mass-jatara( IMAGE :X)
ఎంటర్‌టైన్మెంట్

Mass Jathara film: రవితేజ ‘మాస్ జాతర’ వాయిదా నిజమేనా!.. ఎందుకంటే?

Mass Jathara film: మాస్ మహారాజ్ రవితేజ నటిస్తున్న తాజా చిత్రం ‘మాస్ జాతర’(Mass Jathara film). ఈ సినిమా ఆగస్టు 27 2025న విడుదలకు సిద్ధంగా ఉంది. అయితే ఈ సినిమా మరోసారి వాయిదా పడిందంటూ వార్తలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. ఈ సినిమా ప్రమోషన్లు ఇంకా జోరందుకోకపోవడంతో ఇది నిజమే అయి ఉంటుందని అంటున్నారు సినీ ప్రేక్షకులు. దీనిని బలపరుస్తూ.. ఈ సినిమా వాయిదా గురించి డిస్టిబ్యూటర్లకు చేప్పినట్లు సమాచారం. ఆగస్టు 27 2025న విడుదల అవ్వాల్సిన ‘మాస్ జాతర’ అక్టోబర్ 31 2025న విడుదల చేయనున్నట్లు నిర్మాతలు డిస్టిబ్యూటర్లకు చెప్పినట్లు తెలుస్తోంది. అయిదే దీనికి కారణం మాత్రం తెలియాల్సి ఉంది. వరుసగా ‘కింగ్డమ్’, ‘వార్ 2’ సినిమాలు నష్టాలు రావడంతో ఈ సినిమా వాయిదా వేసినట్లు సినీ వర్గాలు చెబుతున్నాయి. ప్రస్తుతం ‘మాస్ జాతర’పైనే నిర్మాత ఆశలు మొత్తం పెట్టుకున్నారని, ఈ సినిమా కూడా మిక్సుడ్ టాక్ వస్తే నిర్మాత మరింత నష్టాల్లో కూరుకుపోతారు. అయితే ఈ సినిమా విషయంలో చాలా జాగ్రత్తగా వ్యవహరిస్తున్నారని సమాచారం. ఎలాగైనా ఈ సినిమా హిట్ సాధించాలనే ఉద్దేశంతో నిర్మాత ఉన్నారని సమాచారం. అందుకే ఈ సినిమా విషయంలో డిలే అవుతుందని తెలుస్తోంది.

Read also- Gadwal Town: ఇళ్ల మధ్యనే కల్లు విక్రయాలు.. పట్టించుకోని ఎక్సైజ్ శాఖ అధికారులు

“మాస్ జాతర” రవితేజ 75వ సినిమా, భాను భోగవరపు దర్శకత్వం వహిస్తున్నారు. ఈ చిత్రంలో రవితేజ స్టైలిష్ రైల్వే పోలీస్ ఆఫీసర్‌గా కనిపించబోతున్నారు. శ్రీలీల హీరోయిన్‌గా నటిస్తోంది. సితార ఎంటర్‌టైన్‌మెంట్స్, ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్ బ్యానర్‌పై సూర్యదేవర నాగవంశీ, సాయి సౌజన్య నిర్మిస్తున్నారు. సంగీతాన్ని భీం సేసిరొలియో అందిస్తున్నాడు. టీజర్, ఫస్ట్ లుక్ ఇప్పటికే మంచి రెస్పాన్స్ తెచ్చుకున్నాయి. రవితేజ స్టైల్, ఎనర్జీతో పాటు యాక్షన్, కామెడీ, ఫ్యామిలీ ఎమోషన్స్ కలిపిన మాస్ ఎంటర్‌టైనర్‌గా రూపొందుతోంది.

Read also- Kukatpally Murder Case: నా కూతుర్ని చంపినట్లు.. బాలుడి పేరెంట్స్‌కు ముందే తెలుసు.. సహస్ర తండ్రి

మొదట ఈ సినిమా మే 9న రిలీజ్ చేయాలని అనుకున్నారు, తర్వాత ఆగస్టు 27కి మార్చారు. కానీ టాలీవుడ్ స్ట్రైక్ వల్ల ఆ తేదీ కూడా కుదరలేదు. ఇప్పుడు దీన్ని దీపావళి సీజన్‌లో విడుదల చేసే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. “ఓలే ఓలే” పాట, టీజర్ ట్రెండింగ్ అవుతున్నాయి, ఫ్యాన్స్ నుండి పాజిటివ్ రివ్యూలు వస్తున్నాయి. భారీ స్థాయిలో యాక్షన్ సీన్స్, జానీ మాస్టర్ కొరియోగ్రఫీతో పాటలు, ఎమోషనల్ డ్రామా మొత్తం కలిపి రవితేజ ‘మాస్ జాతర’ పండగ మూడ్‌లో ఆడియన్స్‌ని అలరించనుంచి.

Just In

01

Mahabubabad District: మహబూబాబాద్‌లో కుక్కల స్వైర విహారం.. పట్టించుకోని అధికారులు

Maoist Ashanna: మావోయిస్టు ఆశన్న సంచలన వీడియో.. ఏమన్నారంటే..?

Kishan Reddy: జూబ్లీహిల్స్‌లో రౌడీయిజం పెరిగిపోయింది: కిషన్ రెడ్డి సంచన వ్యాక్యలు

Private Colleges: నవంబర్ 3 నుంచి రాష్ట్రంలో ప్రైవేట్ కాలేజీల బంద్..?

Gopichand33: యాక్షన్ మోడ్‌లో గోపీచంద్.. తాజా అప్డేట్ ఇదే..