Chaitanya Rao: క్వీన్ అనుష్క శెట్టి (Anushka Shetty) ప్రధాన పాత్రలో నటిస్తున్న మోస్ట్ ఎవైటెడ్ యాక్షన్ డ్రామా ‘ఘాటి’ (Ghaati Movie). విక్రమ్ ప్రభు మేల్ లీడ్‌గా నటించిన ఈ చిత్రానికి విజనరీ డైరెక్టర్ క్రిష్ జాగర్లమూడి దర్శకత్వం వహిస్తున్నారు. UV క్రియేషన్స్ సమర్పణలో ఫస్ట్ ఫ్రేమ్ ఎంటర్‌టైన్‌మెంట్ బ్యానర్‌పై రాజీవ్ రెడ్డి, సాయి బాబు జాగర్లమూడి నిర్మిస్తున్నారు. సెప్టెంబర్ 5న విడుదలకు సిద్ధమైన ఈ చిత్రంలో.. ఇటీవల ‘మయసభ’ అనే ఓటీటీ సిరీస్‌లో కీలక పాత్రలో నటించి, అందరి మన్ననలను అందుకున్న చైతన్య రావు ఓ కీలక పాత్ర పోషించారు. ఈ సినిమాకు సంబంధించి ఇప్పటి వరకు వచ్చిన ప్రమోషన్ కంటెంట్ సినిమాపై భారీగా అంచనాలను పెంచేయగా.. తాజాగా ఈ సినిమాలో కీలక పాత్రను పోషించిన చైతన్య రావు.. చిత్ర విశేషాలను మీడియాకు తెలిపారు. ఆయన మాట్లాడుతూ..
‘‘ఘాటిలో అవకాశం ఎలా వచ్చిందంటే.. ప్రొడ్యూసర్ రాజీవ్ ఓ రోజు కాల్ చేసి దర్శకుడు క్రిష్‌ని కలవమన్నారు. ఆయనను కలిస్తే నాకు ఈ కథ చెప్పారు. అద్భుతంగా అనిపించింది. ఆ తర్వాత ఈ సినిమాలో మీరు ఒక పాత్ర చేయాలని చెప్పి.. నా పాత్ర గురించి చెప్పారు. ఆ పాత్ర చెప్పిన తర్వాత నేను థ్రిల్ అయ్యాను. అసలు ఆ పాత్రకు ఆయన నన్ను ఎలా ఊహించుకున్నారో అని షాకయ్యాను. చాలా సీరియస్ అండ్ వైలెంట్ రోల్ ఇందులో చేస్తున్నాను. లుక్ సెట్ అవడం కోసం చాలా టైమ్ పట్టింది. దాదాపు రెండు రోజులు రకరకాల లుక్స్ ట్రై చేశాం. ఫైనల్‌గా ఓ లుక్‌ని ఫైనల్ చేశారు. ఇందులో నా పాత్ర రెగ్యులర్ విలన్‌లా ఉండదు. డైరెక్టర్ క్రిష్ కథ చెప్పేటప్పుడే ఇందులో నేను నిన్ను విలన్‌లా చూడట్లేదు. ఒక మెయిన్ క్యారెక్టర్‌లాగే చూస్తున్నాను అని చెప్పారు. ఈ సినిమాలో నా పాత్ర చాలా కీలకంగా ఉంటుంది. నా కెరీర్‌లో గుర్తుండిపోయే పాత్ర. ఇదొక ఐకానిక్ క్యారెక్టర్ అవుతుందనే నమ్మకం ఉంది. క్రిష్ చాలా ఫ్రీడమ్ ఇచ్చారు. ఇందులో నాకో మ్యానరిజం ఉంటుంది. ఒక యాక్టర్‌గా నా వైపు నుంచి కొన్ని ఆలోచనలు చెప్పాను. అలాగే క్రిష్ కొన్ని ఇన్‌పుట్స్ ఇచ్చారు. క్యారెక్టర్ అద్భుతంగా వచ్చింది.
ఈ సినిమాను ఈస్ట్రన్ ఘాట్స్‌లో షూట్ చేసాము. అక్కడ షూట్ చేయడం చాలా చాలెంజింగ్‌గా అనిపించింది. ఇందులో ఒక జలపాతం సీన్ ఉంది. చాలా రిస్కీ షాట్. ఫైనల్‌గా ఆ సీన్ చాలా అద్భుతంగా వచ్చింది. అనుష్క ఆ సీన్ కోసం చాలా రిస్క్ చేశారు. ఆ సీన్ ప్రేక్షకులకు థ్రిల్ ఇస్తుంది. అనుష్క నటిస్తున్న సినిమాలో అని దర్శకుడు చెప్పినప్పుడు ఫస్ట్ నమ్మలేదు. నేను అనుష్కకు చాలా పెద్ద ఫ్యాన్‌ని. ‘చింతకాయల రవి’ నా ఫేవరెట్ సినిమా. ఆ సినిమాని దాదాపు 30 సార్లు చూసి ఉంటాను. ఆమె నా దృష్టిలో బిగ్ లేడీ సూపర్ స్టార్. వెరీ స్వీట్ పర్సన్. అనుష్కతో వర్క్ చేయడం నిజంగా వండర్‌ఫుల్ ఎక్స్‌పీరియెన్స్. ఆమెను లైఫ్‌లో ఒకసారి చూస్తే చాలనుకున్నాను. అలాంటిది ఆమెతో కలిసి నటించడం అనేది వెరీ మెమొరబుల్. ఇక క్రిష్‌తో వర్క్ చేయాలని ప్రతి ఒక్కరికీ ఉంటుంది. నాకు ఈ సినిమాతో అవకాశం వచ్చినందుకు చాలా హ్యాపీ. ఆయన అందరి సజెషన్స్‌ని వింటారు. ఫుల్ ఫ్రీడమ్ ఇస్తారు. ఈ పాత్రకు నేను పర్ఫెక్ట్‌గా యాప్ అవుతానని ఆయన బలంగా నమ్మారు. ఆ నమ్మకాన్ని నిలబెట్టుకున్నానని భావిస్తున్నాను.
ఈ రోజుల్లో విలన్, హీరో అన్ని పాత్రలని ప్రేక్షకులు ఆదరిస్తున్నారు. అలాగే ఒక యాక్టర్‌గా అన్ని రకాల పాత్రలు చేయాలని ఉంటుంది. ఉదాహరణకు సత్యదేవ్, ఫహద్ ఫాజిల్ అన్ని రకాల పాత్రలు చేస్తున్నారు కదా. నేను కూడా ఆ స్పేస్‌నే కోరుకుంటున్నాను. ప్రస్తుతం క్రాంతి మాధవ్‌తో ఓ సినిమాను చేస్తున్నాను. ‘మయసభ’కు చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది. క్రిష్, దేవా కట్ట ఇద్దరూ వారి సినిమాలు విడుదలయ్యే వరకు మరో సినిమా ఓకే చేయవద్దని చెప్పారు. వీటి తర్వాత నీ కెరీర్ మలుపు తిరుగుతుందని వారు చెప్పినట్లే జరుగుతుంది. ఈ సినిమా విడుదల తర్వాత నేను చేయబోయే చిత్రాల ప్రకటనలు వస్తాయి’’ అని చెప్పుకొచ్చారు.
స్వేచ్ఛ ఈ – పేపర్ కోసం https://epaper.swetchadaily.com/ ఈ లింక్ క్లిక్ చేయగలరు