Musi River Development: మూసీ నది ప్రక్షాళన, సుందరీకరణ పేరుతో కాంగ్రెస్ ప్రభుత్వం(Congress government) ప్రజల సొమ్మును దోచుకోవడానికి సిద్ధమవుతోందని బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్(KTR) మండిపడ్డారు. కేసీఆర్(KTR) ప్రభుత్వం మూసీ అభివృద్ధి కోసం మొత్తం రంగం సిద్ధం చేసి, రూ.16 వేల కోట్లతో మాస్టర్ ప్లాన్, డీపీఆర్ (డిటైల్డ్ ప్రాజెక్ట్ రిపోర్ట్) తయారు చేస్తే, ఇప్పుడు అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం ఎస్టిమేట్స్‌ను రూ.1,50 వేల కోట్లకు పెంచి దోపిడీకి పాల్పడుతోందని ఎక్స్ వేదికగా ప్రభుత్వంపై ఫైర్ అయ్యారు.
Also Read: Kavitha – KTR: కేటీఆర్ దెయ్యాల జాబితాలో లేరంటూ కవిత స్పష్టీకరణ
రూ.1,100 కోట్లతో ప్రతిపాదనకు ఆమోదం
ఈ ప్రజాధనం దోపిడీని ముమ్మాటికీ ఎండగడుతామని, దాన్ని ఖచ్చితంగా అడ్డుకుంటామని హెచ్చరించారు. ‘కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణం ద్వారా గోదావరి నీళ్లను హైదరాబాద్(Hyderabad)కు దగ్గరలోని కొండపోచమ్మ సాగర్‌కు తెచ్చింది కేసీఆర్(KCR) ప్రభుత్వమే. కొండపోచమ్మ సాగర్ నుంచి గండిపేట చెరువుకు గోదావరి నీళ్లను తరలించడానికి 2022 లోనే రూ.1,100 కోట్లతో ప్రతిపాదనకు ఆమోదం కూడా కేసీఆర్ ప్రభుత్వమే ఇచ్చింది. మూసీ నదిలో చేరే 2000 ఎంఎల్డీ (మిలియన్ లీటర్స్ పర్ డే) మురుగు నీటిని శుద్ధి చేయడం కోసం మొత్తం 36 ఎస్టీపీల (సీవరేజ్ ట్రీట్మెంట్ ప్లాంట్) నిర్మాణాన్ని చేపట్టి పూర్తి చేసిందీ కేసీఆర్ ప్రభుత్వమే. మూసీ నదిలో 5 కిలోమీటర్ల మేర నాగోల్ ప్రాంతంలో సుందరీకరణ పనులు చేపట్టి, మూసీ నది ఒడ్డున ఉప్పల్ భగాయత్‌లో శిల్పారామాన్ని ఏర్పాటు చేసిందీ గత ప్రభుత్వమే’ అని కేటీఆర్ వివరించారు.
Also Read: KTR on Congress: సర్కార్‌పై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఫైర్