AMANGAL MRO
తెలంగాణ, లేటెస్ట్ న్యూస్

ACB officials: ఏసీబీ వలకు చిక్కిన తహసీల్దార్, సర్వేయర్.. ఎంత లంచం అడిగారంటే

 

 

 

ACB officials: లంచగొండి అధికారులు ఎందరు పట్టుబడుతున్నా.. మిగతా అధికారుల్లో భయంబెరుకు ఉండడం లేదు. కారణం ఏంటో తెలియదు గానీ ప్రభుత్వాలు ప్రవేశపెడుతున్న అవినీతి నిర్మూలన చర్యలు పెద్దగా ఫలితాన్ని ఇవ్వడం లేదు. అవినీతి అధికారులు కనీసం రోజుకొకరైనా బయటపడుతూనే ఉన్నారు. తాజాగా రంగారెడ్డి జిల్లా అమన్‌గల్ మండల తహసీల్దార్, సర్వేయర్ ఇద్దరూ ఒకేసారి ఏసీబీ వలకు చిక్కారు. భూమి రిజిస్ట్రేషన్, భూ రికార్డులలో టైపింగ్ తప్పుల సవరణ కోసం అభ్యర్థించిన ఓ వ్యక్తిని, చెరో రూ.50 వేలు లంచం అడిగారు.

Read also- Sudershan Reddy: ఇండియా కూటమి అనూహ్య నిర్ణయం.. ఉపరాష్ట్రపతి అభ్యర్థిగా తెలుగు వ్యక్తి ఎంపిక

తహసీల్దార్ చింతకింది లలిత (ఏఓ-1 అక్యూజ్డ్ ఆఫీసర్), మండల సర్వేయర్ శ్రీ కోట రవిలను (ఏవో-2) తెలంగాణ ఏసీబీ బృందానికి (సిటీ రేంజ్ – 2 యూనిట్) రెడ్‌‌హ్యాండెడ్‌గా పట్టుబడ్డారు. ఫిర్యాదుదారుడి నాన్నమ్మకు సంబంధించిన భూముల రిజిస్ట్రేషన్‌ పూర్తి చేయడానికి, భూ రికార్డులలో టైపింగ్ తప్పుల సవరణల కోసం చెరో రూ.50,000 లంచం డిమాండ్ చేశారని ఏసీబీ (ACB officials) వివరించింది .

Read Also- Swetcha Effect: స్వేచ్ఛ ఎఫెక్ట్.. కేబుల్ వైర్లపై స్పందించిన ప్రభుత్వం.. డిప్యూటీ సీఎం కీలక ఆదేశాలు

చింతకింద లతిత అప్పటికే రూ. 50,000 నగదును ఫిర్యాదుదారుడి నుంచి తీసుకున్నారని వెల్లడించింది. నిందిత అధికారులు ఇద్దరూ తమ విధులను నిబంధనలకు విరుద్ధంగా, నిజాయితీలేకుండా నిర్వర్తిస్తున్నట్టు తేలిందంటూ విడుదల చేసిన ప్రకటనలో ఏసీబీ పేర్కొంది. ఈ కేసు ప్రస్తుతం దర్యాప్తులో ఉందని వెల్లడించింది.

అవినీతిపై ఫిర్యాదులు చేయండిప్రభుత్వాధికారుల అవినీతిపై టోల్ ఫ్రీ నంబర్ 1064కు ఫోన్ చేసి ఫిర్యాదు చేయాలని పౌరులను ఏసీబీ కోరింది. ఎవరైనా ప్రభుత్వ ఉద్యోగి లంచం డిమాండ్ చేస్తే వెంటనే ఫోన్ చేసి ఫిర్యాదు చేయవచ్చునని, చట్టపరమైన చర్యలు తీసుకుంటామని తెలిపింది. సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్స్.. వాట్సప్ (9440446106), ఫేస్‌బుక్ (Telangana ACB), ఎక్స్/గతంలో ట్విటర్ (@TelanganaACB) ద్వారా కూడా తమను సంప్రదించవచ్చునని సూచించింది. బాధితులు లేదా ఫిర్యాదుదారులకు సంబంధించిన వివరాలను గోప్యంగా ఉంచుతామని అవినీతి నిరోధక సంస్థ భరోసా ఇచ్చింది.

Read Also- India Squad: ఆసియా కప్‌కు టీమ్‌ ప్రకటించిన బీసీసీఐ.. ఎవరూ ఊహించని నిర్ణయాలు

తాండూర్‌లో ఏసీబీ దాడులు
వికారాబాద్ జిల్లా తాండూర్ మున్సిపల్ కార్యాలయంలో ఏసీబీ దాడులు చేపట్టింది. ఈ దాడుల్లో ఆర్ఐ రమేష్ పట్టుబడ్డాడు. కార్యాలయంలో దాడులు కొనసాగుతున్నట్టుగా తెలుస్తోంది.

Just In

01

Donald Trump: భారత్‌పై ట్రంప్ యూటర్న్.. మోదీ ఎప్పటికీ ఫ్రెండే అంటూ.. దగ్గరయ్యేందుకు తాపత్రయం!

SIIMA Awards 2025: సైమా 2025 విజేతలు ఎవరంటే?.. ఖుషీ అవుతున్న ఆ హీరోల ఫ్యాన్స్

Telangana Jagruthi: తెలంగాణ జాగృతి సంస్థ నాయకులు ఫైర్.. కారణం అదేనా..?

Crime News: తీరుమారని గంజాయి పెడ్లర్ పై పీడీ యాక్ట్.. ఉత్తర్వులు జారీ!

Crime News: హైదరాబాద్‌లో దారుణం.. మార్ఫింగ్ ఫోటోలతో యవతికి బెదిరింపులు