Warangal Crime: పెళ్లై భర్త ఉన్నా వేరే వ్యక్తితో అక్రమ సంబందం పెట్టుకొని అతనితో కలిసి భర్తను హత్య చేసిన భార్యకు, హత్య చేసేందుకు సహకరించిన ఆమె ప్రియునికి జీవితకాలం జైలు శిక్ష, ఇద్దరికి చేరో రూ.1000 జరిమానా విధిస్తూ భూపాలపల్లి జిల్లా ప్రధాన న్యాయమూర్తి సి హెచ్. రమేష్ బాబు తీర్పు వెల్లడించినారు. కేసుకు సంబంధించిన వివరాలు పోలీసులు తెలిపిన ప్రకారం జయశంకర్ భూపాలపల్లి జిల్లా(Jayashankar Bhupalpally District) అడవి ముత్తారం మండలం రేగులగూడెం గ్రామానికి చెందిన మారపాక దేవేందర్ కు మారపాక స్వప్నతో వివాహం జరిగింది. వీరికి ఇద్దరు కొడుకులు, ఒక కూతురు ఉన్నారు.
ప్రియుడు పవన్ కళ్యాణ్
ఈ క్రమంలో మారుపాక స్వప్నకు అడవి ముత్తారం గ్రామానికి చెందిన లింగమల్ల పవన్ కళ్యాణ్(Pawankalyan) అనే వ్యక్తితో పరిచయం ఏర్పడి, అది అక్రమ సంబందానికి దారితీసింది. ఈ క్రమంలో భార్యా భర్తలకు గొడవలు జరిగేవి. దీంతో తన భర్తను ఎలాగైనా చంపాలనే ఉద్దేశ్యంతో పథకం ప్రకారం తేదీ 20.08.2020 రోజున మద్యాహ్నం 3 గంటల సమయంలో స్వప్న తన ప్రియుడు పవన్ కళ్యాణ్ తెచ్చిన మధ్యంలో విషం కలిపి భర్తకు త్రాగించారు. దాంతో అతడు అపస్మారక స్థితిలోకి వెళ్ళి చనిపోయాడు. ఈ విషయంపై మృతుడు మారపాక దేవేందర్ తండ్రి మారపాక నర్సయ్య ఇచ్చిన ఫిర్యాదు మేరకు అప్పటి అడవి ముత్తారం ఎస్. ఐ. సి హెచ్. శ్రీనివాస్ అనుమానస్పద మరణం క్రింద కేసు నమోదు చేసినారు. తదుపరి విచారణ తర్వాత అది హత్యగా నిర్ధారణ కాగా అప్పటి కాటారం సిఐ బి.హతిరామ్ నిందితులు ఇద్దరిని అరెస్ట్ చేసి సరియైన సాక్షాదారాలలో కోర్టులో చార్జీషీట్ ఫైల్ చేసినారు.
Also Read: Mahesh Kumar Goud: కష్టపడే కార్యకర్తలకు అండగా నిలుస్తాం.. పదవులు రాలేదని నిరాశ వద్దు
నేరం రుజువు కావడంతో
లైజన్ ఆఫీసర్ గాండ్ల వెంకన్న ఏఎస్ఐ ఆధ్వర్యంలో కోర్టు కానిస్టేబుల్ కె.రమేష్ కోర్టులో సాక్షులను ప్రవేశ పెట్టగా, పబ్లిక్ ప్లాసిక్యూటర్ ఎదులాపురం శ్రీనివాస్ వాదనలు తన వాదనలు వినిపించారు. సాక్షుల విచారణ అనంతరం నిందితులు ఇద్దరిపై నేరం రుజువు కావడంతో న్యాయమూర్తి నిందితులకు శిక్ష ఖరారు చేసినట్టు పోలీసులు పేర్కొన్నారు. ఈ కేసులో సమర్దవంతంగా పని చేసి నిందితులకు శిక్షపడేలా చేసిన అప్పటి దర్యాప్తు అధికారులను, ప్రస్తుత కాటారం డి ఎస్ పి సూర్యనారాయణ, కాటారం సిఐ నాగార్జునారావు, అడవిముత్తారం ఎస్ ఐ మహెందర్ కుమార్, కోర్ట్ లైజన్ ఆఫీసర్, కోర్టు కానిస్టేబుల్ ను భూపాలపల్లి జిల్లా ఎస్ పి కిరణ్ ఖరే అభినందించినారు.
Also Read; CP Radhakrishnan Nomination: ఉపరాష్ట్రపతి పదవికి ఎన్డీఏ అభ్యర్థి సీపీ రాధాకృష్ణన్ నామినేషన్