Coolie Collections: సూపర్ స్టార్ రజనీకాంత్ ‘కూలీ’ సినిమాతో బాక్సాఫీస్‌తో కబడ్డీ ఆడుతున్నారు. వరుస విజయాలతో దూసుకుపోతున్న సూపర్‌స్టార్‌కు కోలీవుడ్ స్టార్ డైరెక్టర్ లోకేష్ కనగరాజ్ తోడవడంతో.. టాక్‌తో పని లేకుండా ‘కూలీ’ సినిమా కాసుల వర్షం కురిపిస్తోంది. ఈ సినిమా విడుదలై 4 రోజులు అవుతున్నా.. నిర్మాత సన్ పిక్చర్స్ సంస్థ ఇంత వరకు అధికారికంగా ఒక్క పోస్టర్ కూడా విడుదల చేయలేదు. దీంతో సన్ పిక్చర్స్ సంస్థ చాలా ప్లాన్డ్‌గా వెళుతుందని అంతా భావించారు. ఇన్‌కమ్ టాక్స్ గొడవలు లేకుండా ఉండాలని ఇలా చేస్తున్నట్లుగా టాక్ వినబడుతూ వస్తుంది. దీంతో కొంత ఫ్యాన్స్ కూడా తీవ్ర నిరాశను వ్యక్తం చేస్తూ వస్తున్నారు. మరి ఇది నోటీస్ చేశారో, ఏమో తెలియదు కానీ, సోమవారం నిర్మాణ సంస్థ అధికారికంగా నాలుగు రోజుల కలెక్షన్స్ వివరాలు తెలుపుతూ.. ఓ పోస్టర్ విడుదల చేసింది. కేవలం నాలుగు రోజుల్లో బాక్సాఫీస్ దగ్గర రజనీకాంత్ ఊచకోత ఎలా ఉంటుందో.. ఈ పోస్టర్ ద్వారా తెలియజేశారు మేకర్స్.
Also Read- VC Sajjanar – Rajinikanth: మాకు డబ్బే ముఖ్యమనుకునే వారంతా రజినీ గురించి తెలుసుకోండి!
ఈ పోస్టర్ ప్రకారం.. కేవలం నాలుగు రోజుల్లోనే ఈ సినిమా రూ. 404 ప్లస్ కోట్ల గ్రాస్ కలెక్షన్లను రాబట్టింది. ‘తమిళ సినిమా హిస్టరీలోనే హయ్యస్ట్ వరల్డ్ వైడ్ గ్రాస్ కలెక్షన్స్’ అని చెబుతూ నిర్మాణ సంస్థ విడుదల చేసిన ఈ పోస్టర్ ప్రస్తుతం వైరల్ అవుతోంది. సూపర్ స్టార్ స్టామినా ఇది అనేలా ఆయన అభిమానులు సంబరాలు చేసుకుంటున్నారు. అయితే ఈ సినిమా ఇంకా బ్రేకీవెన్ సాధించాలంటే రూ. 250 ప్లస్ కోట్ల గ్రాస్ కలెక్షన్లను రాబట్టాల్సి ఉంది. అది సాధ్యమేనా? అనేలా టాక్ మొదలైంది. ఎందుకంటే, ‘కూలీ’కి పోటీగా వచ్చిన ‘వార్ 2’ సినిమా కూడా దాదాపు ఇదే తరహా కలెక్షన్లను రాబట్టినట్లుగా తెలుస్తోంది. ఈ రెండు సినిమాలు మిశ్రమ స్పందననే రాబట్టుకున్నాయి. కాకపోతే.. రజినీ మేనియా వర్కవుటై.. కలెక్షన్లు కుమ్మేస్తున్నాయి. సోమవారం నుంచి రెండు సినిమాల కలెక్షన్స్ దారుణంగా పడిపోయినట్లుగా తెలుస్తుంది.
మొదటి వీకెండ్.. ఈ రెండు సినిమాలకు బాగా కలిసి రావడంతో కలెక్షన్లు బాగా వచ్చాయి. కానీ వీక్ డేస్‌లో కూడా స్ట్రాంగ్‌గా నిలబడితేనే.. ఈ రెండు సినిమాలు సేఫ్ ప్రాజెక్ట్‌గా బయటపడతాయి. చూస్తుంటే, అది కష్టమే అనిపిస్తోంది. మొదటి నాలుగు రోజులు మాత్రం.. కళ్లు చెదిరే కలెక్షన్లతో సూపర్ స్టార్ తన సత్తా ఏంటో చూపించారని మాత్రం ఫ్యాన్స్ సంతోషపడవచ్చు. కింగ్ నాగార్జున ఫస్ట్ టైమ్ విలన్ పాత్రలో నటించిన ఈ సినిమాలో బాలీవుడ్ స్టార్ హీరో ఆమిర్ ఖాన్ మరో ముఖ్యమైన పాత్రను పోషించారు. కన్నడ స్టార్ ఉపేంద్ర, సత్యరాజ్, శృతి హాసన్ వంటి తారాగణం నటించిన ఈ సినిమాకు మ్యూజిక్ సెన్సేషన్ అనిరుద్ సంగీతం అందించారు. అయితే ఈ సినిమాతో తమిళ సినిమా ఇండస్ట్రీలో వెయ్యి కోట్ల బొమ్మ పడుతుందని అంతా ఆశించారు కానీ, ఆ కల నెలవేరేలా అయితే లేదు. మరి ఆ కోరిక తీర్చే సినిమా ఏదవుతుందో చూడాల్సి ఉంది. ఈ లెక్కన చూస్తే.. లోకేష్ కనగరాజ్ మంచి ఛాన్స్‌ని మిస్ అయ్యాడనే చెప్పుకోవచ్చు.
Karangal Osarattumey!🙌🏻💥 #Coolie Rule is unstoppable! 😎#Coolie becomes the Highest worldwide gross collection in the history of Tamil Cinema with 404+ crores in just 4 days! 🔥⚡#Coolie ruling in theatres worldwide🌟@rajinikanth @Dir_Lokesh @anirudhofficial #AamirKhan… pic.twitter.com/VMeITJCpnc
— Sun Pictures (@sunpictures) August 18, 2025
స్వేచ్ఛ ఈ – పేపర్ కోసం https://epaper.swetchadaily.com/ ఈ లింక్ క్లిక్ చేయగలరు