Chiru Odela Project: మెగాస్టార్ చిరంజీవి (Megastar Chiranjeevi), శ్రీకాంత్ ఓదెల (Srikanth Odela) కాంబినేషన్‌లో ఓ మాస్ ఫిల్మ్ తెరకెక్కబోతున్న విషయం తెలిసిందే. ఈ సినిమాకు హీరో నాని (Natural Star Nani) నిర్మాతగా వ్యవహరించనున్నారు. ఆ మధ్య నాని, చిరు, శ్రీకాంత్ ఓదెల కలిసి అధికారికంగా ఈ ప్రాజెక్ట్‌ను అనౌన్స్ చేశారు. ఆ తర్వాత శ్రీకాంత్ ఓదెల, నాని వారి ప్రాజెక్ట్‌తో బిజీగా ఉండటంతో.. ‘చిరుఓదెల’ (ChiruOdela) సినిమాకు సంబంధించి ఎటువంటి అప్‌డేట్స్ రాలేదు. ఆగస్ట్ 22, మెగాస్టార్ చిరంజీవి పుట్టినరోజును పురస్కరించుకుని, దర్శకుడు శ్రీకాంత్ ఓదెల చేసిన ట్వీట్‌తో ఒక్కసారిగా అంతా ఈ సినిమా గురించే చర్చలు మొదలయ్యాయి. మెగా ఫ్యాన్స్ అందరూ శ్రీకాంత్ ఓదెలపై భారీగా నమ్మకం పెట్టుకున్నారు. ఎందుకంటే ఆయన మెగాస్టార్‌కు వీరాభిమాని. ఆ విషయం ఆయన చేసిన ట్వీట్ చూస్తుంటేనే తెలుస్తుంది. ఇక ఇదే సందర్భాన్ని పురస్కరించుకుని నెటిజన్లు, ఫ్యాన్స్.. చిత్రయూనిట్‌కు రిక్వెస్ట్ చేయడం స్టార్ట్ చేశారు. ఆ రిక్వెస్ట్ ఏమిటంటే..
ఈ సినిమాకు అనిరుధ్ రవిచందర్ సంగీత దర్శకుడిగా ఉంటే బాగుంటుందని అభిమానులు, నెటిజన్లు కోరుకుంటున్నారు. ఈ సినిమాకు సంబంధించిన వార్తలు బయటకు వచ్చినప్పటి నుంచి ఈ డిమాండ్ ఊపందుకుంది. చిరంజీవి వంటి స్టార్ హీరోతో, ‘దసరా’ వంటి సంచలనాత్మక చిత్రాన్ని తీసిన శ్రీకాంత్ ఓదెల వంటి యువ దర్శకుడితో కలిసి అనిరుధ్ పని చేస్తే అది ఒక అద్భుతమైన ప్రాజెక్ట్‌గా ఉంటుందని అభిమానులు అభిప్రాయపడుతున్నారు. అనిరుధ్ రవిచందర్ (Anirudh Ravichander) గత కొన్ని సంవత్సరాలుగా తెలుగు, తమిళ చిత్ర పరిశ్రమలలో అగ్ర సంగీత దర్శకులలో ఒకరిగా దూసుకెళుతున్నారు. ముఖ్యంగా ‘విక్రమ్’, ‘జైలర్’, రీసెంట్‌గా వచ్చిన ‘కూలీ’ సినిమాలకు ఆయన అందించిన సంగీతం, నేపథ్య సంగీతం ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకున్నాయి. అలాగే, ‘జెర్సీ’, ‘గ్యాంగ్ లీడర్’, ‘దేవర’, ‘కింగ్‌డమ్’ వంటి తెలుగు సినిమాలకు కూడా ఆయన అందించిన సంగీతం తెలుగు ప్రేక్షకులకు ఆయనని దగ్గరివాడిని చేసింది.
Also Read- Ram Charan: మాలలో ఉన్నవాళ్లు కేక్ తింటారా? చిరు-రామ్ చరణ్ కేక్ కటింగ్ వీడియోపై కామెంట్స్ వైరల్..
దీంతో చిరంజీవి సినిమాకు అనిరుధ్ కావాలంటూ ఫ్యాన్స్ కోరుకుంటున్నారు. చిరంజీవి, అనిరుధ్ కాంబినేషన్‌లో ఇంత వరకు సినిమా రాలేదు. కానీ, ఈ కాంబినేషన్‌పై అభిమానులు పెట్టుకున్న ఆశలు, వారి కోరికలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. అభిమానుల ఈ కోరికలపై చిత్ర బృందం ఎలా స్పందిస్తుందో చూడాలి. ఒకవేళ ఈ కాంబినేషన్ నిజమైతే, అది బాక్సాఫీస్ వద్ద రికార్డులు సృష్టించడం ఖాయం అని సినీ విశ్లేషకులు కూడా భావిస్తున్నారు. ఈ ప్రాజెక్ట్ గురించి మరిన్ని అధికారిక ప్రకటనల కోసం అందరూ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. నానికి, అనిరుధ్‌కి ఉన్న స్నేహం గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. కచ్చితంగా నాని ఫ్యాన్స్ కోరికను తీరుస్తాడని అంతా ఆశపడుతున్నారు. చూద్దాం.. ఏం జరుగుతుందో..?
స్వేచ్ఛ ఈ – పేపర్ కోసం https://epaper.swetchadaily.com/ ఈ లింక్ క్లిక్ చేయగలరు