప్యం జరిగినప్పటికీ, షూటింగ్ పూర్తి చేశారు. ‘హరి హర వీరమల్లు’ తర్వాత రాబోతున్న సినిమా కాబట్టి అభిమానులు బారీ అంచనాలు పెట్టుకున్నారు.

Just In

01

Land Scam: ఎర్రగుంటలో ప్రభుత్వ భూముల కబ్జా.. ఆర్టీఐ ద్వారా వెలుగులోకి?

Blood Moon Eclipse 2025: అమ్మో చంద్ర గ్రహణం.. బిడ్డలను కనేదేలే.. గర్భిణీల వింత వాదన!

CM Revanth Reddy: జ‌న‌గామ క‌లెక్ట‌ర్‌ను అభినందించిన సీఎం

AGI impact: 2030 నాటికి 99 శాతం మంది ఉద్యోగాలు ఊడుతాయ్!!.. పొంచివున్న ఏఐ ముప్పు

A Minecraft Movie Review: ఊహా ప్రపంచంలోకి వెళ్తే ఏం జరగుతుంది.. తిరిగి రావాలంటే ఏం చేయాలి?