TGPSC Notification: రాష్ట్ర ప్రభుత్వం గతంలో ఆమోదం తెలిపిన 24 డిప్యూటీ ఎడ్యుకేషన్ ఆఫీసర్ల పోస్టు, 110 డైట్, బీఈడీ, లెక్చరర్ పోస్టులు, 8 పీడీ పోస్టులకు నోటిఫికేషన్ జారీ చేయాలని రాష్ట్ర డీఈడీ, బీఈడీ అభ్యర్థుల సంఘం టీజీపీఎస్సీకి సోమవారం వినతిపత్రం అందించారు. ఈ పోస్టులకు 2022 నవంబర్ 12న ఆర్థిక శాఖ అనుమతి కూడా ఇచ్చిందన్నారు. రెండు నెలల క్రితం ప్రభుత్వం కూడా ఈ పోస్టులకు నోటిఫికేషన్ జారీ చేయాలని ఆదేశాలు ఇచ్చిందని గుర్తుచేశారు.
ఈ నోటిఫికేషన్స్ కోసం లక్షలాది మంది అభ్యర్థులు ఎదురు చూస్తున్నారన్నారు. అలాగే పరీక్షల అర్హతలు, సిలబస్ పై నిర్ణయం తీసుకోవాలని కోరారు. అలాగే పెండింగ్ లో ఉన్న డిగ్రీ లెక్చరర్ పోస్టులకు నోటిఫికేషన్ జారీ చేయాలని విజ్ఞప్తిచేశారు. డిగ్రీ లెక్చరర్ పోస్టులకు గతంలో నోటిఫికేషన్ జారీచేసి మూడుసార్లు అప్లికేషన్ స్వీకరణ తేదీలు ఇచ్చి వాయిదా వేశారని గుర్తుచేశారు. డిగ్రీ లెక్చరర్ పోస్టులకు కూడా నోటిఫికేషన్ జారీ చేయాలని వారు డిమాండ్ చేశారు.