Mega 157 Title Glimpse: మెగాస్టార్ చిరంజీవి ప్రస్తుతం విశ్వంభరతో పాటు దర్శకుడు అనిల్ రావిపూడి రూపొందిస్తున్న ఓ కొత్త సినిమాలో నటిస్తున్నారు. ఈ చిత్రం షైన్ స్క్రీన్స్, చిరంజీవి కుమార్తె సుస్మిత నిర్మిస్తున్న గోల్డ్ బాక్స్ ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌లపై తెరకెక్కుతోంది. ఇప్పటికే రెండు షెడ్యూళ్ల షూటింగ్ పూర్తయింది, చిరు సరసన హీరోయిన్‌గా నయనతార నటిస్తున్నారు.
చిరంజీవి-అనిల్ రావిపూడి కాంబోలో వస్తున్న చిత్రంపై అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. ఫ్యామిలీ కామెడీ జోనర్‌లో రూపొందుతున్న ఈ మూవీ 2026 సంక్రాంతి సందర్భంగా రిలీజ్ కానుంది. తాజాగా, చిరంజీవి పుట్టిన రోజు సందర్భంగా ఈ చిత్ర టైటిల్‌ను అధికారికంగా ప్రకటించారు. ఊహాగానాలకు సరిగ్గా సరిపోయేలా, ఈ మూవీకి మన శంకర్ వరప్రసాద్ గారు అనే టైటిల్ ఫిక్స్ చేశారు.
మన శంకర వర ప్రసాద్ గారు పండగకి రావడం కాదు. ఆయన వచ్చాకే పండగ వస్తది.. జై చిరంజీవ. ఇదీ..! ఇదికదా మాకు కావాల్సినది..!! అన్నయ్యా ఇరగదీశారు. సంక్రాతికి బాక్సాఫీస్ బద్దలైపోవాలి. మళ్ళీ పాత రోజులు గుర్తుకొచ్చాయి, 70సంవత్సరాలు అంటే నమ్మడం కావట్లే. విక్టరీ వెంకటేష్ అన్న వాయిస్ ఈ సినిమాలో ఉంటే.. సూపర్ ఉంటుంది. ఆయన్ను కూడా ఈ సినిమాలో పెట్టండి గురు. థియేటర్లు దద్దరిల్లిపోతాయి. ఇది విక్టరీ వెంకటేష్ అభిమానులందరి కోరిక అంటూ కామెంట్స్ చేస్తున్నారు.