Natti Kumar and Chiru
ఎంటర్‌టైన్మెంట్

Natti Kumar: చిరంజీవి నన్ను తిట్టినా సరే.. నా అభిప్రాయం మాత్రం ఇదే!

Natti Kumar: టాలీవుడ్‌లో 18 రోజుల సమ్మెకు ముగింపు పలకడం సంతోషకరం, ఇందుకు చొరవ తీసుకున్న తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి (CM Revanth Reddy), మెగాస్టార్ చిరంజీవి (Megastar Chiranjeevi), అలాగే లేబర్ కమీషనర్‌కు ధన్యవాదాలు తెలియజేస్తున్నానని అన్నారు సీనియర్ నిర్మాత నట్టి కుమార్. శనివారం సాయంత్రం హైదరాబాద్‌లోని తన కార్యాలయంలో ఆయన మీడియా సమావేశం నిర్వహించారు. సినీ కార్మికుల సమ్మె ముగియడం సంతోషకరమే అయినప్పటికీ.. మాలాంటి చిన్న నిర్మాతలకు, అలాగే వివిధ సంఘాలకు చెందిన కార్మికులకు అనేక సందేహాలు ఉన్నాయని, వాటిని తీర్చేందుకు చర్చలలో పాల్గొన్న ఫిలిం ఛాంబర్ పెద్దలు కానీ, అటు ఫెడరేషన్ ప్రెసిడెంట్, సెక్రటరీలు కానీ ఎవరూ కనిపించడం లేదని నట్టి కుమార్ సంచలన ఆరోపణలు చేశారు.

ఈ మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. సమ్మె మొదలైనప్పటి నుంచి ఫిలిం ఛాంబర్ పెద్దలకు, ఫెడరేషన్ నాయకులకు మధ్య జరిగిన చర్చలలో 5 శాతం మాత్రమే వేతనాలు పెంచగలమని చెబుతూ వచ్చారు. అందుకు కార్మికులు అంగీకరించలేదు. ఈ నేపథ్యంలో షూటింగులు నిలిచి పోవడంతో ఈ సమస్యను పరిష్కరించమని సినీ పెద్దగా మెగాస్టార్ చిరంజీవి దగ్గరకు.. మా చిన్న నిర్మాతలతో పాటు పెద్ద నిర్మాతలు, ఫెడరేషన్ నాయకులు అందరూ వేర్వేరు‌గా వెళ్లి కలిశాం. అందుకు చిరంజీవి పెద్ద మనసుతో అంగీకరించి, నా సినీ పరిశ్రమలోని వారు పెద్దా, చిన్నా అంతా బావుండాలని అందరితో ఆయన సమయం కేటాయించి చర్చలు జరిపారు. ఎలాగైనా ఈ సమస్యను దూరం చేయాలని ఆయన ఎంతగానో కృషి చేశారు.

Also Read- Janaki vs state of Kerala: పండక్కి వెళ్లిన అమ్మాయిపై అత్యాచారం.. లాయర్లు పోలీసులు కూడా!.. ఈ కోర్డ్ డ్రామా మిస్‌కాకండి

అదే సమయంలో తెలంగాణ ప్రభుత్వం కూడా జోక్యం చేసుకోవడం, సమస్య పరిష్కారానికి పూనుకోవడం చాలా సంతోషకరమైన విషయం. అయితే లేబర్ కమీషనర్ దగ్గర ఫిలిం ఛాంబర్ పెద్దలు, ఫెడరేషన్ నాయకుల మధ్యన కుదిరిన ఒప్పందంలో కొన్ని అంశాలను మేము అంగీకరించలేం అని సినీ కార్మికులు అంటున్నారు. ఫెడరేషన్ నాయకులు మాకెవరికీ చెప్పకుండా, మా ప్రమేయం లేకుండా సంతకాలు పెట్టడం అభ్యంతరకరమని వారు విమర్శిస్తున్నారు. దీంతో సమ్మె విరమణ అయ్యి, మొదలవుతాయని అనుకుంటున్న షూటింగులు ఇంకా మొదలు కాలేదు.

మరోవైపు ప్రభుత్వ చర్చలు పూర్తయిన సందర్భంగా.. అంతకముందు సమస్య పరిష్కారానికి మూడు రోజుల సమయం వెచ్చించి అందరి సమస్యలను విని, ఆమోదమైన పరిష్కార మార్గానికి కృషి చేసిన మెగాస్టార్ చిరంజీవికి.. ఛాంబర్ నాయకులు కానీ, ఫెడరేషన్ నాయకులు కానీ కనీస కృతజ్ఞతలు చెప్పకపోవడం నాకు చాలా బాధనిపించింది. నా దృష్టిలో కృతజ్ఞతను మరచిపోవడం కరెక్ట్ కాదు. ఈ విషయాన్ని దిల్ రాజు, కిరణ్, సుప్రియ వంటి వారు.. అలాగే ఫెడరేషన్ నాయకులు అనిల్, అమ్మిరాజు వంటి వారంతా ఆలోచించాలి. ఈ అంశంలో చిరంజీవి నన్ను తిట్టినా సరే.. నా అభిప్రాయం సూటిగా చెబుతున్నాను.

Also Read- Chaitanya Rao: అనుష్కను ఒకసారి చూస్తే చాలనుకున్నా.. అలాంటిది ఆమెతో కలిసి..!

రాజకీయాలలో ఇలాంటివి జరగవచ్చునేమో కానీ.. సినీ పరిశ్రమలో కూడా అంతకన్నా ఎక్కువ రాజకీయాలు ఉంటాయని ఇదంతా చూస్తుంటే అర్థమవుతోంది. ఇప్పటికైనా చిన్నా, పెద్దా నిర్మాతలు, అలాగే సినీ కార్మికులు అందరూ బావుండాలన్నదే నా ఉద్దేశ్యం కూడా. ఎవరిలో ఎలాంటి అరమరికలు లేకుండా అందరికీ ఆమోదయోగ్యమైన పరిష్కారంతోనే సంతోషకరంగా షూటింగులు మొదలు కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను’’ అని చెప్పుకొచ్చారు.

స్వేచ్ఛ ఈ – పేపర్ కోసం https://epaper.swetchadaily.com/ ఈ లింక్ క్లిక్ చేయగలరు

Just In

01

Telangana politics: బీజేపీలో బిగ్ డిస్కషన్.. ఆపరేషన్ ఆకర్ష్ కవిత వర్తిస్తుందా..?

Minister Sridhar Babu: పరిశ్రమల ఏర్పాటుకు ఇక్కడ అన్నీ అనుకూలమే!

CBI Director Praveen Sood: హైదరాబాద్ వచ్చిన సీబీఐ డైరెక్టర్ ప్రవీణ్​ సూద్.. అందుకోసమేనా..?

Jajula Surender: సమీక్షలు కాదు సత్వర చర్యలు చేయండి: జాజుల సురేందర్

KTR: రాబోయే ఆరు నెలల్లో ఉప ఎన్నికలు ఖాయం.. కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు