Konda vs Congress: వరంగల్ కాంగ్రెస్‌లో మరోసారి వర్గ విబేధాలు భగ్గుమన్నాయి. రాజీవ్ గాంధీ జయంతి వేళ వరంగల్ కాంగ్రెస్‌లోని ఇరువర్గాల మధ్య అంతర్గత విభేదాలు మళ్లీ బయటపడ్డాయి. మంత్రి కొండా సురేఖ మద్దతుదారులు, ఎమ్మెల్సీ బసవరాజు సారయ్య వర్గం నేతలు వేర్వేరుగా నివాళులు అర్పించారు. ఇరువర్గాల నాయకులు ఎవరికి వారే పోటా పోటీగా నినాదాలు చేసుకున్నారు. దీంతో అక్కడే ఉన్న సారయ్య వర్గం, ఇతర నేతలు సురేఖ రాకతో హడావుడిగా వెళ్లిపోయారు.
Also Read: Gold Rate Hikes Today: ఒక్క రోజే భారీగా పెరిగి బిగ్ షాకిచ్చిన గోల్డ్?
ఈ మధ్య కొంత స్తబ్దతగా ఉన్న వర్గ విభేదాలు మరోసారి దీంతో బయటపడ్డట్టు అయ్యాయి. గతంలో తీవ్రస్థాయికి చేరగా వర్గ విభేదాలు అధిష్టానంకు ఒకరిపై ఒకరు ఫిర్యాదులు చేసుకునే స్థాయికి చేరాయి. అధిష్టానం చొరవ తీసుకొని విభేదాలు లేకుండా చేసిందని అనుకుంటుండగా ఇప్పుడు ఎవరికి వారే జయంతి కార్యక్రమంలో పాల్గొనడం, ఎవరికి అనుగుణంగా వారు నినాదాలు చేసుకోవడంతో విబేధాలు అలాగే ఉన్నాయని మరోసారి బయటపడింది. దీంతో ‘మీరు.. మారరా’ అంటూ సొంత పార్టీ నేతలు చర్చించుకుంటున్న పరిస్థితి.