Flight Catches Fire: ఇటలీలో పెను విమాన ప్రమాదం తప్పింది. దాదాపు 300 మంది వరకూ ప్రయాణికులు ప్రాణాలతో బయటపడ్డారు. శనివారం రాత్రి గ్రీస్‌లోని కోర్ఫూ నుంచి బయలుదేరిన బోయింగ్ 757-300 విమానం కుడి ఇంజిన్ లో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. దీంతో ప్రయాణికులు ఆందోళనకు గురయ్యారు. ఏం జరుగుతుందో తెలియక ఆందోళన వ్యక్తం చేశారు. అయితే పైలెట్ చాకచక్యంగా వ్యవహరించి.. విమానాన్ని క్షేమంగా కిందికి దించడంతో వారంతా ప్రాణాలతో బయటపడ్డారు.
వివరాల్లోకి వెళ్తే..
జర్మనీకి చెందిన బడ్జెట్ ఎయిర్‌లైన్ ‘కాండర్’.. బోయింగ్ 757-300 విమానాన్ని నడుపుతోంది. డ్యుసెల్‌డార్ఫ్‌కి వెళ్తున్న ఈ ఫ్లైట్‌లో 273 మంది ప్రయాణికులు, ఎనిమిది మంది సిబ్బంది ఉన్నారు. టేకాఫ్ అయిన గంట తర్వాత ఇటలీలోని బ్రిండిసీ పట్టణంలో ఎమర్జెన్సీ ల్యాండింగ్ చేసింది. ఈ ఘటనకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఒక 18 సెకన్ల వీడియోలో కుడి వైపు ఇంజిన్ నుంచి మంటలు రావడం స్పష్టంగా కనిపించాయి.
⚡ Boeing Again:
German Condor Boeing 757 with 273 passengers from Corfu to Düsseldorf bursts into flames after take-off with a loud bang.
The aircraft (D-ABOK) flying from Corfu (CFU) to Dusseldorf (DUS) started spitting flames right after the take-off.
Witnesses reported… pic.twitter.com/HpSnTsRZPO
— OSINT Updates (@OsintUpdates) August 18, 2025
పక్షులు ఢీకొట్టడం వల్లే..!
మరొక వీడియోలో విమానం పక్షుల గుంపులోంచి వెళ్తూ కనిపించింది. FL360aero అనే ఏవియేషన్ న్యూస్ ప్రకారం.. ‘పక్షుల ఢీకొనడం వల్ల ఇంజిన్ ఫెయిల్యూర్’ జరిగింది. ఫ్లైట్ ట్రాకింగ్ వెబ్‌సైట్ సమాచారం ప్రకారం..ఫ్లైట్ శనివారం రాత్రి 8:19 (EEST) గంటలకు కోర్ఫూ విమానాశ్రయం నుంచి బయలుదేరి 43 నిమిషాల తర్వాత బ్రిండిసీ లోని కాసాలే ఎయిర్‌పోర్టులో అత్యవసరంగా ల్యాండ్ అయ్యింది. పైలట్ ముందుగా దెబ్బతిన్న ఇంజిన్ ఆఫ్ చేసి కోర్ఫూకి తిరిగి వెళ్లాలని అనుకున్నారు. చివరికి బ్రిండిసీలో విజయవంతంగా ల్యాండింగ్ చేశారు.
Also Read: CM Revanth Reddy: తెలంగాణలోనూ ఓట్ల చోరికి కుట్ర.. వారిని వదిలే ప్రసక్తే లేదు.. సీఎం వార్నింగ్!
ప్రయాణికుల ఇక్కట్లు..
మరోవైపు కాండర్ ఎయిర్‌లైన్స్.. ప్రయాణికులకు అసౌకర్యం కలిగినందుకు క్షమాపణలు తెలిపింది. అయితే పట్టణంలో హోటళ్ల లేమి వల్ల ప్రయాణికులు రాత్రంతా ఎయిర్‌పోర్ట్‌లోనే గడపాల్సి వచ్చింది. మరుసటి రోజు వారిని డ్యుసెల్‌డార్ఫ్‌కి పంపారు. బోయింగ్ 757 ప్రపంచంలో ఇప్పటికీ వాడుకలో ఉన్న పాత విమాన మోడళ్లలో ఒకటి. దీన్ని ‘అటారి ఫెరారీ’ అని కూడా పిలుస్తారు. ఇది ఇప్పుడు 50 ఏళ్లకు చేరువవుతున్న మోడల్.
Also Read: Ambergris Seized: 4 కేజీల బరువైన వాంతి సీజ్.. విలువ రూ.5 కోట్ల పైనే.. మ్యాటర్ ఏంటంటే?
గతంలోనూ ఇంతే..
ఇలాంటి ఘటన ఇదే మొదటిసారి కాదు. గత నెలలో డెల్టా ఎయిర్‌లైన్స్‌కు చెందిన లాస్ ఏంజిల్స్ – అట్లాంటా ఫ్లైట్ ఎడమ ఇంజిన్ లో మంటలు రావడంతో తిరిగి లాస్ ఏంజిల్స్ లో ల్యాండింగ్ చేయాల్సి వచ్చింది. అలాగే జూన్ 12న ఎయిర్ ఇండియాకి చెందిన లండన్ వెళ్తున్న బోయింగ్ 787-8 డ్రీమ్‌లైనర్ విమానం అహ్మదాబాద్ నుంచి టేకాఫ్ అయిన కొద్దిసేపటికే కుప్పకూలింది. అందులో ప్రయాణిస్తున్న 272 మందిలో ఒక్కరిని మినహా మిగతా వారందరూ మృతి చెందారు. నేలపై ఉన్న మరో 19 మంది కూడా ప్రాణాలు కోల్పోయారు. ఈ ప్రమాదంపై దర్యాప్తు కొనసాగుతోంది.