Medak District: మెదక్ ఉమ్మడి జిల్లాలో భారీ వర్షాలు కురుస్తున్నాయి.దీంతో సింగూరు, ఘనపూర్, పోచారం ప్రాజక్టు, హల్దీ ప్రాజక్టు లు పొంగి పోరుకుతున్నాయి. సింగూరు ప్రాజెక్టు గేట్లు ఎత్తడంతో మంజీర నది ఉగ్రరూపం దాల్చింది. ప్రమాదకర స్థాయిలో మంజీర ప్రవిస్తుంది. హల్దీ, ప్రాజక్టు,పోచారం ప్రాజక్టు లు పొంగి పోరులుతున్నాయి. దీంతో బొల్లారం మత్తడి, దుంకుతుంది. పసుపులేరు వాగు నీటి ప్రవాహం ఉదృతంగా ప్రవహిస్తుంది. అన్ని కలసి మంజీర లో కలవడం తో కామారెడ్డి(Kamareddy) జిల్లాలలోని నిజాంసాగర్ ప్రాజక్టు కు నీరు చేరుకుంటుంది. శివంపేట మండలంలో కాజీపేటలోని కుంటకు గండి పడింది. యెల్దుర్తి వద్ద హాల్దీ వాగు ఉదృతంగా ప్రవహించడంతో బ్రిడ్జి పై నుండి నీరు వెళుతుండడంతో ఉప్పులింగాపూర్.. యెల్దుర్తి కి రాకపోకలు నిలిచిపోయాయి. సిద్దిపేట, సంగారెడ్డి, జిల్లాలో సహితం వాగులు,వంకలు ,చెరువులు,కుంటలు పొంగి పోరులుతున్నాయి. మత్తడి దుంకీ అలుగు పారుతున్నాయి..ఆయా జిల్లాల్లో పంటపొలాలు నీట మునిగాయి.
Also Read: Priyanka Mohan: ‘OG’లో ప్రియాంక మోహన్ పాత్ర పేరు ఇదే.. ఫస్ట్ లుక్ విడుదల
నీటమునిగిన ఏడుపాయల
మంజీర నది ఉగ్రరూపం దాల్చడంతో ప్రమాదకర స్థాయిలో మంజీర నది ప్రవహిస్తుంది.దీంతో అడుపాయల దుర్గామాత ఆలయం నీట మునిగింది.ఆలయం పైకప్పు ను అనుకొని మంజీర ప్రవహిస్తుంది.దీంతో ఆలయ గోపురం వద్ద ఉత్సాహ విగ్రహాలకు పూజలు నిర్వహిస్తున్నారు. ఇదిలా ఉండగా సంగారెడ్డి, జిల్లా కలెక్టర్ ప్రావీణ్య, మెదక్ కలెక్టర్ రాహుల్ రాజ్, సిద్దిపేట జిల్లా కలెక్టర్ హైమవతి లు ఎప్పటికప్పుడు, వర్షం పడిన వివరాలు సేకరించి అధికారులతో మాట్లాడి..చర్యలుతీసుకుంటున్నారు.రెవెన్యూ, పోలీస్ అధికారులు అప్రమత్తమయ్యారు. ప్రాజెక్టుల వద్ద భారీ బందోబస్తు నిర్వహిస్తున్నారు.
వాగులో కొట్టుకు పోయిన కారు..
సంగారెడ్డి జిల్లా నారాయణఖేడ్ నియోజకవర్గం సిర్గాపూర్ మండలంలోని వాసవి వాగు వద్ద ప్రమాదవశాత్తు కారు నీటిలో కొట్టుకుపోయింది డ్రైవర్ ప్రాణాలతో బయటపడ్డాడు.
Also Read: Drunk Driving: రోజురోజుకు పెరుగుతున్న డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులు