Jatadhara: టాలీవుడ్ నవ దళపతి సుధీర్ బాబు, బాలీవుడ్ పవర్‌హౌస్ సోనాక్షి సిన్హా (Sonakshi Sinha) ప్రధాన పాత్రలలో నటిస్తున్న మోస్ట్ ఎవైటెడ్ సూపర్ నేచురల్ మైథలాజికల్ థ్రిల్లర్ చిత్రం ‘జటాధర’ (Jatadhara Movie). సుధీర్ బాబు (Sudheer Babu) ఇప్పటి వరకు తన కెరీర్‌లో చేయని ఓ అద్భుతమైన పాత్రలో ఇందులో నటించబోతున్నారు. అలాగే బాలీవుడ్ బ్యూటీ సోనాక్షి సిన్హా ఈ చిత్రంతో టాలీవుడ్‌లోకి అడుగు పెడుతున్నారు. ఆమె ఈ సినిమాతో అడుగు పెడుతున్నారంటేనే అర్థం చేసుకోవచ్చు.. ఇందులో ఉన్న కంటెంట్ ఏంటనేది. అలాగే ఇప్పటి వరకు విడుదలైన ప్రమోషనల్ కంటెంట్ చూసిన వారంతా.. ఇది బాక్సాఫీస్‌ని షేక్ చేసే సినిమా అవుతుందని చెబుతుండటం విశేషం. అద్భుతమైన సినిమాటిక్ అందించే ఈ పాన్-ఇండియా ద్విభాషా చిత్రానికి వెంకట్ కళ్యాణ్, అభిషేక్ జైస్వాల్ దర్శకత్వం వహిస్తున్నారు.
Also Read- Natti Kumar: చిరంజీవి నన్ను తిట్టినా సరే.. నా అభిప్రాయం మాత్రం ఇదే!
జీ స్టూడియోస్, ప్రెర్ణా అరోరా ప్రెజెంట్ చేస్తున్న ఈ సినిమాను ఉమేష్ కుమార్ బన్సాల్, ప్రెర్ణా అరోరా భారీ బడ్జెట్‌తో నిర్మిస్తున్నారు. మ్యూజిక్ జీ మ్యూజిక్ కో., క్రియేటివ్ డైరెక్షన్ దివ్య విజయ్. జీ స్టూడియోస్ స్ట్రాటజిక్ విజనరీ ఉమేష్ కుమార్ బన్సాల్ మద్దతుతో, ప్రొడ్యూసర్స్ శివిన్ నారంగ్, నిఖిల్ నందా, అరుణ అగర్వాల్, శిల్ప సింగాల్, కో-ప్రొడ్యూసర్స్ అక్షయ్ కేజ్రివాల్, కుస్సుం అరోరా ఈ హై-ఆక్టేన్ విజువల్స్, పౌరాణిక ఇతివృత్తాలతో రూపొందుతున్న ప్రాజెక్ట్‌కు మద్దత్తు ఇస్తున్నారు. ‘టాయిలెట్: ఏక్ ప్రేమ్ కథ, ప్యాడ్‌మాన్, పరి’ వంటి హిట్స్ ఇచ్చిన ప్రెర్ణా అరోరా మళ్లీ ఈ హై-కాన్సెప్ట్ సినిమాను చేస్తున్నారనే టాక్ రాగానే సినిమాపై అమాంతం అంచనాలు పెరిగిపోయాయి.
ఆ అంచాలకు తగ్గట్టే ఇటీవల వచ్చిన టీజర్ ఉండటంతో.. ఈ సినిమాపై మేకర్స్ కూడా భారీగా నమ్మకం పెట్టుకున్నారు. ఈ చిత్రం గ్రేట్ సినిమాటిక్ ఎక్స్ పీరియన్స్ అందించబోతుందనే విషయాన్ని ఇటీవల విడుదలైన టీజర్ చెప్పకనే చెప్పేసింది. ఈ టీజర్ నేషనల్ వైడ్‌గా వైరల్ అవడమే కాకుండా, అందరి నుంచి పాజిటివ్ స్పందనను రాబట్టుకుంది. తాజాగా ఈ మూవీ నుంచి మరో అప్డేట్‌ని మేకర్స్ వదిలారు. అదేందంటే..
ఇందులో హీరోయిన్‌గా నటిస్తున్న దివ్య ఖోస్లా (Divya Khosla) ఫస్ట్ లుక్‌ని మేకర్స్ విడుదల చేశారు. ఇందులో సితారగా దివ్య ఖోస్లాను కనిపించనున్నారు. ఆమె లుక్‌ని గమనిస్తే.. బ్యూటీఫుల్ అండ్ క్లాసిక్‌గా దివ్య ఖోస్లా కనిపిస్తోంది. ఫస్ట్ లుక్‌తోనే హీరోయిన్ ఆకట్టుకుంది. సినిమాలోనూ ఆమె పాత్రకు చాలా ఇంపార్టెన్స్ ఉంటుందని మేకర్స్ చెబుతున్నారు. విజనరీ టీమ్, జానర్ బౌండరీలు చెరిపేసే కాన్సెప్ట్‌తో.. ఈ ఏడాది మోస్ట్ అవైటెడ్ థియేట్రికల్ రిలీజ్‌లలో ఒకటిగా ఈ సినిమా రాబోతుంది. దేశవ్యాప్తంగా థియేట్రికల్ రిలీజ్‌కు మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు. కచ్చితంగా ఈ సినిమా ఇండియన్ సినిమా హిస్టరీలో నెక్స్ట్ మైథాలజికల్ ఎపిక్‌గా మారబోతోందని మేకర్స్ ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.
స్వేచ్ఛ ఈ – పేపర్ కోసం https://epaper.swetchadaily.com/ ఈ లింక్ క్లిక్ చేయగలరు