Sundarakanda
ఎంటర్‌టైన్మెంట్

Dear Eira Lyrical Song: నారా రోహిత్ సుందరకాండ నుంచి ‘డియర్ ఐరా’ వచ్చేసింది

Dear Eira Lyrical Song: ‘భైరవం’ తర్వాత నారా రోహిత్ (Nara Rohith) చేస్తున్న చిత్రం ‘సుందరకాండ’ (Sundarakanda). ఈ టైటిల్‌తో గతంలో వెంకటేష్, మీనా హీరోహీరోయిన్లుగా ఓ సినిమా వచ్చి, బ్లాక్‌బస్టర్ సక్సెస్ అందుకున్న విషయం తెలిసిందే. ఇప్పుడు రాబోతున్న ఈ సినిమాపై కూడా భారీగా అంచనాలు ఉన్నాయి. ఎందుకంటే, ఇందులో నారా రోహిత్ ‘సోలో’ మూవీ తరహా లుక్‌లో కనిపిస్తున్నారు. అలాగే ఇప్పటి వరకు విడుదలైన ప్రమోషనల్ కంటెంట్ కూడా సినిమాపై మంచి అంచనాలు ఏర్పడేలా చేసింది. అలాగే హీరో నారా రోహిత్ మైల్ స్టోన్ 20వ మూవీ ‘సుందరకాండ’ కావడంతో కచ్చితంగా సినిమా సక్సెస్ అవుతుందనేలా ఆయన ఫ్యాన్స్ ఎంతో ఆశతో ఉన్నారు. వాస్తవానికి నారా రోహిత్ నుంచి సోలో హీరోగా సినిమా వచ్చి చాలా రోజులు అవుతుంది. అందుకే ఈ సినిమాపై ఫ్యాన్స్ భారీగా ఆశలు పెట్టుకున్నారు.

Also Read- Raveena Tandon Daughter: రవీనా టాండన్ కుమార్తె రాషా టాలీవుడ్ ఎంట్రీ ఖరారు.. హీరో ఎవరో తెలుసా?

‘సుందరకాండ’ చిత్రాన్ని నూతన దర్శకుడు వెంకటేష్ నిమ్మలపూడి (Venkatesh Nimmalapudi) తెరకెక్కిస్తున్నారు. సందీప్ పిక్చర్ ప్యాలెస్ (SPP) బ్యానర్‌పై సంతోష్ చిన్నపొల్ల, గౌతమ్ రెడ్డి, రాకేష్ మహంకాళి నిర్మిస్తున్నారు. ఇప్పటికే టీజర్, ట్రైలర్, పాటలు స్ట్రాంగ్ బజ్‌ను క్రియేట్ చేయగా, శుక్రవారం (ఆగస్ట్ 22) ఈ సినిమా నుంచి ‘డియర్ ఐరా’ అంటూ సాగే బ్యూటీఫుల్ సాంగ్‌ని మేకర్స్ రిలీజ్ చేశారు. లియాన్ జేమ్స్ ఈ ‘డియర్ ఐరా’ (Dear Eira Lyrical Song)ను బ్యూటీఫుల్ లవ్ సాంగ్‌గా కంపోజ్ చేయడంతో పాటు కీర్తన వైద్యనాథన్‌తో కలిసి ఆలపించారు కూడా. ఈ పాటకు శ్రీ హర్ష ఈమని సాహిత్యం అందించారు. ఈ సాంగ్‌లో లీడ్ పెయిర్ కెమిస్ట్రీ చాలా ఫ్రెష్‌గా వుండటంతో పాటు, సాంగ్ లిరిక్స్ కూడా వినగానే ఎక్కేస్తుండటంతో.. ఇన్స్టంట్‌గా కనెక్టై సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతుంది. ఆగస్ట్ 27న ఈ సినిమా గ్రాండ్‌గా థియేటర్లలోకి వచ్చేందుకు ముస్తాబవుతోంది.

Also Read- Viral News: పేమెంట్ ఫెయిల్ కావడంతో భార్యకు తెలిసిపోయిన భర్త సీక్రెట్ శారీరక సంబంధం

ప్రస్తుతం ఈ సినిమాకు సంబంధించి ప్రమోషన్స్ యమా జోరుగా నడుస్తున్నాయి. నారా రోహిత్‌తో పాటు హీరోయిన్‌గా చేసిన శ్రీదేవి విజయ్ కుమార్ కూడా ప్రమోషన్స్‌లో పాల్గొంటున్నారు. ఇందులో మరో హీరోయిన్‌గా వృతి వాఘాని అనే అమ్మాయి నటిస్తోంది. నరేష్ విజయ కృష్ణ, వాసుకి ఆనంద్, సత్య, అజయ్, వీటీవీ గణేష్, అభినవ్ గోమటం, విశ్వంత్, రూప లక్ష్మి, సునైనా, రఘు బాబు వంటి వారంతా ఇతర పాత్రలలో నటించారు. నారా రోహిత్‌కు ఈ సినిమా హిట్ కావడం చాలా ముఖ్యం. మేకర్స్ కూడా ఈ సినిమా విజయం సాధిస్తుందని ధీమాగా చెబుతున్నారు. ఏ విషయం తెలియాలంటే ఆగస్ట్ 27 వరకు వెయిట్ చేయాల్సిందే..

స్వేచ్ఛ ఈ – పేపర్ కోసం https://epaper.swetchadaily.com/ ఈ లింక్ క్లిక్ చేయగలరు

Just In

01

Telangana Politics: కాంగ్రెస్‌లో ఉత్కంఠం.. ఏఐసీసీలో కవిత ఎపిసోడ్..?

Harish Rao: పాలకులే నెగిటివ్ మైండ్ సెట్.. అభివృద్ధి ఎలా సాధ్యం..?

Ashish Warang death: ప్రముఖ నటుడు కన్నుమూత.. సోకసంద్రంలో ఇండస్ట్రీ

Telangana politics: బీజేపీలో బిగ్ డిస్కషన్.. ఆపరేషన్ ఆకర్ష్ కవిత వర్తిస్తుందా..?

Minister Sridhar Babu: పరిశ్రమల ఏర్పాటుకు ఇక్కడ అన్నీ అనుకూలమే!