Padma Devender Reddy (imagecredit:swetcha)
నార్త్ తెలంగాణ

Padma Devender Reddy: అన్నదాన కేంద్రం వద్ద మాజీ ఎమ్మెల్యే ధర్నా.. రైతులను ఆదుకోవాలని డిమాండ్

Padma Devender Reddy: మెదక్ జిల్లా రామాయంపేట పట్టణంలోని అన్నదాత ఎరువుల కేంద్రం వద్ద మాజీ ఎమ్మెల్యే పద్మా దేవేందర్ రెడ్డి(Padma Devender Reddy) ఆధ్వర్యంలో రైతులు ఆందోళన కార్యక్రమం చేపట్టారు. ప్రభుత్వం సొసైటీలకు యూరియా సరఫరా చేయకుండా ప్రైవేట్ వ్యాపారస్తులకు యూరియా సరఫరా చేసి కొరత సృష్టిస్తున్నారని ఆమె ఆగ్రహం వ్యక్తం చేశారు. అన్నదాత ఆగ్రో సేవా కేంద్రంలో గంట మందు కొనుగోలు చేసిన వారికి మాత్రమే యూరి(Urea)యా అమ్మకాలు చేయడంపై రైతులతో కలిసి ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం రైతుల కష్టాలు పట్టించుకోవడంలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు.

ఆందోళన కార్యక్రమలు

మంత్రులు ఒక మాట, ముఖ్యమంత్రి మరొక మాట మాట్లాడుతూ రైతులు గోసలు పడుతున్న పట్టించుకోవడంలేదని మాజీ ఎమ్మెల్యే పద్మాదేవేందర్ రెడ్డి మండిపడ్డారు. రైతుల కన్నీటి గాథల్లో కాంగ్రెస్(Congress) ప్రభుత్వం కొట్టుకుపోతుందని శాపనార్థాలు పెట్టారు. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి రైతులకు సరిపడా యూరియా సరఫరా చేయాలని లేని పక్షంలో ఆందోళన కార్యక్రమలు ఉదృతం చేస్తామని ఆమె హెచ్చరించారు. బిఆర్ఎస్(BRS) 10 సంవత్సరాల పాలనలో రైతులు ఎన్నడూ కూడా ఎరువుల కోసం రోడ్ ఎక్కలేదని ప్రస్తుత ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత యూరియా కోసం ధర్నాలు రాస్తారోకోలు చేపట్టడం జరుగుతుందని ఆమె అన్నారు.

Also Read: Gold Rate Today: సామాన్యులకు గుడ్ న్యూస్.. నేడు భారీగా తగ్గిన గోల్డ్ రేట్స్

ఎరువులు ఇవ్వని దౌర్భాగ్య పరిస్థితి

రైతుల కళ్ళల్లో కన్నీళ్లు కనిపిస్తున్నాయని రైతులకు ఎరువులు ఇవ్వని దౌర్భాగ్య పరిస్థితిలో కాంగ్రెస్(Congress) ప్రభుత్వం ఉన్నదని ఆమె తెలిపారు, రైతులపై చిత్తశుద్ధి లేని కాంగ్రెస్ ప్రభుత్వం రైతుల ఉసురు కాంగ్రెస్కు తగులుతుందని రెండు రోజుల్లో రైతులకు యూరియా అందకపోతే జాతీయ రహదారిపై ధర్నా రాస్తారోకోలు చేస్తామని హెచ్చరించారు, ఈ కార్యక్రమంలో రామయంపేట సొసైటీ చైర్మన్ బాదే చంద్రం, మున్సిపల్ తాజా మాజీ చైర్మన్ పల్లె జితేందర్ గౌడ్, మార్కెట్ కమిటీ మాజీ వైస్ చైర్మన్ ఎస్కె అహ్మద్, కొత్త రాజేందర్ గుప్తా, ఐరేనీ బాలు గౌడ్, కన్నాపురం కృష్ణ గౌడ్, ఉమామహేశ్వర్, హసనుద్దీన్, శ్రీకాంత్ సాగర్, సుభాష్, శ్యామ్, నరేందర్ రెడ్డి, గొల్ల రాజు, సురేష్, స్వామి, మల్లేశం, తదితరులు పాల్గొన్నారు.

Also Read: Protest In Tirumala: తిరుపతిలో శ్రీవారి మెట్టు చిరువ్యాపారుల వినూత్న కార్యక్రమం!

Just In

01

Gopichand33: యాక్షన్ మోడ్‌లో గోపీచంద్.. తాజా అప్డేట్ ఇదే..

Premaledhani: ‘ప్రేమ లేదని’ గ్లింప్స్ విడుదల.. ఎలా ఉందంటే?

Taapsee Pannu: ముంబైలోనే ఉన్నా.. ఆ ప్రచారాలు ఆపండి

Jubilee Hills Bypoll: ఆ రెండు పార్టీల మధ్యే పోటీ!.. జూబ్లీహిల్స్ క్షేత్రస్థాయి పరిస్థితి ఇదే!

OG Movie: ఓటీటీలోనూ ఊచకోత మొదలెట్టిన ‘ఓజీ’.. 8 దేశాల్లో టాప్ 1 ప్లేస్‌లో!