Medaram Jathara: మేడారం సమ్మక్క-సారలమ్మ జాతర నిర్వహణ కోసం తెలంగాణ ప్రభుత్వం చారిత్రాత్మక నిర్ణయం తీసుకున్నది. ఈ మహోత్సవం విజయవంతంగా సాగేందుకు, మేడారంలో శాశ్వత నిర్మాణాలు, రహదారులు, తాగునీటి సదుపాయాలు, విద్యుత్, పారిశుధ్యం వంటి మౌలిక వసతుల అభివృద్ధి పనుల కోసం ప్రభుత్వం రూ.150 కోట్లు మంజూరు చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. గిరిజన సంక్షేమ శాఖ నిధులు మంజూరు చేస్తూ ఉత్తర్వులు విడుదల చేసింది.
Also Read: Toddy Adulteration: గద్వాల జిల్లాలో ఏరులై పారుతున్న కల్తీ కల్లు.. కల్లు దందాలో వారిదే పెత్తనం
ఈ నిర్ణయం ఆదివాసీల గౌరవానికి ప్రతీక
వచ్చే ఏడాది జనవరిలో నిర్వహించబోయే మేడారం మహా జాతర ఎన్నడూ లేని రీతిలో వైభవోపేతంగా నిర్వహించేందుకు అధికారులు ఏర్పాటు చేస్తున్నారు. ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయం ఆదివాసీల గౌరవానికి ప్రతీక అని మంత్రి సీతక్క తెలిపారు. ఈసారి జాతర మరింత గొప్పగా, చారిత్రాత్మకంగా జరుగనుందని పేర్కొన్నారు. నిధులు మంజూరు చేసిన సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి, మంత్రి అడ్లూరు లక్ష్మణ్‌లకు కృతజ్ఞతలు తెలిపారు.
Also Read: Indian Railways: రైల్వేలో కొత్త రూల్స్.. పరిమితికి మించి లగేజీ తీసుకెళ్తే ఫైనే.. ఇవిగో నిబంధనలు!