BRS Party (imagcredit:swetcha)
తెలంగాణ

BRS Party: ప్రజా సమస్యలపై స్పందన కరువు.. సమస్యలపై కమిటీ సైలెంట్?

BRS Party: ప్రజాసమస్యలపై స్పందించడంలో గులాబీ(BRS) అనుబంధ సంఘాలు మౌనం పాటిస్తున్నాయి. కేవలం ఒక్క విద్యార్థి విభాగం అడపాదడపా కార్యక్రమాలు తప్పా ఆశించిన స్థాయిలో నిర్వహించిన కార్యక్రమాలు లేవు. మహిళా, రైతు, యువత, మైనార్టీ, బీసీ ఇలా పార్టీ ఏ అనుబంధ సంఘం యాక్టీవ్ గా లేదు. ప్రస్తుతం రైతులు రోడ్లెక్కి నిరసన తెలుపుతున్నప్పటికీ రైతు సంఘం మాత్రం సైలెంట్ గా ఉంది. కేవలం పార్టీ మాత్రమే స్పందిస్తుంది. రైతుల సమస్యలపై గొంతెత్తుంది. అయితే పార్టీ కమిటీలు పూర్తిస్థాయిలో లేకపోవడంతోనా? లేకుంటే పార్టీ అధిష్టానం ఆదేశాలు ఇవ్వకపోవడంతోనే సైలెంట్ గా ఉన్నారనేది ఇప్పుడు చర్చకు దారితీసింది. రాష్ట్రంలో అధికారం కోల్పోయి దాదాపు రెండేళ్లు అవుతున్నప్పటికీ పార్టీ అనుబంధ సంఘాలపై దృష్టిసారించకపోవడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.

పార్టీ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు

ఏ రాజకీయ పార్టీకి అయినా అనుబంధ సంఘాలు కీలకం. కానీ గులాబీ పార్టీలోఅనుబంధ సంఘాలు ఎందుకు యాక్టివ్ గా లేవు..పార్టీ అధికారం కోల్పోయిన వేళ యాక్టివ్ గా ఉండాల్సిన అనుబంధ విభాగాలు ఎందుకు సైలెంట్ గా ఉన్నాయి..పార్టీలో అనుబంధ విభాగాల బలోపేతంపై అధినేత ఎందుకు దృష్టిసారించడం లేదనేది ఇప్పుడు హాట్ టాపిక్ అయింది. పార్టీ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు అనుబంధ సంఘాలు కీలకపాత్ర పోషిస్తాయి..కానీ బీఆర్ఎస్ పార్టీలో మాత్రం అందుకు భిన్నమైన పరిస్థితి ఉంది. బీఆర్ఎస్ పార్టీ అధికారం కోల్పోయి రెండు ఏళ్ళు అవుతున్నా అనుబంధ సంఘాలు యాక్టివ్ కాలేదు. దీంతో పార్టీ పరంగానే నేతలు ప్రజల్లోకి వెళ్లే ప్రయత్నం చేస్తున్నారు.ఏదైనా సమస్య వచ్చినప్పుడు అనుబంధ సంఘాలు యాక్టివ్ గా లేకపోవడం పార్టీకి ఇబ్బందిగా మారిందనే చర్చ నడుస్తోంది.

