Spiny Gourd Benefits (Image Source: Twitter)
Viral

Spiny Gourd Benefits: బోడ కాకరకాయతో ఎన్ని ఆరోగ్య ప్రయోజనాలున్నాయో తెలుసా?

Spiny Gourd Benefits: కూరగాయలలో బోడ కాకరకాయకు ప్రత్యేక స్థానం ఉంది. దీని అరుదైన లభ్యత, ఖరీదైన ధర దీని విశిష్టతకు కారణం. మార్కెట్లలో అరుదుగా దొరికే ఈ కాకరకాయ ఆయుర్వేదంలో కూడా ఉపయోగిస్తారు. అంతే కాదు, ఇది అత్యంత శక్తివంతమైన కూరగాయగా కూడా పరిగణించబడుతుంది. మటన్ లేదా చికెన్‌తో పోలిస్తే, బోడ కాకరకాయలో 50 రెట్లు ఎక్కువ పోషకాలు ఉంటాయని పోషకాహార నిపుణులు చెబుతున్నారు.

Also Read: Punjab and Sind Bank Jobs: తెలుగు రాష్ట్రాల్లో బ్యాంక్ ఆఫీసర్ పోస్టులు.. జీతం రూ.85 వేలు.. వెంటనే, అప్లై చేసుకోండి!

విటమిన్లు, ఖనిజాలు, ఆరోగ్యకర గుణాల నిలయంగా దీనిని చెప్పొచ్చు. బోడ కాకరకాయ కూర రుచిలోనే కాదు, ఆరోగ్య ప్రయోజనాల్లోనూ మంచిది అని చెప్పొచ్చు. దీనిని తినడం వలన శరీరంలో రోగనిరోధక శక్తి పెరుగుతుంది. రక్తంలోని హానికర బ్యాక్టీరియాను నాశనం చేయడంలో కూడా ఇది కీలక పాత్ర పోషిస్తుంది. కడుపు నొప్పి, చర్మ సమస్యలు, వయసు రీత్యా వచ్చే అనారోగ్యాలను తొలగించడంలో ఇది సహాయపడుతుంది. ముఖ్యంగా, డయాబెటిస్ ఉన్నవారికి బోడ కాకరకాయ ఒక వరం. ఇది రక్తంలో షుగర్ లెవెల్స్ ను నియంత్రించడంలో సహాయపడుతుంది. అందుకే, షుగర్ పేషెంట్లు దీనిని ఎక్కువగా తీసుకుంటారు.

Also Read: GWMC Commissioner: చెత్త తరలింపు వాహనాల సమాచారం నమోదు చేయాలి.. బల్దియా కమిషనర్ చాహత్ బాజ్ పాయ్

అంతే కాదు, చిన్న పిల్లలకు కూడా ఈ కూరను తినిపిస్తే వైరల్ ఇన్ఫెక్షన్లు తగ్గుతాయి. అలాగే, వారి ఆరోగ్యం మెరుగుపడుతుంది. చర్మ సమస్యల నివారణలోనూ ఇది మంచిగా పనిచేస్తుంది. ఆయుర్వేదంలో కూడా బోడ కాకరకాయ అనేక ఔషధాల తయారీలో కీలక పాత్ర వహిస్తుంది. ముఖ్యంగా క్యాన్సర్ చికిత్స, డయాబెటిస్ మందుల తయారీలో వీటిని ఉపయోగిస్తారు.

వర్షాకాలంలో ఈ కాకరకాయ ఎక్కువగా దొరుకుతుంది. కాబట్టి, ఈ సమయంలో వారంలో ఒకసారైనా ఈ కూరను తప్పక తినాలని వైద్య నిపుణులు చెబుతున్నారు. బోడ కాకరకాయ కేవలం కూరగాయ కాదు, ఆరోగ్యానికి అమృత తుల్యం. దీనిని మన ఫుడ్ డైట్ లో చేర్చుకోవడం వల్ల శారీరక, మానసిక ఆరోగ్యం రెండూ కూడా మెరుగుపడతాయి.

Also Read: Dreams: మీకు అలాంటి క‌ల‌లు వ‌స్తున్నాయా..? అయితే దుర‌దృష్టం మీ వెంటే ఉన్నట్లు.. జాగ్రత్త!

గమనిక: పలు అధ్యయనాలు, పరిశోధనలు, హెల్త్ జర్నల్స్ నుంచి సేకరించిన సమాచారాన్ని మీ అవగాహన కోసం ఇక్కడ యథావిధిగా అందించాం. ఈ సమాచారం వైద్యానికి లేదా చికిత్సకు ప్రత్యామ్నాయం కాదు. ఆరోగ్యానికి సంబంధించి.. ఎలాంటి సందేహాలున్నా మీరు తప్పకుండా డాక్టర్‌ను సంప్రదించాలి. ఈ ఆర్టికల్‌లో పేర్కొన్న అంశాలకు ‘స్వేచ్ఛ’ ఎటువంటి బాధ్యత వహించదని గమనించగలరు.

Just In

01

CCI Cotton Procurement: పత్తి కొనుగోళ్లలో అవకతవకలు జరగొద్దు.. పినపాక ఎమ్మెల్యే

Kavitha Janam Bata: కేసీఆర్‌కు ఆ అవసరం లేదు.. నిజామాబాద్ ప్రెస్‌మీట్‌లో కవిత ఆసక్తికర వ్యాఖ్యలు

Kurnool Bus Accident: కర్నూలు బస్సు ప్రమాద ఘటనలో ట్విస్ట్.. చనిపోయిన వ్యక్తిపై కేసు.. ఏం జరగబోతోంది?

Drinking Culture: మందు బాబులు మద్యం సేవించిన తర్వాత ఎందుకు ఎక్కువగా తింటారో తెలుసా?

Bigg Boss Telugu 9: సంజన నోటికి లాక్.. క్లౌడ్ గేమ్ షురూ.. మేఘం వర్షిస్తేనే సేఫ్, లేదంటే?