DMK – Vice President: ఉపరాష్ట్రపతి ఎన్నిక విషయంలో వ్యూహాత్మకంగా వ్యవహరించాలని విపక్షాల ఇండియా కూటమి భావిస్తోంది. డీఎంకే రాజ్యసభ ఎంపీ తిరుచి శివను (DMK – Vice President) కూటమి అభ్యర్థిగా ప్రకటించే అవకాశం ఉంది. ఈ మేరకు పరిశీలన చేస్తున్నట్టు తెలుస్తోంది. తిరుచి శివను ఎంపిక ఒక వ్యూహాత్మక పావుగా ఇండియా కూటమి నేతలు భావిస్తున్నారు. తమిళనాడుకే చెందిన సీసీ రాధాకృష్ణన్‌ను ఎన్డీయే అభ్యర్థిగా ఖరారైన నేపథ్యంలో, ఇదే రాష్ట్రానికి చెందిన వ్యక్తిని బరిలోకి దింపితే ప్రత్యర్థిగా నిలిచే అవకాశం ఉంటుందని కూటమి వర్గాలు విశ్లేషించుకుంటున్నాయి. వచ్చే ఏడాది తమిళనాడు అసెంబ్లీ ఎన్నికలు జరగనుండడం, ప్రాంతీయ రాజకీయాల సమస్యలను అధిగమించేందుకు తమిళనాడుకు చెందిన వ్యక్తిని బరిలోకి దింపడమే అన్ని విధాలా మంచిదని ఇండియా కూటమి నేతలు లెక్కలు వేసుకుంటున్నారని సమాచారం.
అయితే, అధికారిక అభ్యర్థి ఎవరనే విషయంపై సోమవారం (ఆగస్టు 18) రాత్రి క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే నివాసంలో జరగనున్న విపక్షాల భేటీ తర్వాత ప్రకటన వెలువడే ఛాన్స్ ఉంది. కాగా, జగదీప్ ధన్‌ఖడ్ రాజీనామా చేయడంతో ఉపరాష్ట్రపతి ఎన్నిక అనివార్యమైంది. సెప్టెంబర్ 9న ఎన్నిక జరగనుంది. ఈ ఎన్నికకు ఎన్డీఏ అభ్యర్థిగా తమిళనాడుకు చెందిన బీజేపీ ప్రముఖ నాయకుడు, మహారాష్ట్ర ప్రస్తుత గవర్నర్ సీ పీ రాధాకృష్ణన్ పేరును బీజేపీ అధిష్టానం అధికారికంగా ప్రకటించింది.
Read Also- Rajnath Singh – Sonia Gandhi: సోనియా గాంధీకి రక్షణమంత్రి రాజ్‌నాథ్ సింగ్ ఫోన్‌కాల్.. ఎందుకంటే
వ్యూహం ఏమిటి?
తమిళనాడుకు చెందిన తిరుచి శివను ఉపరాష్ట్రపతి ఎన్నికకు అభ్యర్థిగా నిలపడం ద్వారా, దక్షిణ భారతంలో పాగా వేయాలనుకుంటున్న ఎన్డీఏ వ్యూహానికి చెక్ పెట్టవచ్చునని ఇండియా కూటమి నేతలు భావిస్తున్నట్టు సమాచారం. తిరుచి శివను అభ్యర్థిగా ప్రకటిస్తే దక్షిణాది రాష్ట్రాల్లోని పార్టీలు ఆయనకు మద్దతు తెలిపే అవకాశం ఉందని కూడా లెక్కలు వేసుకుంటున్నారు. ముఖ్యంగా డీఎంకే పార్టీల్లోని ఎంపీలు వేరే ఆలోచన చేయబోరని భావిస్తున్నారు. ఒకటి రెండుసార్లు ఆలోచించుకొని సొంత పార్టీ నేతకే ఓటు వేస్తారని భావిస్తున్నారు. ఇండియా కూటమి అభ్యర్థికి మినహా మరో వ్యక్తికి ఓటు వేయబోమని డీఎంకే ఇప్పటికే చెప్పింది.
Read Also- New GST Rates: కొత్త జీఎస్టీ విధానం అమల్లోకి వస్తే.. ధరలు తగ్గే వస్తువులు ఇవే
అభ్యర్థి వేరు.. అభివృద్ధి వేరు
ఆ పార్టీ ప్రతినిధి టీకేఎస్ ఇళంగోవన్ మాట్లాడుతూ, సీపీ రాధాకృష్ణన్ అభ్యర్థిత్వం కేవలం ప్రచారం కోసమేనని వ్యాఖ్యానించారు. తమిళనాడుకు చెందినవారిని అభ్యర్థిగా నిలపడం వేరు, రాష్ట్రానికి అనుకూలంగా వ్యవహరించడం వేరు అని ఎన్డీయే కూటమిపై విమర్శలు గుప్పించారు. అని వ్యాఖ్యానించారు. తమిళ వ్యక్తిని అభ్యర్థిగా నిలబెట్టడమంటే తమిళనాడుకు అనుకూలంగా ఉండటం కాబోదని అన్నారు. బీజేపీకి తమిళనాడుతో అసలు సంబంధం లేదని, తగిన విధంగా నిధులు ఇవ్వడం లేదని ఆయన మండిపడ్డారు. బీజేపీ ఏ విషయంలోనూ తమిళనాడుకు మద్దతు ఇవ్వడం లేదని, రాష్ట్రం అభివృద్ధి చెందకూడదని వాళ్లు కోరుకుంటున్నారని ఇళంగోవన్ ఆగ్రహం వ్యక్తం చేశారు.