Kantara Chapter-1
ఎంటర్‌టైన్మెంట్

Kantara Chapter 1: ‘కాంతార చాప్టర్ 1’‌లో కులశేఖరగా ఆ నటుడు.. ఫస్ట్ లుక్ విడుదల

Kantara Chapter 1: ప్రపంచ వ్యాప్తంగా ప్రేక్షకులు ఎంతగానో వేచి చూస్తున్న చిత్రాలలో ఒకటి ‘కాంతార చాప్టర్ 1’ (Kantara Chapter 1). ‘కాంతార’ (Kantara) సినిమాకు ప్రీక్వెల్‌గా రూపుదిద్దుకుంటున్న ఈ సినిమాపై ఆకాశమే అవధి అనేలా అంచనాలు ఉన్నాయి. ఎందుకంటే, పార్ట్ 3లో మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ (Jr NTR) చేసేందుకు ఓకే చెప్పినట్లుగా ఈ మధ్య వార్తలు వచ్చాయి. అంతే, అప్పటి నుంచి ఈ చాప్టర్ 1పై కూడా ప్రేక్షకులు ఓ లుక్ వేసి ఉంచారు. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ పూర్తి చేసుకున్నట్లుగా ఇటీవల మేకర్స్ అధికారికంగా ప్రకటించారు. ఇక చిత్రయూనిట్ ప్రమోషన్స్‌‌పై దృష్టి పెట్టి.. ఇందులోని పాత్రలను పరిచయం చేస్తోంది. అందులో భాగంగా తాజాగా మేకర్స్ ఓ అప్డేట్ ఇచ్చారు. ఆ అప్డేట్ ఏమిటంటే.. ఇందులోని ఓ పాత్రని ప్రేక్షకులకు పరిచయం చేశారు. ఆ వివరాల్లోకి వెళితే..

Also Read- HHVM OTT: షాకింగ్ సర్‌ప్రైజ్.. ముందే ఓటీటీలోకి వచ్చేస్తున్న ‘వీరమల్లు’.. ఇంకొన్ని గంటల్లోనే!

‘కాంతార చాప్టర్ 1’లో నటిస్తున్న బాలీవుడ్ నటుడు గుల్షన్ దేవయ్య ఫస్ట్ లుక్‌‌ను మంగళవారం విడుదల చేశారు. రిషబ్ శెట్టి (Rishab Shetty) బ్లాక్‌ బస్టర్ ‘కాంతార’కు ప్రీక్వెల్‌ అయిన ఇందులో గుల్షన్ దేవయ్య కులశేఖర (Gulshan Devaiah as Kulashekara) పాత్రలో కనిపించనున్నారని తెలుపుతూ విడుదల చేసిన ఈ ఫస్ట్ లుక్ ప్రస్తుతం వైరల్ అవుతోంది. ఈ అనౌన్స్‌మెంట్ ఫ్రాంచైజీ అభిమానులలో ఉత్సాహాన్ని నింపింది. ఈ లుక్‌లో దైవత్వం కనబడుతోంది. ఇంద్రుని కొలువులో ఉండే వారిలా గుల్షన్ లుక్ ఉందంటే ఆశ్చర్యపోవాల్సిన అవసరమే లేదు. ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా ఉన్న ప్రేక్షకులను అలరించడానికి సిద్ధమవుతోంది. రిషబ్ శెట్టి రచన, దర్శకత్వం వహించి.. తానే మళ్లీ సెంట్రల్ క్యారెక్టర్‌గా నటిస్తున్న ఈ చాప్టర్ 1.. మొదటి పార్ట్‌లో ఉన్న యూనివర్స్‌ని ఇంకా విస్తరించబోతోందని మేకర్స్ తెలుపుతున్నారు.

Also Read- Swetcha Effect: స్వేచ్ఛ ఎఫెక్ట్.. కేబుల్ వైర్లపై స్పందించిన ప్రభుత్వం.. డిప్యూటీ సీఎం కీలక ఆదేశాలు

అందుకే బడ్జెట్ విషయంలో ఎక్కడా వెనకడుగు వేయకుండా.. భారీగా సినిమాను రూపొందిస్తున్నట్లుగా మేకర్స్ అధికారికంగా ప్రకటించారు కూడా. తొలి సినిమా రా, ఫోక్‌లొర్, ఆధ్యాత్మికత, భావోద్వేగాలతో రూటెడ్ స్టోరీ టెల్లింగ్‌కు కొత్త నిర్వచనం ఇస్తే.. ఈ ప్రీక్వెల్ మాత్రం మూలాలను ఇంకా లోతుగా తీసుకెళ్లి చూపిస్తూ.. మరింత ఇంటెన్సిటీ, భావోద్వేగం జోడించనుందని అంటున్నారు. ఈ సినిమా విజువల్లీ వండర్ లా ఉండేలా జాగ్రత్తలు తీసుకుంటున్నట్లుగా తెలుస్తోంది. బి. అజనీష్ లోక్‌నాథ్ ఈ చిత్రాన్ని సంగీతం అందిస్తున్నారు. హోంబాలే ఫిలిమ్స్‌ విజయ్ కిరగందూర్ ఎంతో ప్రతిష్టాత్మంగా నిర్మిస్తున్న ఈ సినిమా కన్నడతో పాటు తెలుగు, హిందీ, తమిళం, మలయాళం, బెంగాళీ, ఇంగ్లీష్‌లో 2 అక్టోబర్, 2025న గ్రాండ్‌గా వరల్డ్‌వైడ్‌గా రిలీజ్ కానుంది. రిషబ్ శెట్టి విషయానికి వస్తే.. తెలుగులో బ్లాక్ బస్టర్ విజయాన్ని అందుకున్న ‘హనుమాన్’ సీక్వెల్ ‘జై హనుమాన్’లో హనుమంతుడి పాత్రలో నటిస్తున్న విషయం తెలిసిందే.

స్వేచ్ఛ ఈ – పేపర్ కోసం https://epaper.swetchadaily.com/ ఈ లింక్ క్లిక్ చేయగలరు

Just In

01

O Cheliya movie song: ‘ఓ.. చెలియా’ సినిమా నుంచి పాటను విడుదల చేసిన మంచు మనోజ్..

Khairatabad Ganesh 2025: గంగమ్మ ఒడికి.. ఖైరతాబాద్ మహా గణపతి.. భారీగా తరలివచ్చిన భక్తులు

Ponguleti Srinivasa Reddy: అభివృద్ధి సంక్షేమాన్ని ముందుకు తీసుకెళ్లడమే మా లక్ష్యం: మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి

Donald Trump: భారత్‌పై ట్రంప్ యూటర్న్.. మోదీ ఎప్పటికీ ఫ్రెండే అంటూ.. దగ్గరయ్యేందుకు తాపత్రయం!

SIIMA Awards 2025: సైమా 2025 విజేతలు ఎవరంటే?.. ఖుషీ అవుతున్న ఆ హీరోల ఫ్యాన్స్