Viral Video: అడవిలో ఉండే క్రూరమృగాలను దూరం నుంచి చూస్తేనే చాలా మంది హడలి పోతారు. ఒక వేళ అవి కళ్లెదుటకు వస్తే ఇక ఎలా ఉంటుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. అయితే అడవికి ఆనుకొని ఉన్న గ్రామాలు, పట్టణాల్లో జీవించే ప్రజలకు.. ఇలాంటి సందర్భాలు అడపా దడపా ఎదురవుతూనే ఉంటాయి. పులులు, చిరుతలు, అడవి ఏనుగులు జన సంచారంలోకి వచ్చిన ఘటనలు వార్తల్లో చూస్తూనే ఉన్నాం. అయితే ఓ వ్యక్తి బాత్రూమ్ లో స్నానం చేస్తుండగా.. పులి అకస్మాత్తుగా ప్రత్యక్షమై షాకిచ్చిన ఘటన మాత్రం తొలిసారి జరిగింది. ఈ ఘటన అందరినీ ఆశ్చర్యానికి గురిచేస్తోంది. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో నెట్టింట తెగ వైరల్ అవుతోంది.
వీడియోలో ఏముందంటే?
ప్రస్తుతం వైరల్ అవుతున్న వీడియోను చూస్తే ఓ వ్యక్తి బాత్రూమ్ ఉన్నాడు. ఇంతలో బాత్రూమ్ కు ఉన్న కిటికీ వద్ద ఏదో శబ్దం వినిపించింది. ఏంటా అని చూడగానే ఒక్కసారిగా అక్కడ పెద్ద పులి (Tiger) కనిపించింది. కిటికీ లోపలికి తల పెట్టి అతడి వైపునకు చూసింది. దీంతో ఆ వ్యక్తి ఒక్కసారిగా హడలిపోయాడు. అతడికి వెన్నులోంచి వణుకు పుట్టుకువచ్చింది. వెంటనే తేరుకున్న అతడు ఇందుకు సంబంధించిన దృశ్యాలను తన సెల్ ఫోన్ లో బంధించాడు. అవి కాస్త వైరల్ గా మారాయి.
View this post on Instagram
Also Read: AI Based Services: 2027 నాటికి కోటి మందికి ఏఐ ఆధారిత పౌర సేవలు.. మంత్రి శ్రీధర్ బాబు
నెటిజన్లు ఏమంటున్నారంటే?
అయితే పులి వీడియోను చూసిన నెటిజన్లు ఫన్నీగా కామెంట్స్ చేస్తున్నారు. తమదైన శైలిలో సెటైర్లు వేస్తున్నారు. ‘హాయ్ సార్. నేను మీ లోన్ రికవరీ ఏజెంట్. మీరు ఫోన్లు లిఫ్ట్ చేయకపోవడంతో నేరుగా వచ్చేశా’ అని పులి చెబుతున్నట్లు ఓ నెటిజన్ పోస్ట్ పెట్టాడు. ‘సార్ ఇప్పుడు మీరు హాట్ వాటర్ తో స్నానం చేస్తారా? లేదా చన్నీటితోనా?’ అని బాత్రూమ్ లో ఉన్న వ్యక్తిని పులి అడిగినట్లు ఇంకొకరు కామెంట్ పెట్టారు. ‘పులి తన ఫ్రెండ్ ను పలకరించడానికి వచ్చింది’ అని మరొకరు రాసుకొచ్చారు.
Also Read: Flight Catches Fire: విమానాన్ని ఢీకొట్టిన పక్షులు.. గాల్లో ఉండగానే మంటలు.. గుండెలదిరే వీడియో!
పులి రాకకు కారణమిదే!
క్రూర మృగాలు అడవి దాటి జనావాసాల్లోకి రావడానికి ప్రధానమైన కారణాలే ఉన్నాయి. అడవుల నిర్మూలన, గనుల తవ్వకం, రోడ్ల నిర్మాణం వంటి చర్యల కారణంగా జంతువులు తమ సహజ ఆవాసాలను కోల్పోతున్నాయి. అడవుల్లో ఆహార వనరులు తగ్గడం వల్ల మృగాలు ఆహారం వెతుక్కుంటూ గ్రామాల్లోకి ప్రవేశిస్తున్నాయి. వ్యవసాయం, గృహాల విస్తరణ వల్ల అడవి సరిహద్దులు జనావాసాలతో కలిసిపోవడం వల్ల కూడా వన్యప్రాణాలు ఊర్లలోకి ప్రవేశిస్తున్నాయి. అడవిలో నీటి లభ్యత తగ్గిపోయిన సందర్భాల్లోనూ ఇలా జంతువులు జనావాసాల్లోకి ప్రవేశిస్తుంటాయి.
