Health Department ( IMAGE credit: twitter)
తెలంగాణ

Health Department: ప్రైవేట్ ఆసుపత్రుల్లో ఎనలేని నిర్లక్ష్యం.. ప్రజలు అంటే బాధ్యత లేని వైనం!

Health Department: రాష్ట్ర వ్యాప్తంగా కొన్ని ప్రైవేట్ క్లినిక్‌లు, ఆసుపత్రులకు చట్టాలంటే భయం లేదు. ప్రజలంటే బాధ్యదే లేదా? అంటూ ఉన్నతాధికారులు ఫైర్ అవుతున్నారు. ఇటీవల సంచలనం సృష్టించిన సృష్టి ఫెర్టిలిటీ సెంటర్ ఘటన తర్వాత వైద్యారోగ్యశాఖలోని పలు అంశాలపై స్టడీ చేసిన సర్కార్ కీలక విషయాలను గుర్తించింది. వైద్యశాఖ టీమ్స్ రెయిడ్స్ ద్వారా ఆధారాలతో సహా తప్పిదాలను పరిశీలించింది. గ్రేటర్ హైదరాబాద్,(Hyderabad)జిల్లాలు, ఇలా రెండు విడతల్లో ఇటీవల జరిగిన తనిఖీల్లో విస్తుపోయే అంశాలను గుర్తించింది.

ఈ నేపథ్యంలో కొన్ని ఆసుపత్రులకు ఇప్పటికే నోటీసులు ఇచ్చినట్లు తెలిసింది. మరికొన్ని కేంద్రాలకు త్వరలోనే నోటీసులు ఇవ్వనున్నారు. ధనార్జనే ధ్యేయంగా క్లినిక్‌లు, ఆసుపత్రులను నిర్వహిస్తూ, ప్రజల ప్రాణాలను రిస్క్‌లో పెడుతున్నాయి. రోగుల నుంచి భారీ స్థాయిలో ఫీజులు వసూల్ చేస్తూ రూల్స్ బ్రేక్ చేస్తున్నారు. కొన్ని క్లినిక్‌ల నుంచి ఫెర్టిలిటీ సెంటర్ల వరకు ఇదే పరిస్థితి ఉన్నది. రాష్ట్రంలో వరుస ఘటనలతో పోలీస్ శాఖ కూడా అప్రమత్తమైంది. తప్పిదాలు, నిర్లక్ష్యం జరుగుతున్న కేంద్రాలకు నోటీసులు ఇస్తూ, కేసులు ఫైల్ చేస్తున్నది.

 Also Read: Mee Seva New Service: మీ సేవ పరిధిలోకి కొత్త సేవలు.. నిమిషాలలో ఈ సర్టిఫికెట్ జారీ

రాష్ట్ర వ్యాప్తంగా ఏకంగా 20 జిల్లాల్లో సమర్ధవంతంగా పీసీ పీఎన్‌డీటీ (ప్రీ కన్సెప్షన్‌ అండ్‌ ప్రీనాటల్‌ డయాగ్నస్టిక్‌ టెక్నిక్స్‌ చట్టం-1994), ఎస్టాబ్లిష్‌మెంట్ రూల్స్ సరిగ్గా అమలు కావడం లేదని ఉన్నతాధికారుల పరిశీలనలో తేలింది. ఆయా డీఎంహెచ్‌వోల మానిటరింగ్ కూడా మొక్కుబడిగా ఉన్నట్లు గుర్తించారు. దీనిపై ప్రభుత్వం కూడా సీరియస్‌గా ఉన్నది. రూల్స్ పాటించని దవాఖాన్లు, క్లినిక్‌లు, సరోగసి కేంద్రాలు, ఐవీఎప్ సెంటర్లు తదితర వాటిపై కఠిన చర్యలు తీసుకోవాల్సిందేనని ప్రభుత్వం వైద్యారోగ్యశాఖ ఉన్నతాధికారులకు ఆదేశాలిచ్చింది.

కొందరు ఆఫీసర్ల సపోర్టు ఫుల్!
కొన్ని ప్రైవేట్ క్లినిక్‌లు, దవాఖాన్లకు ప్రభుత్వం నుంచి ఎన్నిసార్లు వార్నింగ్‌లు ఇచ్చినా, తమ నిర్లక్ష్యాన్ని, విధానాలను మార్చుకోవడం లేదు. ఇందుకు ఆయా దవాఖాన్లకు, ఫెర్టిలిటీ సెంటర్లు కొందరు అధికారులే సపోర్టు చేస్తున్నట్లు ప్రభుత్వం ప్రాథమిక పరిశీలినలో గుర్తించింది. డీఎంహెచ్‌వో దగ్గర్నుంచి అడ్మినిస్ట్రేషన్ ఆఫీసర్ల వరకు కొందరి పాత్ర ఉన్నట్లు భావిస్తున్నది. ఏదైన ఘటన జరిగిన తర్వాత అప్రమత్తమై, ఆ తర్వాత ఎస్టాబ్లిష్‌మెంట్ యాక్ట్, పీసీపీఎన్ డీటీ, తదితర వైద్యారోగ్యశాఖ రూల్స్, యాక్ట్‌లను బ్రేక్ చేస్తూ దవాఖాన్లను నడిపిస్తున్నారు.

