తెలంగాణ

Singareni: సింగరేణి తొలిసారిగా కీలక ఖనిజ రంగంలోకి ప్రవేశం

Singareni: సింగరేణి సంస్థ కీలక ఖనిజ రంగంలోకి ప్రవేశించాలన్న రాష్ట్ర ప్రభుత్వ సంకల్పం కార్యరూపం దాల్చింది. కర్ణాటకలోని దేవ దుర్గ్‌లోని బంగారం, రాగి గనుల అన్వేషణ లైసెన్స్ కోసం కేంద్ర ప్రభుత్వం ఆధ్వర్యంలోని గనుల మంత్రిత్వ శాఖ నిర్వహించిన ఆన్‌లైన్ వేలంలో 37.75 శాతం రాయల్టీని కోట్ చేయడం ద్వారా సింగరేణి ఎల్1 బిడ్డర్‌గా నిలిచినట్లు సంస్థ సీఎండీ బలరామ్(CMD Balaram) తెలిపారు. ఈ మేరకు మంగళవారం మీడియా ప్రకటన విడుదల చేశారు. ఖనిజ అన్వేషణలో సింగరేణి శుభారంభం చేసినట్లు అయిందన్నారు.

 Also Read: Jurala Project: జూరాల ప్రాజెక్టుకు పోటెత్తిన వ‌ర‌ద‌.. 40 గేట్లు ఎత్తివేత‌

సింగరేణి(Singareni)ని ఇతర రంగాల్లోకి విస్తరించాలన్న రాష్ట్ర ప్రభుత్వ లక్ష్యాలకు అనుగుణంగా చేస్తున్న ప్రయత్నంలో తొలి విజయాన్ని సాధించినట్లు పేర్కొన్నారు. రానున్న ఐదేళ్లలో ఈ గనుల్లో అన్వేషణను పూర్తి చేస్తామన్నారు. కర్ణాటక దేవదుర్గ్‌లోని బంగారం, రాగి నిక్షేపాలు ఉన్న ఈ ప్రాంతంలో సింగరేణి అన్వేషణ విభాగం ఆధ్వర్యంలో త్వరలో పరిశోధన చేయనుందని తెలిపారు. వివిధ రకాల అన్వేషణల అనంతరం తుది ఫలితాలను కేంద్ర ప్రభుత్వానికి నివేదిక రూపంలో సమర్పించాల్సి ఉంటుందన్నారు.

రాయల్టీలో 37.75 శాతం

అనంతరం కేంద్రం ఈ గనులను మైనింగ్ కోసం వేలంలో వేస్తుందని, ఆ గనులను సింగరేణి లేదా ఇతర సంస్థలు దక్కించుకోవడానికి అవకాశం ఉంటుందని వివరించారు. ఈ గనులను మైనింగ్ కోసం దక్కించుకున్న సంస్థలు రాష్ట్ర ప్రభుత్వానికి చెల్లించాల్సిన రాయల్టీలో 37.75 శాతాన్ని ఆ గని జీవిత కాలం పాటు సింగరేణికి చెల్లించాల్సి ఉంటుందని వెల్లడించారు. ఈ అన్వేషణ కోసం సుమారు రూ.90 కోట్ల వ్యయం అవుతుందని, అందులో రూ.20 కోట్లను కేంద్రం సబ్సిడీగా చెల్లిస్తుందన్నారు.

 Also Read: Swetcha Effect: స్వేచ్ఛ ఎఫెక్ట్.. కేబుల్ వైర్లపై స్పందించిన ప్రభుత్వం.. డిప్యూటీ సీఎం కీలక ఆదేశాలు

Just In

01

Gaddam Prasad Kumar: మహిళల ఆర్థిక అభివృద్ధే ప్రభుత్వ లక్ష్యం.. గడ్డం ప్రసాద్ కీలక వ్యాఖ్యలు

Naresh65: కామెడీ గోస్ కాస్మిక్.. అల్లరి నరేష్ 65వ చిత్ర వివరాలివే..!

Drug Factory Busted:చర్లపల్లిలో డ్రగ్ తయారీ ఫ్యాక్టరీపై దాడి.. వేల కోట్ల రూపాయల మాదకద్రవ్యాలు సీజ్

Gold Kalash robbery: మారువేషంలో వచ్చి జైనమత ‘బంగారు కలశాలు’ కొట్టేశాడు

Director Krish: ‘హరి హర వీరమల్లు’ విషయంలో చాలా బాధగా ఉంది