Mr Romeo Teaser launch
ఎంటర్‌టైన్మెంట్

Mr Romeo Teaser: ‘మిస్టర్ రోమియో’కు హీరోయిన్ శ్రియా శరణ్ సపోర్ట్

Mr Romeo Teaser: ఒకప్పుడు స్టార్ హీరోయిన్‌గా అప్పటి స్టార్ హీరోలందరితో నటించిన హీరోయిన్ శ్రియా శరణ్ (Shriya Saran). పెళ్లి తర్వాత కొంత గ్యాప్ తీసుకున్న శ్రియా శరణ్ అప్పుడప్పుడు టాలీవుడ్‌లో మెరుస్తుంది. ఏదైనా స్పెషల్ సాంగ్ పడితే చేయడానికి సిద్ధంగా ఉన్న ఈ భామ.. మరోసారి టాలీవుడ్‌లో సందడి చేసింది. తాజాగా ఆమె ‘మిస్టర్ రోమియో’ (Mr Romeo) అనే సినిమాకు సపోర్ట్ చేశారు. శ్రీ లక్ష్మీ ఆర్ట్స్, మీడియా 9 క్రియేషన్స్ బ్యానర్ పై.. మనోజ్ కుమార్ కటోకర్ దర్శకత్వంలో నేతి శ్యామ్ సుందర్ నిర్మిస్తున్న మ్యూజికల్ ఫిలిం ‘మిస్టర్ రోమియో’. ‘ఏ రీల్ లైఫ్ స్టోరీ’ అనేది ఈ సినిమా ట్యాగ్ లైన్. గురుచరణ్ నేతి, జుహీ భట్, అమిషి రాఘవ్ హీరోహీరోయిన్లుగా నటిస్తున్న ఈ సినిమాలో ఎస్‌కే ఖాదర్, నవనీత్ బన్సాలి, కుల్దీప్ రాజ్ పురోహిత్ ఇతర ముఖ్య పాత్రల్లో కనిపించనున్నారు. చైతన్య గరికిన స్క్రీన్‌ప్లే, డైలాగ్స్ అందించిన ఈ చిత్రాన్ని ప్రజ్వల్ క్రిష్ సంగీత దర్శకుడు. తాజాగా ఈ చిత్ర టీజర్‌ని హైదరాబాద్‌లో జరిగిన కార్యక్రమంలో హీరోయిన్ శ్రియా శరణ్ చేతుల మీదుగా మేకర్స్ విడుదల చేశారు. టీజర్ విడుదల అనంతరం.. టీజర్ చాలా బాగుందని, కచ్చితంగా మంచి హిట్ అవుతుందని తెలుపుతూ.. టీమ్‌కు శ్రియా శరణ్ శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమానికి దర్శకుడు కరుణ కుమార్ మరో అతిథిగా హాజరయ్యారు.

Also Read- HBD Chiranjeevi: నాడు దేశంలో ఎక్కువ రెమ్యూనరేషన్ హీరో.. అమితాబ్ కూడా అందుకోలేని పారితోషికం

