World of Thama: వరల్డ్ ఆఫ్ థామ టీజర్ ఈ రోజు ఉదయం 11:11 గంటలకు విడుదలైంది. ఈ హారర్-కామెడీ చిత్రం మ్యాడాక్ ఫిల్మ్స్ హారర్ యూనివర్స్‌లో భాగంగా రూపొందింది. ఈ చిత్రంలో ఆయుష్మాన్ ఖురానా, రష్మిక మందన్న, నవాజుద్దీన్ సిద్దిఖీ, పరేష్ రావల్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. ఈ సినిమా కోసం అటు బాలీవుడ్ ఫ్యాన్స్, ఇటు టాలీవుడ్ ఫ్యాన్స్ ఎంతగానో ఎదురుచూస్తున్నారు.
విజయ్ నగర్‌లోని వాంపైర్ లెజెండ్స్‌ను అన్వేషించే ఒక చరిత్రకారుడి కథ ఆధారంగా రూపొందింది. టీజర్‌లో స్ట్రీ, భేడియా, ముంజ్యా వంటి పాత్రలను సూచిస్తూ నవాజుద్దీన్ సిద్దిఖీ వాయిస్‌తో ఒక భయానకమైన, రొమాంటిక్ కథను పరిచయం చేశారు. ఈ చిత్రం 2025 దీపావళి సందర్భంగా ప్రేక్షకుల ముందుకు రానుంది.