Sridevi Vijay Kumar
ఎంటర్‌టైన్మెంట్

Sridevi Vijay Kumar: శ్రీదేవి విజయ్ కుమార్.. సినిమాలకు బ్రేక్ ఎందుకు ఇచ్చిందో తెలుసా?

Sridevi Vijay Kumar: రెబల్ స్టార్ ప్రభాస్ మొదటి సినిమా ‘ఈశ్వర్’లో హీరోయిన్‌గా నటించిన శ్రీదేవి విజయ్ కుమార్.. ఆ తర్వాత కొన్ని సినిమాల అనంతరం.. సినీ ఇండస్ట్రీలో కనిపించలేదు. టాలీవుడ్‌లోనే కాదు, కోలీవుడ్‌లోనూ ఆమె మళ్లీ నటించలేదు. చాలా గ్యాప్ తర్వాత మళ్లీ ఆమె హీరోయిన్‌గా రీ ఎంట్రీ ఇస్తోంది. హీరో నారా రోహిత్ మైల్ స్టోన్ 20వ మూవీగా రూపుదిద్దుకుంటున్న ‘సుందరకాండ’తో తిరిగి ఆమె టాలీవుడ్‌లోకి రీ ఎంట్రీ ఇస్తోంది. సందీప్ పిక్చర్ ప్యాలెస్ (SPP) బ్యానర్‌పై సంతోష్ చిన్నపొల్ల, గౌతమ్ రెడ్డి, రాకేష్ మహంకాళి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. వృతి వాఘాని, శ్రీదేవి విజయ్ కుమార్ ఇందులో హీరోయిన్లుగా నటిస్తున్నారు. వెంకటేష్ నిమ్మలపూడి (Venkatesh Nimmalapudi) దర్శకుడిగా పరిచయం అవుతున్న ఈ సినిమా ఆగస్ట్ 27న విడుదలయ్యేందుకు ముస్తాబవుతోంది. ఈ సందర్భంగా హీరోయిన్ శ్రీదేవి విజయ్ కుమార్ చిత్ర విశేషాలతో పాటు.. తను ఎందుకు ఇన్నాళ్లూ ఇండస్ట్రీకి దూరంగా ఉందో కూడా చెప్పుకొచ్చారు. ఆమె మాట్లాడుతూ..

Also Read- Ram Charan: నెవర్ బిఫోర్ లుక్‌లో.. ‘పెద్ది’ సర్‌ప్రైజ్‌కు సిద్ధమా!

రీఎంట్రీలో కూడా హీరోయిన్ అవకాశం వచ్చినందుకు చాలా హ్యాపీగా ఉంది. ఏ యాక్టర్ కైనా మంచి పాత్ర చేయాలని ఉంటుంది. ఏదైనా క్యారెక్టర్ స్ట్రాంగ్ గా ఉండాలి. ‘సుందరకాండ’లో చాలా మీనింగ్ ఫుల్ క్యారెక్టర్ చేస్తున్నాను. ఇందులో చేస్తున్నానని తెలిసి.. అన్ని చోట్ల నుంచి అప్రిషియేషన్స్ వస్తున్నాయి. ఇది చాలా ఆనందాన్ని ఇచ్చింది. చాలా కొత్త పాయింట్‌తో వస్తున్న ప్రాజెక్టు ఇది. ఒక ఆడియన్‌గా ఈ సినిమా నాకు చాలా నచ్చింది. అవుట్ ఫుట్ చాలా అద్భుతంగా వచ్చింది. ఫ్రెష్ కంటెంట్. అందరూ థియేటర్లకి వెళ్లి సినిమా చూసి ఎంజాయ్ చేయాలని కోరుతున్నాను.