మరింత యాక్టీవ్ చేసేందుకు

పొలిటికల్ పార్టీకి అనుబంధంగా విద్యార్థి,యువజన,మహిళా,కార్మిక,రైతు ఇతర అనుబంధ సంఘాలు క్రియాశీలక పాత్ర పోషిస్తాయి. బీఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడు అనుబంధ సంఘాల కమిటీలు ఉన్నా పెర్ఫార్మన్స్ నామమాత్రంగానే ఉందని పార్టీలో ప్రస్తుతం చర్చ జరుగుతోంది. పార్టీ అధికారంకోల్పోయిన తర్వాత అనుబంధ సంఘాలు కీలక పాత్ర పోషించాల్సి ఉన్నా ప్రస్తుతం సైలెంట్ అయ్యారు. విద్యార్థి విభాగంను మరింత యాక్టీవ్ చేసేందుకు నూతన అధ్యక్షుడిని సైతం నియమిస్తామని, మండల నియోజకవర్గాల స్థాయి నుంచి పటిష్టమైన కమిటీని ఏర్పాటు చేస్తామని పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ప్రకటించారు. కానీ ఇప్పటివరకు ఆ దిశగా చర్యలు చేపట్టలేదు. కమిటీలు వేయలేదు. విద్యార్థి విభాగం సైతం అడపాదడపా కార్యక్రమాలు తప్ప పూర్తి స్థాయిలో విద్యారంగ సమస్యలపై పోరుబాట పట్టిన సందర్భాలు లేవు. కేవలం పార్టీ ఆదేశించినప్పుడు మాత్రమే కార్యక్రమాలు చేపడుతూ ఆ తర్వాత సైలెంట్ అవుతున్నారు. పీజులు, ఉపకార వేతనాలు, ఓవర్ సిస్ స్కాలర్ షిప్స్, సర్కారుబడుల్లో మౌలిక వసతులపై పోరాడాల్సి ఉన్నప్పటికీ తమకేమీ పట్టనట్లు వ్యవహరిస్తున్నారనే విమర్శలు వస్తున్నాయి.

Also Read: CM Revanth Reddy: హైదరాబాద్ పాతబస్తీ.. ఓల్డ్ సిటీ కాదు, ఒరిజినల్ సిటీ.. సీఎం రేవంత్

60లక్షల మంది సభ్యత్వం

మరోవైపు పార్టీ మహిళా విభాగం సైతం బలహీనంగా ఉంది. విభాగం అధ్యక్షురాలిగా పనిచేసిన గుండు సుధారాణి కాంగ్రెస్ లో చేరారు. దాదాపు ఏడాదిన్నరకు పైగా ఆ పోస్టు ఖాళీగా ఉన్నప్పటికీ పార్టీ నియామకంపై దృష్టిసారించలేదు. మహిళా సమస్యలపై పోరాటం చేసిన దాఖలాలు లేవు. మహిళల సమస్యలపై గులాబీ పార్టీ నుంచి మాట్లాడేందుకు మహిళానేతలు ముందుకు రావడంలేదు. రాష్ట్రంలో 60లక్షల మంది సభ్యత్వం ఉందని చెబుతున్న పార్టీ అధిష్టానంకు సరైన మహిళా నేత లేరా? అనేది ఇప్పుడు విస్తృతంగా చర్చజరుగుతుంది. పోరాడాల్సిన వారు సైలెంట్ గా ఉండటంతో పార్టీ బలంగా నిజంగానే ఉన్నదా అనే సందేహాలు సైతం వ్యక్తమవుతున్నాయి.

యూత్ వింగ్ ఆధ్వర్యంలో

అసెంబ్లీ,పార్లమెంట్ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీకి యూత్ పూర్తిగా దూరం అయ్యారు. తిరిగి గులాబీ పార్టీకి యూత్ దగ్గర కావాలంటే యూత్ వింగ్ ఆధ్వర్యంలోపెద్ద ఎత్తున కార్యక్రమాలు నిర్వహించాల్సి ఉంది. అధికారంలో ఉన్నప్పుడేయూత్ వింగ్ రాష్ట్ర అధ్యక్షుడుగా శంభిపూర్ రాజునుఅధిష్టానం నియమించింది. అప్పటి నుంచి ఆయనే కొనసాగుతున్నారు. అయినప్పటికీ యూత్ సమస్యలపై దృష్టి సారించలేకపోయారనే విమర్శలు వస్తున్నాయి. అంతేకాదు గ్రామస్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు యూత్ విభాగాలను ప్రకటించ లేదు. కేవలం ఆయన ఒక్కరే ఆ సంఘానికి అధ్యక్షుడిగా పనిచేస్తున్నారు. రాష్ట్రంలో యువతకు కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలు, నిరుద్యోగ సమస్యలపై పోరాడాల్సిన యువజన విభాగం నిమ్మకు నీరెత్తనట్లు వ్యవహరిస్తుందనే ఆరోపణలు వస్తున్నాయి. శంభీపూర్ రాజును తప్పించి నూతన అధ్యక్షుడిని నియమిస్తే తప్ప ఆ విభాగం పటిష్టం కాదని పార్టీ నేతలే అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.