ఈ కార్యక్రమంలో శ్రియా శరణ్ మాట్లాడుతూ.. ‘‘టీజర్ చాలా బాగుంది. మూవీ కూడా బ్యూటీఫుల్‌గా ఉంటుందని ఆశిస్తున్నాను. గురు చరణ్ అద్భుతంగా నటించారు. తనలో మంచి నటుడు కనిపిస్తున్నాడు. టీజర్‌లో కార్తీక్‌గా కనిపించిన చరణ్ నటన చాలా బాగుంది. ‘నాకు రియల్ లవ్ కావాలి. రీల్స్ లవ్ కాదు’ అని చరణ్ చెప్పే డైలాగ్ కూడా టచ్చింగ్‌గా ఉంది. హీరోగా తను మరిన్ని సినిమాలు చేయాలని కోరుతున్నాను. డైరెక్టర్ మనోజ్ నాకు ఎప్పటి నుంచో తెలుసు. అతనితో ఎప్పుడు మాట్లాడినా సినిమాలు, కథలు గురించే చెబుతుంటారు. ఇలాంటి బ్యూటిఫుల్ లవ్ స్టోరీతో ప్రేక్షకుల ముందుకు వస్తున్నందుకు హ్యాపీగా ఉంది. ఈ కథ నాకు తెలుసు. యూత్‌ని మెస్మరైజ్ చేసేలా, వాళ్లకి నచ్చేలా అన్ని ఎలిమెంట్స్ ఇందులో ఉన్నాయి. ఇందులో పార్ట్ అయిన ప్రతి ఒక్కరికి ఈ చిత్రం ఘన విజయం సాధించి.. మంచి పేరు తీసుకురావాలని కోరుకుంటున్నానని తెలిపారు. దర్శకుడు కరుణకుమార్ మాట్లాడుతూ.. సినిమాల్లో చిన్న పెద్ద అనే తేడా ఉండదు. అది క్రియేట్ చేసే వండర్స్‌ను బట్టి అది లెక్కలోకి వస్తుంది. ఈ సినిమా చాలా బాగుండటమే కాదు.. ఇండస్ట్రీలో కొత్త ఒరవడిని సృష్టించబోతుంది. గురు చరణ్‌కు మొదటి సినిమా అయినా చాలా బాగా నటించారు. తను భవిష్యత్తులో పెద్ద హీరో అవుతాడని ఆశిస్తున్నానని అన్నారు.

Also Read- Ganesh Chaturthi Trains: వినాయక చవితికి ఊరెళ్తున్నారా? ఈ 380 రైళ్లు మీకోసమే.. ఓ లుక్కేయండి!

హీరో గురు చరణ్ నేతి (Guru Charan Nethi) మాట్లాడుతూ.. ఇదొక క్యూట్ లవ్ స్టోరీ. మనోజ్ కుమార్ ఈ చిత్రాన్ని అద్భుతంగా రూపొందిస్తున్నారు. యువతను ఆకట్టుకునే అన్ని ఎలిమెంట్స్ ఇందులో ఉంటాయి. మమ్మల్ని బ్లెస్ చేయడానికి వచ్చిన శ్రియ, కరుణ కుమార్‌లకు ధన్యవాదాలని చెప్పారు. చిత్ర దర్శకుడు మనోజ్ కుమార్ మాట్లాడుతూ.. ఇది చిన్న సినిమా అయినా విజువల్‌గా మాత్రం పెద్ద సినిమా చూసిన అనుభవాన్ని ఇస్తుంది. సినిమా దాదాపు పూర్తయింది. ఆర్ఆర్ వర్క్ జరుగుతుంది. మరో నెలలో విడుదల చేయడానికి ప్లాన్ చేస్తున్నాం. గురు చరణ్ తప్పకుండా పెద్ద హీరో అవుతాడు. తనలో ఉన్న టాలెంట్ ఆయనని పెద్ద హీరోని చేస్తుంది. అందరూ ఈ సినిమా కోసం ఎంతగానో కష్టపడ్డారు. వారందకీ ఈ సందర్భంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నానని అన్నారు.

స్వేచ్ఛ ఈ – పేపర్ కోసం https://epaper.swetchadaily.com/ ఈ లింక్ క్లిక్ చేయగలరు

Just In

01

Gopichand33: యాక్షన్ మోడ్‌లో గోపీచంద్.. తాజా అప్డేట్ ఇదే..

Premaledhani: ‘ప్రేమ లేదని’ గ్లింప్స్ విడుదల.. ఎలా ఉందంటే?

Taapsee Pannu: ముంబైలోనే ఉన్నా.. ఆ ప్రచారాలు ఆపండి

Jubilee Hills Bypoll: ఆ రెండు పార్టీల మధ్యే పోటీ!.. జూబ్లీహిల్స్ క్షేత్రస్థాయి పరిస్థితి ఇదే!

OG Movie: ఓటీటీలోనూ ఊచకోత మొదలెట్టిన ‘ఓజీ’.. 8 దేశాల్లో టాప్ 1 ప్లేస్‌లో!