సినిమాలకి బ్రేక్ ఇవ్వడానికి కారణమిదే
సినిమాలకి బ్రేక్ ఇవ్వడానికి కారణం ఏంటంటే.. నేను హీరోయిన్‌గా చేస్తున్న రోజుల్లోనే పెళ్లి చేసేశారు. నా పెళ్లిని ఇంట్లోని వారు ముందుగానే ప్లాన్ చేశారు. పెళ్లి తర్వాత ఒక పాప పుట్టింది. ఆ పాపని చూసుకునే క్రమంలో మళ్లీ సినిమాల గురించి ఆలోచించలేదు. కాకపోతే టీవీలలో మాత్రం కొన్ని ప్రోగ్రామ్స్ చేశాను. ఇన్ని సంవత్సరాల గ్యాప్ తర్వాత మళ్లీ స్క్రీన్ మీద చూసుకోవడం చాలా ఎక్సైటింగ్‌గా ఉంది. లాస్ట్ ఇయర్ ‘ఈశ్వర్’ సినిమా రీ రిలీజ్ అయినప్పుడు కూడా.. నన్ను తెరపై చూసుకుని చాలా ఎగ్జయిట్ అయ్యాను. అది నాకు చాలా మంచి ఎక్స్‌పీరియెన్స్‌ని ఇచ్చింది. ఇప్పుడు మా అమ్మాయి పెద్దదైంది. మరిన్ని సినిమాలు చేయడానికి అవకాశం దొరికింది. అందుకే రీ ఎంట్రీ ఇచ్చాను.

Also Read- Brahmanandam: నా దృష్టిలో అందమైన హీరో ఎవరో తెలుసా?.. బ్రహ్మానందం సంచలన వ్యాఖ్యలు

ప్రభాస్, నేను ఇద్దరం.. ‘ఈశ్వర్’ సినిమాతో లాంచ్ అయ్యాం. మా మధ్య ఫ్రెండ్షిప్ ఇప్పటికీ అలానే వుంది. తనిప్పుడు ఇంకా బిగ్ స్టార్ అయ్యారు. అయినా కూడా ఆయనలో ఎలాంటి మార్పు లేదు. ఇప్పటికి కూడా ఆయన చిన్నపిల్లాడిలానే నవ్వుతూ పలకరిస్తారు. ‘ఈశ్వర్’ సినిమా టైమ్‌లోనే ఆయన పెద్ద సూపర్ స్టార్ అవుతారని మేమంతా అనుకునే వాళ్లం. ఆ సినిమా సక్సెస్ టూర్‌కి వెళ్తున్నప్పుడు పెద్ద ఎత్తున జనం వచ్చేవారు. మేము ఊహించినదానికంటే ఆయన ఇప్పుడు పెద్ద స్టార్ అయ్యారు. నిజంగా అదొక బ్లెస్సింగ్. ఇండస్ట్రీలో అప్పటికి ఇప్పటికి చాలా మార్పులు వచ్చాయి. మొత్తం మారిపోయింది. ఇప్పుడు టెక్నికల్‌గా ఇంకా ఈజీ అయింది. డైరెక్షన్ డిపార్ట్‌మెంట్ వర్కింగ్ స్టైల్ కూడా మారింది. నాకు అంతా కొత్తగా అనిపించింది. నా రీ ఎంట్రీలో అన్ని రకాల క్యారెక్టర్స్ చేయాలని అనుకుంటున్నాను. కథలో మంచి ప్రాధాన్యత వుండే స్ట్రాంగ్ క్యారెక్టర్స్ వస్తే చేయాలని ఉందని చెప్పుకొచ్చారు.

స్వేచ్ఛ ఈ – పేపర్ కోసం https://epaper.swetchadaily.com/ ఈ లింక్ క్లిక్ చేయగలరు

Just In

01

Minister Sridhar Babu: పరిశ్రమల ఏర్పాటుకు ఇక్కడ అన్నీ అనుకూలమే!

CBI Director Praveen Sood: హైదరాబాద్ వచ్చిన సీబీఐ డైరెక్టర్ ప్రవీణ్​ సూద్.. అందుకోసమేనా..?

Jajula Surender: సమీక్షలు కాదు సత్వర చర్యలు చేయండి: జాజుల సురేందర్

KTR: రాబోయే ఆరు నెలల్లో ఉప ఎన్నికలు ఖాయం.. కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు

Expand Dog Squad: రాష్ట్రంలో నేరాలను తగ్గించేందుకు పోలీసులు సంచలన నిర్ణయం..?