ఇటీవల గ్రేటర్ హైదరాబాద్‌(Hyderabad)లో జరిగిన రెయిడ్స్ లో ఏకంగా 50 శాతం పర్టిలిటీ కేంద్రాలు, క్లినిక్‌లు నిబంధనలు పాటించడం లేదంటేనే పరిస్థితిని ఊహించుకోవచ్చు. వాస్తవానికి ప్రైవేట్ ఆసుపత్రులపై నిత్యం డీఎంహెచ్‌వోల నిఘా ఉండాలి. కానీ, కొందరు అధికారులు ఏకంగా ఆసుపత్రుల యాజమాన్యాలు, క్లినిక్‌లు, ఫెర్టిలిటీ కేంద్రాలతో కుమ్మక్కై, ఆ తప్పిదాల్లో భాగస్వామ్యం అవుతున్నారు. ప్రైవేట్ యాజమాన్యాలకు సహకరించినందుకు సదరు ఆఫీసర్లకు భారీ స్థాయిలో ముడుపులు అందుతున్నాయి. ఈ అంశాలన్నీ ప్రభుత్వం తన అధ్యయనంలో గుర్తించింది. అంతేగాక ఏయే అధికారి పనితీరు ఎలా ఉన్నది? అనే అంశాన్ని కూడా పరిశీలించడం గమనార్హం.

 Also Read: Jogulamba Gadwal district: గద్వాల జిల్లాలో అధ్వానంగా మారిన రోడ్లు.. పట్టించుకోని ప్రజాప్రతినిధులు అధికారులు

పర్మిషన్లలో నిర్లక్ష్యం!
ఆసుపత్రి, క్లినిక్, ఫెర్టిలిటీ సెంటర్స్ పర్మిషన్లను జిల్లా రిజిస్ట్రేషన్ అథారిటీ, జిల్లా కలెక్టర్, డీఎంహెచ్‌వోల కమిటీ ఇవ్వాల్సి ఉంటుంది. అయితే పర్మిషన్లలో డీఎంహెచ్‌వోలే కీలక పాత్ర పోషిస్తారు. సీఈఏ రూల్స్ ప్రకారం అనుమతులు మంజూరు చేస్తారు. ఒక్కసారి పర్మిషన్లు ఇస్తే 5 ఏళ్ల తర్వాత రెన్యువల్ చేసుకోవాలి. అయితే బెడ్స్, హాస్పిటల్ ఎస్టాబ్లిష్​ఏరియా, స్థానిక పరిస్థితులు వంటివన్నీ చెక్ చేసుకొని అనుమతులు ఇస్తారు. స్టాఫ్, సౌలత్‌లన్నీ సక్రమంగా ఉంటేనే పర్మిషన్లు ఇవ్వాల్సి ఉంటుంది.

అయితే కొందరు డీఎంహెచ్‌వోలు లోపాయికారి ఒప్పందాలతో అనుమతులు ఇస్తున్నారని సర్కార్ తన నివేదికలో నమోదు చేసుకున్నది. ప్రభుత్వలెక్కల ప్రకారం రాష్ట్ర వ్యాప్తంగా క్లినిక్‌లు, ఆసుపత్రులు, డిసెన్సరీలు, డయాగ్నస్టిక్‌లు కలిపి 7122 ఉండగా, వీటిలో ఎక్స్‌క్లూజీవ్‌గా 4166 ఆసుపత్రుల్లో 1 నుంచి 20 పడకలు ఉన్నాయి. 1147 ఆసుపత్రుల్లో 21 నుంచి 50 బెడ్స్ ఉన్నాయి. ఇక 51 నుంచి 100 లోపు ఉన్నవి 345 ఉండగా, 101 నుంచి 200 బెడ్ల లోపు మరో 88 ఆసుపత్రులు కొనసాగుతున్నాయి. రెండు వందల బెడ్లకు పైన 70 ఆసుపత్రుల వరకు ఉన్నాయి. వీటిలో 50 శాతం దవాఖాన్లలో తప్పిదాలు, నిర్లక్ష్యం స్పష్టంగా ఉన్నట్లు సర్కార్ స్టడీలో తేలింది.

