phone tapping judges
క్రైమ్

Hyderabad:న్యాయమూర్తుల ఫోన్లూ..‘ట్యాపింగ్’ చేశారు

Judges phones tapping Bhujangarao statement sensation:
దేశవ్యాప్తంగా సంచలనం క్రియేట్ చేసిన ఫోన్ ట్యాపింగ్ కేసులో పలు కీలక అంశాలు వెలుగుచూస్తున్నాయి. రోజుకో మలుపు తిరుగుతున్న ఈ ట్యాపింగ్ కేసులో ఇప్పటికే పలువురు సీనియర్ రాజకీయ నాయకులు, ప్రతిపక్షాలు, పలువురు సెలబ్రిటీలు బాధితులుగా ఉన్నారు. అయితే ఇప్పుడు జడ్జీల ఫోన్లు కూడా ట్యాపింగ్ అయినట్లు సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. ప్రభుత్వ కేసులు, బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన కేసులు పర్యవేక్షిస్తున్న న్యాయవాదులతో పాటు హైకోర్టు జడ్జిల ఫోన్లు కూడా ట్యాపింగ్ అయినట్లు తెలుస్తోంది.

భుజంగరావు వాంగ్మూలం

ఇప్పటిదాకా రాజకీయ నాయకుల పేర్లే ట్యాపింగ్ అయ్యాయని అనుకున్నారంతా..కానీ ఫోన్ ట్యాపింగ్ నిందితులు ఇచ్చిన నేరంగీకార వాంగ్మూలంలో పలువురు జడ్జీలు, న్యాయవాదుల ఫోన్లు ట్యాపింగ్ అవడం కలకలం రేపుతోంది. అదనపు ఎస్పీ(సస్పెండెడ్‌) నాయిని భుజంగరావు ఇచ్చిన వాంగ్మూలం ఇప్పుడు పెను సంచలనంగా మారింది. వ్యక్తిగత జీవితాలకు సంబంధించిన సమాచారం సేకరించడం ద్వారా అవసరమైనప్పుడు వారిని ప్రభావితం చేయాలనుకున్నట్లు భుజంగరావు వెల్లడించారు. ఫోన్‌ ట్యాపింగ్‌పై డీజీపీ, అదనపు డీజీపీలు క్షుణ్నంగా సమీక్ష జరిపేవారు కాదని.. ట్యాప్‌ చేసే ప్రతి ఫోన్‌ నంబర్‌ను పరిశీలించేవారు కాదని ఆయన చెప్పారు. దీంతో ఎస్‌ఐబీ మాజీ ఓఎస్డీ ప్రభాకర్‌రావు, డీఎస్పీ(సస్పెండెడ్‌) ప్రణీత్‌రావు ఇష్టానుసారంగా వ్యవహరించారని వాంగ్మూలంలో పేర్కొన్నారు.

బీఆర్ఎస్ కు మేలు చేకూర్చేందుకే..

బీఆర్ఎస్ కు మేలు చేకూర్చేందుకు 2018 శాసనసభ ఎన్నికలకు ముందే అప్పటి ఇంటెలిజెన్స్‌ చీఫ్‌ నవీన్‌చంద్‌ను సంప్రదించిన తర్వాతే ఎస్‌ఐబీలో ప్రభాకర్‌రావు స్పెషల్‌ ఆపరేషన్‌ టీం(ఎస్‌వోటీ) ప్రారంభించినట్లు వెల్లడించారు. మునుగోడు ఉపఎన్నిక సమయంలో మునుగోడు శివార్లలో రూ.కోటి పట్టుకోగలిగామన్నారు.. ఎస్‌ఐబీలో ఫోన్‌ ట్యాపింగ్‌ అవుతోందన్న భయంతో చాలామంది రాజకీయ నాయకులు, ఉన్నతాధికారులు, న్యాయవ్యవస్థకు చెందినవారు వాట్సప్, సిగ్నల్, స్నాప్‌చాట్‌ లాంటి సామాజిక మాధ్యమ ప్లాట్‌ఫాంలను వినియోగించేవారన్నారు. ఇంటర్నెట్‌ కాల్స్‌ను పర్యవేక్షించేందుకు ఇంటర్నెట్‌ ప్రొటోకాల్‌ డేటా రికార్డ్స్‌(ఐపీడీఆర్‌) విశ్లేషణపై ప్రభాకర్‌రావు, ప్రణీత్‌రావు దృష్టి సారించారని అన్నారు.

విద్యార్థి సంఘాల నేతల ఫోన్లూ ..

అప్పటి బీఆర్ఎస్ ప్రభుత్వ విధానాలను ట్రోల్‌ చేసే వ్యక్తుల ఫోన్లపై ప్రణీత్‌రావు బృందం నిఘా పెట్టేది. అనంతరం టాస్క్‌ఫోర్స్, ఎస్‌వోటీ బృందాలతో క్షేత్రస్థాయి ఆపరేషన్లు నిర్వహించేవారన్నారు. బీఆర్ఎస్ ను ఇబ్బందిపెట్టే విద్యార్థి సంఘాల నేతల ఫోన్లనూ ట్యాప్‌ చేసేవారు. బీఆర్ఎస్ ఇబ్బందుల్లో ఉన్న సమయాల్లో బయటపడేసేందుకు ఫోన్‌ ట్యాపింగ్‌ సమాచారం ఆధారంగా ఆపరేషన్లు చేపట్టేవారు. ఈటల రాజేందర్‌ బీఆర్ఎస్ నుంచి సస్పెండ్‌ అయినప్పుడు.. హుజూరాబాద్‌ ఉప ఎన్నికప్పుడు.. టీఎస్‌పీఎస్సీ పేపర్‌ లీకేజీపై నిరుద్యోగ యువత ఆందోళనలు నిర్వహించినప్పుడు.. అదే సమయంలో కేటీఆర్‌ కామెంట్లపై ఆందోళనలు జరిగినప్పుడు.. మొయినాబాద్‌ ఫామ్‌హౌస్‌లో ఎమ్మెల్యేలకు ఎర కేసు లాంటి సందర్భాల్లో క్షేత్రస్థాయిలో పోలీసులకు సమాచారం చేరవేసి.. పరిస్థితి అదుపులోకి తెచ్చే ప్రయత్నం జరిగేదని చెప్పారు.

Just In

01

CM Revanth Reddy: నిమజ్జనానికి సింపుల్ గా సీఎం.. ఏమైనా ఇబ్బందులున్నాయా?

Leaves denied: బ్రదర్ పెళ్లికి లీవ్స్ ఇవ్వలేదని ఓ మహిళా ఉద్యోగి తీసుకున్న నిర్ణయం ఇదీ

Students Protest: మా సార్ మాకు కావాలి.. నిరసనకు దిగిన విద్యార్థులు

Dhanush: మరో తెలుగు డైరెక్టర్‌కి ధనుష్ గ్రీన్ సిగ్నల్.. ఆ దర్శకుడెవరో తెలుసా?

Gaddam Prasad Kumar: మహిళల ఆర్థిక అభివృద్ధే ప్రభుత్వ లక్ష్యం.. గడ్డం ప్రసాద్ కీలక వ్యాఖ్యలు