September Movies: రీసెంట్‌గా టాలీవుడ్‌లో జరిగిన కార్మికుల సమ్మె.. సెప్టెంబర్‌లో విడుదలయ్యే సినిమాలపై తీవ్ర ప్రభావం చూపినట్లుగా తెలుస్తోంది. సెప్టెంబర్‌లో విడుదల కావాల్సిన సినిమాల (September Movies) విషయంలో ప్రస్తుతం గందరగోళం నెలకొంది. సెప్టెంబర్ మొదటి వీక్‌లో రావాల్సిన కొన్ని సినిమాలు రెండు వారాల పాటు వాయిదా పడితే, సెప్టెంబర్‌లో రావాల్సిన ఇతర సినిమాలు కొన్ని అక్టోబర్, డిసెంబర్‌లకు వెళ్లిపోయినట్లుగా టాక్ నడుస్తుంది. అసలు సెప్టెంబర్‌లో విడుదలకు డేట్ ఫిక్స్ చేసిన సినిమాలను ఒక్కసారి గమనిస్తే.. అనుష్క నటించిన ‘ఘాటి’ (Ghaati Movie) సెప్టెంబర్ 5న, తేజ సజ్జా ‘మిరాయ్’ (Mirai) సెప్టెంబర్ 5న, శివకార్తికేయన్ ‘మదరాసి’ సెప్టెంబర్ 5న విడుదల కావాల్సి ఉంది. ‘లిటిల్ హార్ట్స్’ సెప్టెంబర్ 12న, బెల్లంకొండ సాయి శ్రీనివాస్ ‘కిష్కంధపురి’ సెప్టెంబర్ 12న, భాగ్యశ్రీ బోర్సే ‘కాంత’ సెప్టెంబర్ 12న, ‘భద్రకాళి’ సెప్టెంబర్ 19న రిలీజ్ అయ్యేందుకు డేట్ ఫిక్స్ చేసుకున్నాయి.
ఇవి కాకుండా సెప్టెంబర్ 25న పవన్ కళ్యాణ్ ‘ఓజీ’ (OG Movie), బాలకృష్ణ ‘అఖండ 2: తాండవం’ (Akhanda 2: Thandavam), సాయి దుర్గ తేజ్ ‘సంబరాల ఏటి గట్టు’ (SYG) చిత్రాలు సెప్టెంబర్‌లో ప్రేక్షకుల ముందుకు వచ్చే లిస్ట్‌లో ఉన్న చిత్రాలు. అయితే వీటిలో సెప్టెంబర్ 25న ఒకే ఒక్క చిత్రం విడుదల కానుంది. అది పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన ‘ఓజీ’ మాత్రమే. మిగతా రెండు సినిమాలు అక్టోబర్ లేదంటే నవంబర్‌లో విడుదలకు వాయిదా పడ్డాయి. ఇక సెప్టెంబర్ మొదటి వీక్‌లో విడుదల విషయంలో కూడా కన్ఫ్యూజన్ కొనసాగుతోంది. ‘ఘాటి’ ఎన్నో వాయిదాల తర్వాత సెప్టెంబర్ 5 విడుదల కాబోతోంది. ‘ఘాటి’ విడుదలలో ఎటువంటి మార్పు లేదు. ఆ సినిమాతో పాటు రిలీజ్‌కు రావాల్సిన తేజ సజ్జా ‘మిరాయ్’ మాత్రం రెండు వారాలు ఆలస్యంగా విడుదల అవుతుందనేలా టాక్ నడుస్తుంది. అయితే సెప్టెంబర్ 12, లేదంటే సెప్టెంబర్ 19న ‘మిరాయ్’ థియేటర్లలోకి వచ్చే అవకాశం ఉంది.
‘మిరాయ్’ వాయిదా పడటంతో.. సెప్టెంబర్ 12న రావాల్సిన ‘లిటిల్ హార్ట్స్’ చిత్రం ఒక వారం ముందుకు వచ్చేసింది. ‘లిటిల్ హార్ట్స్’ చిత్రం సెప్టెంబర్ 5నే ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. దీంతో సెప్టెంబర్ 5న ‘ఘాటి’, ‘లిటిల్ హార్ట్స్’ ఇంకా ‘మదరాసి’ చిత్రాలు తలపడనున్నాయి. సెప్టెంబర్ 12న లిస్ట్‌లో ఆగస్ట్‌లో రావాల్సిన రవితేజ ‘మాస్ జాతర’, ‘కిష్కంధపురి’, ‘కాంత’లతో పాటు ‘మిరాయ్’ ఉండొచ్చు. రవితేజ సినిమా వస్తే మాత్రం.. మ్యాక్సిమమ్ ‘మిరాయ్’ 19కి వాయిదా పడవచ్చు. కొత్తగా సెప్టెంబర్ 19 లిస్ట్‌లో ‘బ్యూటీ’ అనే సినిమా కూడా యాడయింది. ‘సంబరాల ఏటిగట్టు’ సినిమా షూటింగ్ ఇంకా పూర్తి కాలేదని తెలుస్తుంది. ఈ సినిమా డిసెంబర్‌లో వచ్చే అవకాశాలున్నాయి. బాలయ్య ‘అఖండ 2: తాండవం’ కూడా డిసెంబర్‌కు వాయిదా పడినట్లుగా తెలుస్తోంది. అయితే అధికారిక ప్రకటన మాత్రం ఇంకా రాలేదు. ప్రస్తుతానికి ఉన్న సమాచారం ప్రకారం.. అనుకున్న డేట్‌కి కొన్ని సినిమాలు మాత్రమే వచ్చే అవకాశం ఉంది. చాలా వరకు సినిమాలు వాయిదే పడే అవకాశాలే ఉన్నాయి.
స్వేచ్ఛ ఈ – పేపర్ కోసం https://epaper.swetchadaily.com/ ఈ లింక్ క్లిక్ చేయగలరు