Jr NTR Fans: ఎన్టీఆర్, హృతిక్ రోషన్ కలిసి నటించిన బాలీవుడ్ స్పై యాక్షన్ ఫిల్మ్ వార్ 2 ఆగస్టు 14, 2025 న పాన్-ఇండియా గా విడుదలైంది. ఈ మూవీ ప్రస్తుతం మిక్స్డ్ టాక్ తో రన్ అవుతుంది. ఎన్టీఆర్ మొదటిసారి బాలీవుడ్‌లో అడుగుపెట్టి, ఇలాంటి హై-ఓల్టేజ్ యాక్షన్ మూవీలో నటించడంతో టాలీవుడ్‌లో హైప్ క్రియోట్ అయింది.
అయాన్ ముఖర్జీ దర్శకత్వం వహించిన ఈ చిత్రానికి ఆదిత్య చోప్రా నిర్మాతగా వ్యవహరించారు. హృతిక్ రోషన్ (మేజర్ కబీర్ ధలీవాల్), జూనియర్ ఎన్టీఆర్ (విక్రమ్ చలపతి), కియారా అద్వానీ (హీరోయిన్) అనిల్ కపూర్, అశుతోష్ రాణా, బాబీ డియోల్, శార్వరి వాఘ్, దిశా సెహగల్ నటీ నటులు కీలక పాత్రల్లో నటించారు.
Also Read: VN Aditya: దాసరైనా, చిరంజీవైనా.. చర్చలతో సమస్యకి పరిష్కారం తేలేని నాయకుడు ఏ సంఘానికైనా అప్రయోజకుడే!
వార్ 2 సినిమా ప్రస్తుతం, మిక్డ్స్ టాక్ తో రన్ అవుతుంది కానీ, లాంగ్ రన్ లో థియేటర్ ఉంటుందో లేదో చూడాల్సి ఉంది. అలాగే, ఆశించిన విధంగా కలెక్షన్స్ రాకపోవడంతో ఎన్టీఆర్ ఫ్యాన్స్ ఫైర్ అవుతున్నారు. పెద్ద హీరోని తీసుకున్నప్పుడు దానికి తగినట్టుగా అతని పాత్రను మంచిగా డిజైన్ చేయాలి కదా.. బాలీవుడ్ హీరోను ఒకలా.. టాలీవుడ్ హీరోను ఒకలా చూపించడం ఎంత వరకు కరెక్ట్.