Ambergris Seized: మహారాష్ట్ర రత్నగరి జిల్లా దపోలి గ్రామంలో ఆసక్తికర ఘటన చోటుచేసుకుంది. హర్నై బీచ్ (Harnai beach) సమీపంలోని గోవా కోట వద్ద కస్టమ్స్ అధికారులు (Dapoli customs division) 4 కేజీలకు పైనే ఉన్న అంబర్ గ్రిస్ (Ambergris) ను స్వాధీనం చేసుకున్నారు. దీని మార్కెట్ విలువ రూ.5 కోట్లకు పైగా ఉంటుందని పేర్కొన్నారు. అయితే అంబర్ గ్రిస్ ను సాధారణంగా ‘తిమింగళం వాంతి’ (Whale Vomit) అని పిలుస్తారు.
సుగంధ ద్రవ్యాల తయారీకి..
అంబర్‌గ్రిస్.. స్పెర్మ్ జాతి తిమింగలాల (Sperm whale) జీర్ణవ్యవస్థలో ఏర్పడే ఘనమైన, మైనంలాంటి పదార్థం. సువాసన ఉత్పత్తుల పరిశ్రమలో సుగంధాన్ని పెంచే పదార్థంగా దీన్ని వినియోగిస్తారు. ఇది చాలా విలువైనది కూడా. అయితే అంబర్‌గ్రిస్ వాణిజ్యాన్ని కేంద్రం నిషేధించింది. స్మెర్మ్ తిమింగళాల రక్షణలో భాగంగా ఈ నిర్ణయం తీసుకుంది. దీంతో వన్యప్రాణి సంరక్షణ చట్టం ప్రకారం షెడ్యూల్-I కింద దపోలి కస్టమ్స్ విభాగం అంబర్‌గ్రిస్ ను స్వాధీనం చేసుకుంది.
పరీక్షల్లో నిర్ధారణ
పక్కా సమాచారంతో గోవా కోట వద్దకు చేరుకున్న కస్టమ్స్ అధికారులు.. అక్కడ తీరం వెంబడ ఒక జెల్లీ లాంటి పదార్థాన్ని కనుగొన్నారు. అది అంబర్‌గ్రిస్ అయి ఉండవచ్చని అనుమానించి స్వాధీనం చేసుకున్నారు. తరువాత నమూనాలను రసాయన పరీక్ష కోసం పంపి ఆ పదార్థాన్ని వన్యప్రాణి విభాగానికి అప్పగించారు. వారు దీనిని పరీక్షించి తిమింగళం వాంతిగా నిర్ధారించారు.
Also Read: AI Based Services: 2027 నాటికి కోటి మందికి ఏఐ ఆధారిత పౌర సేవలు.. మంత్రి శ్రీధర్ బాబు
అమిగ్రస్ ఎలా ఏర్పడుతుందంటే?
శాస్త్రవేత్తల ప్రకారం.. తిమింగలాలు (స్పెర్మ్ వేల్స్) సముద్ర గర్భ జీవులు. వీటిని అంతర్జాతీయ ప్రకృతి సంరక్షణ సమాఖ్య (IUCN) అంతరించిపోతున్న జాతిగా వర్గీకరించింది. తిమింగలాలు జీర్ణించుకోలేని వాటిని తిన్నప్పుడు వాటి బిల్ (ముక్కు లాంటి భాగం) లేదా ఎముకలు జీర్ణవ్యవస్థలో చిక్కుకొని ఉండిపోతాయి. అది కాలక్రమంలో అంబర్ గ్రిస్ గా రూపాంతరం చెందుతుంది. కొద్దికాలం తర్వాత తిమింగళం అమర్ గ్రిస్ ను సముద్రంలోకి విసర్జిస్తుంది. లేదా తిమింగళం మరణించిన సందర్భాల్లో అది బయటకు వచ్చి నీటిపై తెలుతూ ఉంటుంది. గత ఐదేళ్లలో భారత తీరప్రాంతాల్లో ఇలాంటివి కేవలం 2-3 సార్లే బయటపడినట్టు రికార్డులు చెబుతున్నాయి.
Also Read: Putin Bodyguards: స్పెషల్ బ్రీఫ్ కేసులో పుతిన్ మలం.. భద్రంగా తీసుకెళ్లిన బాడీగార్డ్స్.. ఎందుకంటే?
శాస్త్రవేత్త ఏం చెప్పారంటే?
‘మహారాష్ట్ర తీరంలో చాలా కాలంగా స్పెర్మ్ తిమింగలాలు కనబడలేదు’ అని కోస్టల్ కన్జర్వేషన్ ఫౌండేషన్లో సముద్ర జీవ శాస్త్రవేత్తగా ఉన్న మహి మనకేశ్వర్ (Mahi Manakeshwar) తెలిపారు. ‘స్పెర్మ్ తిమింగలాలు లోతైన సముద్ర జీవులు. అవి దూర సముద్రంలో అంబర్‌గ్రిస్‌ను విసర్జిస్తాయి. అది సముద్ర ప్రవాహాల ఆధారంగా తీరానికి చేరుతుంది. మత్స్యకారులు అంబర్‌గ్రిస్ ఎలా ఉంటుందో తెలుసు. సాధారణంగా వారు కనుగొన్నప్పుడు అధికారులకు సమాచారం ఇస్తారు’ అని వివరించారు.