పొంతన లేదు..
క్లినిక్‌లు, ప్రైవేట్ దవాఖాన్లు, ఫెర్టిలిటీ సెంటర్లలో రికార్డుల నుంచి ఆసుపత్రి మెయింటనెన్స్ వరకు తప్పుల తడకగా ఉన్నట్లు అధికారులు గుర్తించారు. ప్రధానంగా మ్యానువల్‌గా మెయింటెన్ చేసే రికార్డులు, ఆన్‌లైన్ పోర్టల్‌కు చాలా వ్యత్సాసాలు ఉన్నాయి. స్కానింగ్‌లు, ప్రెగ్నెన్సీ వివరాలు, ట్రీట్మెంట్ ప్రోటోకాల్, ఫీజుల వివరాలు, స్టాఫ్​తదితర తప్పుల తడకగా ఉన్నట్లు అధికారుల పరిశీలనలో తేలింది. కొన్ని ఫర్టిలిటీ సెంటర్లలో ఎంబ్రాలజిస్టులు, రేడియాలజిస్టులు లేకుండానే ఫెర్టిలిటీ కేంద్రాలు నిర్వహిస్తున్నారు. రిజిస్ట్రేషన్ చేసే సమయంలో పొందుపరిచిన రేడియాలజిస్టుల పేర్లను చూపుతూ ముందుకు సాగుతున్నారు. ప్రస్తుతానికి ఆయా డాక్టర్లు, టెక్నికల్ స్టాఫ్​లేకున్నా, వాళ్ల పేర్లతోనే కొన్ని కేంద్రాలు సజావుగా నడుస్తున్నాయి.

కొన్ని కేంద్రాలు అసిస్టెంట్లతో, ల్యాబ్ టెక్నిషియన్లతో నిర్వహిస్తున్నారు. క్లినిక్‌లు, దవాఖాన్లు, ఫర్టిలిటీ సెంటర్లలో పనిచేస్తున్న స్టాఫ్‌కు, ఆన్‌లైన్‌లో పొందుపరుస్తున్న సంఖ్యకు ఎలాంటి పొంతన లేకుండా ఉన్నది. ఆధార్ కార్డుల వివరాలను కూడా తప్పుగా ఎంట్రీ చేస్తున్న కేంద్రాలూ ఉన్నాయని అధికారులు చెప్తున్నారు. వాస్తవానికి పీసీఎన్‌టీడీ యాక్ట్ ప్రకారం స్కానింగ్‌లు, గర్భిణీల వివరాలు తప్పనిసరిగా ప్రభుత్వం ఆధీనంలోని పోర్టల్‌లో ఎంట్రీ చేయాల్సి ఉంటుంది. ప్రతీ నెల తప్పనిసరిగా వైద్యాధికారులకు నివేదిక పంపించాలి. చాలా కేంద్రాలు ఏళ్ల తరబడి వీటిని పక్కకు పడేశాయి. ధనార్జనే థ్యేయంగా ముందుకు సాగుతున్నాయి. మరోవైపు మెడికల్​ షాపులో లభించే మాత్రలు, ఇంజెక్షన్ల సాయంతో సులభంగా ఆడ పిల్లలను అబార్షన్ల ద్వారా చంపేస్తున్నా, డీఎంహెచ్‌వోలు మొక్కుబడి తనంగా వ్యవహరిస్తున్నారనే విమర్శలు వస్తున్నాయి.

 Also Read: Khammam Rains: ఆ జిల్లాలో భారీ వర్షాలు.. ప్రభుత్వ ప్రైవేటు పాఠశాలలకు సెలవులు

Just In

01

O Cheliya movie song: ‘ఓ.. చెలియా’ సినిమా నుంచి పాటను విడుదల చేసిన మంచు మనోజ్..

Khairatabad Ganesh 2025: గంగమ్మ ఒడికి.. ఖైరతాబాద్ మహా గణపతి.. భారీగా తరలివచ్చిన భక్తులు

Ponguleti Srinivasa Reddy: అభివృద్ధి సంక్షేమాన్ని ముందుకు తీసుకెళ్లడమే మా లక్ష్యం: మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి

Donald Trump: భారత్‌పై ట్రంప్ యూటర్న్.. మోదీ ఎప్పటికీ ఫ్రెండే అంటూ.. దగ్గరయ్యేందుకు తాపత్రయం!

SIIMA Awards 2025: సైమా 2025 విజేతలు ఎవరంటే?.. ఖుషీ అవుతున్న ఆ హీరోల ఫ్యాన్స్