Actor Suhas: యూనిక్ స్క్రిప్ట్‌లను సెలక్ట్ చేసుకుంటూ.. చేసిన తక్కువ సినిమాలతోనే నటుడిగా మంచి గుర్తింపును పొందిన నటుడు సుహాస్. క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా, కమెడియన్‌గా ఇలా వైవిధ్యమైన పాత్రలలో కనిపించిన సుహాస్.. హీరోగా తన సత్తా చాటుతున్నాడు. గతంలో చాలా మంది కమెడియన్స్ హీరోలుగా చేశారు. కానీ, ఎక్కువకాలం నిలవడలేదు, ఎక్కువ సినిమాలు చేయలేదు. కానీ సుహాస్.. స్ర్కిప్ట్ సెలక్షన్ ఆయనని ఒక్కో మెట్టు ఎక్కిస్తుంది. సక్సెస్ రేట్ సంగతి పక్కన పెడితే.. హీరోగా మాత్రం సుహాస్ మంచి గుర్తింపునే సొంతం చేసుకున్నాడు. సుహాస్‌తో చేసే సినిమాలకు పెద్దగా బడ్జెట్ కాదు కాబట్టి, ప్రతి సినిమా సేఫ్ జోన్‌లో ఉన్నట్టే భావించాలి. కానీ ఒక సాలిడ్ హిట్ కోసం ఆయన ప్రయత్నం చేస్తూనే ఉన్నాడు. అందరూ యునానిమస్‌గా సుహాస్‌కు హిట్ పడిందని చెప్పుకోవాలనేలా.. ప్రయత్నం చేస్తూనే ఉన్నాడు. అలాంటి టాక్‌ని, సక్సెస్‌ని ‘హే భగవాన్’ (Hey Bhagwan) సినిమా ఇస్తుందని తాజాగా ఈ చిత్ర టైటిల్ గ్లింప్స్ ఈవెంట్‌లో సుహాస్ చెప్పుకొచ్చారు.
నూతన దర్శకుడు గోపి అచ్చర దర్శకత్వంలో సుహాస్ హీరోగా కంప్లీట్ ఎంటర్‌టైనర్‌గా, త్రిశూల్ విజనరీ స్టూడియోస్ బ్యానర్‌పై బి. నరేంద్ర రెడ్డి నిర్మిస్తున్న చిత్రం ‘హే భగవాన్’. సుహాస్ పుట్టినరోజును (HBD Suhas) పురస్కరించుకుని ఈ చిత్ర టైటిల్ గ్లింప్స్ టీజర్‌ని మేకర్స్ విడుదల చేశారు. ఈ సినిమాకు ‘రైటర్ పద్మభూషణ్’ ఫేం షణ్ముక ప్రశాంత్ కథను అందించారు. ఈ టీజర్ సస్పెన్స్, కామెడీతో నిజంగానే ఆయన చెప్పిన హిట్టు రాబోతుందనే ఫీల్‌ని కలిగిస్తోంది. ఈ టీజర్‌ని గమనిస్తే.. ఒక టీమ్ వీడియో బయటికి వస్తే ఫ్యామిలీ సీక్రెట్ బిజినెస్ బయటపడిపోతుందని నరేష్ పిఎ హెచ్చరించే సన్నివేశంతో ఈ టైటిల్ టీజర్ ప్రారంభమైంది. సుహాస్ స్టైలిష్ ఎంట్రీ ఆకట్టుకోగా.. సుహాస్, శివానీ నగరం మధ్య సీక్రెట్ ఫ్యామిలీ బిజినెస్‌పై జరిగే ఓ ఆర్గ్యుమెంట్ హిలేరియస్‌గా ఉండటమే కాకుండా, సినిమాపై ఇంట్రెస్ట్ కలగజేస్తోంది. డైరెక్టర్ గోపీ అచ్చర టీజర్‌ని చాలా స్మార్ట్‌గా కట్ చేశారు. మిస్టరీ ఎక్కడా బయటపెట్టకుండా, సిట్యుయేషన్స్, క్యారెక్టర్స్‌తోనే కామెడీ జనరేట్ చేశారు. మొత్తానికి ఈ టీజర్ ‘హే భగవాన్!’ ఫుల్ ఎంటర్టైన్మెంట్ ప్యాకేజీ అవుతుందనే హైప్‌ని క్రియేట్ చేయడంలో సక్సెస్ అయిందని చెప్పుకోవచ్చు.
Also Read- VN Aditya: దాసరైనా, చిరంజీవైనా.. చర్చలతో సమస్యకి పరిష్కారం తేలేని నాయకుడు ఏ సంఘానికైనా అప్రయోజకుడే!
ఈ టీజర్ గ్లింప్స్ విడుదల అనంతరం హీరో సుహాస్ మాట్లాడుతూ.. ఈ సినిమా షూటింగ్ మంచి ఫ్లోలో స్టార్ట్ అయింది. సుదర్శన్ ఇందులో నా ఫ్రెండ్ క్యారెక్టర్ చేశాడు. మా ఇద్దరి కాంబినేషన్ చాలా అద్భుతంగా పండింది. ఇద్దరికీ ఈ సినిమాతో చాలా మంచి పేరు వస్తుందనే నమ్మకం ఉంది. శివానితో వర్క్ చేయడం ఇది రెండోసారి. ఆమెకు మంచి పేరు తెచ్చే చిత్రమిదవుతుంది. ప్రొడ్యూసర్ నరేంద్రకు థాంక్యూ. కథ వినిపించిన వెంటనే పట్టాలెక్కించారు. ఆయన ప్రొడక్షన్లో మరో సినిమా కూడా చేస్తున్నాను. త్వరలోనే ఆ వివరాలు తెలియజేస్తాం. ఈ సినిమాకి సపోర్ట్‌గా నిలిచిన వంశీకి థాంక్యూ. ఈ సినిమా చాలా పెద్ద బ్లాక్ బస్టర్ అవుతుంది. ప్రశాంత్ ఈ సినిమాకి అద్భుతమైన కథని రెడీ చేశారు. డైరెక్టర్ గోపి.. ‘కలర్ ఫోటో’, ‘రైటర్ పద్మభూషణ్’ సినిమాలకు పనిచేశారు. ఈ సినిమాతో తను డైరెక్టర్ ఇండస్ట్రీలోకి అడుగు పెడుతున్నారు. కచ్చితంగా ఈ సినిమాతో మంచి హిట్ కొడతాం. సినిమా అదిరిపోతుందని చెప్పుకొచ్చారు.
స్వేచ్ఛ ఈ – పేపర్ కోసం https://epaper.swetchadaily.com/ ఈ లింక్ క్లిక్ చేయగలరు