Tollywood: టాలీవుడ్ లో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, సూపర్ స్టార్ మహేష్ బాబు గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అయితే, ఈ ఇద్దరూ కలిసి ఓకే స్టేజ్ మీద సందడీ చేస్తే అది ఇంక బిగ్ బిగ్ ఈవెంట్ అవుతుంది. ప్రస్తుతం, ఏఐ టెక్నాలజీ నడుస్తుంది. హీరోల ఫ్యాన్స్ తమ అభిమాన హీరోల ఫొటోలను ఏఐ ను యూజ్ చేసి క్రియోట్ చేస్తున్నారు. అయితే, ఇప్పటి వరకు సింగిల్ గా ఉన్న ఫొటోలను మాత్రమే చూశాము. ఇప్పుడు మళ్లీ కొత్త ట్రెండ్ సెట్ చేస్తున్నారు.
Also Read: Siddepeta Tragedy: సిద్దిపేట జిల్లా చంద్లాపూర్‌లో విషాదం.. విద్యుదాఘాతంతో తండ్రి కొడుకుల మృతి
ఈ మధ్యకాలంలో తెలుగు సినీ తారల యంగ్ లుక్‌ను ఏఐ టెక్నాలజీతో కలిపి సృష్టించిన వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారింది. ఈ వీడియోలో చిరంజీవి, బాలకృష్ణ, మహేష్ బాబు, ఎన్టీఆర్, ప్రభాస్, అల్లు అర్జున్ వంటి అగ్ర కథానాయకులను ప్రస్తుత లుక్‌లను ఒకే ఫ్రేమ్‌లో చూపించారు. ఇది ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంది. ఇక ఇప్పుడు పవన్ కళ్యాణ్, సూపర్ స్టార్ మహేష్ బాబులను ఓకే ఫొటోలో ఇద్దరి ఫేస్ లను పెట్టి క్రియోట్ చేశారు. దీనికి సంబంధించిన ఫొటో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
ఇద్దరి హీరోల ఫొటోలను తీసుకుని, సింగిల్ ఫొటో గా క్రియోట్ చేసి సోషల్ మీడియాలో షేర్ చేస్తున్నారు. తాజాగా, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, సూపర్ స్టార్ మహేష్ బాబు ఫొటోలను తీసుకుని.. సూపర్ స్టార్ పవనేష్ గా క్రియోట్ చేసి, ట్రోల్స్ చేస్తున్నారు. ఈ ఫొటోను చూసిన ఫ్యాన్స్ కూడా షాక్ అవుతున్నారు. రోజు రోజుకి ఏఐ టెక్నాలజీ వాడకం విపరీతంగా పెరిగిపోతుంది. దీనిని వాడే రీతిలో వాడితే చాలా మంచిది. ఇష్టమొచ్చినట్లు వాడితే చూసే వాళ్ళకి కూడా ఇబ్బందిగా అనిపిస్తుంది. వామ్మో.. ఇంకెన్ని చూడాలో అంటూ కొందరు మండిపడుతున్నారు.
దీనిపై రియాక్ట్ అయిన పవర్ స్టార్ , మహేష్ బాబు ఫ్యాన్స్ అందరూ మా హీరోల మీదే పడ్డారేంటి? తెలుగులో హీరోలు చాలా మందే ఉన్నారుగా.. ఏంటి ఈ ఫొటోలో ఉన్నది సూపర్ పవర్ స్టార్ పవనేష్ నా? మిమ్మల్ని ఇలాగే వదిలేస్తే.. ఇంకెన్ని చేస్తారో? ఇప్పటికైనా ఇలాంటి వాళ్ళ మీద చర్యలు తీసుకోవాలని కామెంట్స్ చేస్తున్నారు.