Beauty Teaser: కుర్ర హీరోలలో ఇప్పుడిప్పుడే క్రేజ్‌ని రాబట్టుకుంటున్న హీరో అంకిత్ కొయ్య (Ankith Koyya). ఇటీవల ఆయన హీరోగా నటించిన ‘మారుతి నగర్ సుబ్రమణ్యం’ మంచి సక్సెస్ అందుకున్న విషయం తెలిసిందే. ఆ సినిమా తర్వాత అంకిత్ కొయ్య చేస్తున్న చిత్రం ‘బ్యూటీ’ (Beauty Movie). టైటిల్‌తోనే మంచి క్రేజ్‌ని సొంతం చేసుకున్న ఈ సినిమా.. ఇప్పటి వరకు విడుదలైన ప్రమోషనల్ కంటెంట్‌తో ఫీల్ గుడ్ ఎంటర్‌టైనర్ రాబోతుందనే హింట్ ఇచ్చేసింది. తాజాగా ఈ చిత్ర టీజర్‌ని మేకర్స్ విడుదల చేశారు. టీజర్‌తో పాటు విడుదల తేదీని కూడా మేకర్స్ ప్రకటించారు. ఇందులో అంకిత్ కొయ్య సరసన నీలఖి జంటగా నటించింది. వానరా సెల్యూలాయిడ్, మారుతీ టీం ప్రొడక్ట్, జీ స్టూడియోస్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రానికి ‘గీతా సుబ్రమణ్యం, హలో వరల్డ్, భలే ఉన్నాడే’ ఫేమ్ జె.ఎస్.ఎస్. వర్ధన్ మాటలు, దర్శకత్వం వహిస్తున్నారు. ‘బ్యూటీ’ చిత్రాన్ని అడిదాల విజయపాల్ రెడ్డి, ఉమేష్ కుమార్ బన్సాల్ నిర్మిస్తుండగా.. ఈ సినిమాకు కథ, స్క్రీన్‌ప్లేని ఆర్.వి. సుబ్రహ్మణ్యం అందించారు. యూత్ ఫుల్ లవ్ స్టోరీకి, ఫాదర్ ఎమోషన్, మిడిల్ క్లాస్ టచ్ ఇస్తే ఎలా ఉంటుందో.. ఈ సినిమా చూపించబోతుందనేలా టీజర్ తెలియజేస్తుంది. (Beauty Movie Teaser)
టీజర్‌ని గమనిస్తే.. ‘కన్నా మన పేరెంట్స్‌కి మన మీద ప్రపంచాన్నే కొనిచ్చేయాలన్నంత ప్రేమ ఉంటుంది’ అనే డైలాగ్‌తో మొదలైన ఈ టీజర్ ఎంతో ఆహ్లాదకరంగా ఉంటూనే ఎమోషనల్‌గా కనెక్ట్ అయ్యే సన్నివేశాలతో ఆసక్తిని పెంచేలా కట్ చేశారు. ‘బ్యూటీని కన్నావ్ అమ్మా నువ్వు’ అంటూ హీరోయిన్ పరిచయం.. ఆ వెంటనే ‘ఆ బైక్ ఎంత ఉంటుందంటావ్?.. మన కారు సంవత్సరం ఈఎంఐ ఎంత ఉంటుందో.. ఆ బైక్ అంత ఉంటుంది’ అనే డైలాగ్స్‌తో మిడిల్ క్లాస్ కలల్ని, కష్టాల్ని తెలియజేశారు. అంతే, ఆ డైలాగ్ తర్వాత నుంచి ఈ టీజర్ అంతా ఎమోషనల్‌గా, చాలా సీరియస్‌గా నటించింది. ‘అలేఖ్య కనిపించడం లేదండి’ అనే వాసుకి చెప్పే డైలాగ్, ఆ తర్వాత వచ్చిన సీన్లు కథలోని ఇంటెన్స్, సంఘర్షణను తెలియజేస్తున్నాయి.
‘కూతురు అడిగింది కొనిచ్చేప్పుడు వచ్చే కిక్కు ఓ మధ్య తరగతి తండ్రికే తెలుస్తుంది.. తన కోసం ఇంకొంచెం కష్టపడాలి, పడతాను’ అంటూ టీజర్ చివర్లో నరేష్ చెప్పిన ఎమోషనల్ డైలాగ్.. ఈ మూవీ కథపై చిన్న హింట్ ఇచ్చేస్తోంది. ఇప్పటి వరకు అల్లరి చిల్లరి పాత్రలలో కనిపించిన అంకిత్ కొయ్య.. ఈ సినిమాలో మాత్రం చాలా కష్టపడ్డాడనే విషయం ఆయన సన్నివేశాలు తెలియజేస్తున్నాయి ఈ ఎమోషనల్ టీజర్ ఆడియెన్స్‌ను బాగా ఆకర్షిస్తోంది. ఇక ఈ టీజర్‌లో విజయ్ బుల్గానిన్ ఆర్ఆర్, శ్రీ సాయి కుమార్ దారా ఇచ్చిన విజువల్స్.. సినిమా పేరుకు తగినట్లుగా బ్యూటీఫుల్‌గా ఉన్నాయి. ‘ఆయ్, మారుతీ నగర్ సుబ్రహ్మణ్యం’ వంటి సినిమాలతో తనదైన మార్క్ క్రియేట్ చేసుకున్న అంకిత్ కొయ్య.. ఈ ‘బ్యూటీ’ చిత్రంతో హీరోగా మరో మెట్టు ఎక్కేస్తాడనేలా.. చాలా ఇంటెన్స్ ఉన్న పాత్రను ఇందులో పోషించినట్టుగా కనిపిస్తోంది. ఇక ఈ చిత్రంలో నరేష్, వాసుకి, నంద గోపాల్, సోనియా చౌదరి, నితిన్ ప్రసన్న, మురళీ గౌడ్, ప్రసాద్ బెహరా వంటి వారందరికీ ప్రాముఖ్యత ఉన్న పాత్రలు లభించడం విశేషం. టీజర్ చివరిలో ఈ సినిమా విడుదల తేదీని కూడా ప్రకటించారు. ‘బ్యూటీ’ సినిమా సెప్టెంబర్ 19న గ్రాండ్‌గా విడుదలవుతుందని తెలియజేశారు. ప్రస్తుతం ఈ చిత్రానికి సంబంధించిన అన్ని పనులు పూర్తయినట్లుగా మేకర్స్ తెలిపారు.
స్వేచ్ఛ ఈ – పేపర్ కోసం https://epaper.swetchadaily.com/ ఈ లింక్ క్లిక్ చేయగలరు