కమిటీ కి అధ్యక్షుడు లేకపోవడంతో

పార్టీలో మరో కీలకమైన రైతు విభాగం. ఆ విభాగానికి తొలుత కంచర్ల రామకృష్ణారెడ్డి అధ్యక్షుడిగా పనిచేశారు. ఆయన తర్వాత ఎవరిని ఆ పోస్టులో నియమించలేదు. ప్రస్తుతం రాష్ట్రంలో రైతులు యూరియా కోసం తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. నిరసన తెలుపుతున్నారు. క్యూలైన్ లలో పడిగాపులు కాస్తున్నారు.. అయితే వారి పక్షాన రైతు విభాగం నిలబడి పోరాటం చేయాల్సి ఉంది. కానీ కమిటీ కి అధ్యక్షుడు లేకపోవడంతో పోరాటానికి దూరంగా ఉంది. ఈ సమయంలో రైతు పక్షాన పోరాడితే పార్టీకి బలం చేకూరే అవకాశం ఉంది. ఇది అనువైన సమయం కాని, పార్టీ అధిష్టానం తీరు ఇప్పుడు విమర్శలకు దారితీస్తుంది. అదే విధంగా కార్మిక విభాగం, కుల సంఘాలకు సంబంధించిన అనుబంధ సంఘాలు, ఇలా అన్ని సంఘాలు సైతం తమ హక్కుల కోసం పోరాడటంలో వెనుకంజ వేస్తున్నాయి. అయితే ఇప్పటికైనా పార్టీ అధిష్టానం స్పందించి పార్టీ అనుంబంధ సంఘాలను బలోపేతం చేస్తుందా? లేదా? అనేది చర్చజరుగుతుంది. మరోవైపు ఉన్న సంఘాలకు సైతం అధిష్టానం ఆదేశాలు ఇవ్వకపోవడంతోనే సమస్యలపై ప్రజల్లోకి వెళ్లడం లేదనే ప్రచారం జరుగుతుంది. ఏది ఏమైనా గులాబీ అనుబంధ సంఘాలు సమస్యలపై స్పందించకపోవడంతో విమర్శలు వస్తున్నాయి.

Also Read: MP Strange Incident: పక్కవారికి రెండు లడ్లు ఇచ్చి.. తనకు ఒక్కటే ఇచ్చారని.. ఏకంగా సీఎంనే..

Just In

01

Crime News: తీరుమారని గంజాయి పెడ్లర్ పై పీడీ యాక్ట్.. ఉత్తర్వులు జారీ!

Crime News: హైదరాబాద్‌లో దారుణం.. మార్ఫింగ్ ఫోటోలతో యవతికి బెదిరింపులు

Teja Sajja: టాలీవుడ్ హీరోల గురించి ఎవరికీ తెలియని విషయం చెప్పిన తేజ సజ్జా.. ఇలా కూడా ఉంటుందా?

Balapur Laddu Auction 2025: బాలాపూర్ లడ్డు సరికొత్త రికార్డ్.. ఈసారి ఎన్ని రూ.లక్షలు పలికిందంటే?

Pending Bills: పెండింగ్‌లో అద్దెవాహన బిల్లులు.. ఖజానా కోసం ఎంపీడీవోల చూపులు